నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. యాపిల్ కొత్త స్టోర్స్‌లో బోలెడన్ని ఉద్యోగాలు.. మీరూ అప్లై చేసుకోండి!
Apple India stores: యాపిల్ సంస్థ భారతదేశంలో రిటైల్ రంగంలో దూకుడు పెంచుతోంది. ఇంతకుముందు ముంబైలో యాపిల్ బీకేసీ, ఢిల్లీలో యాపిల్ సాకేత్ స్టోర్లు అందుబాటులోకి తెచ్చింది ఇవి సక్సెస్ కావడంతో తమ స్టోర్లను ఇప్పుడు మరో నాలుగు నగరాలకు విస్తరిస్తోంది. ఢిల్లీ NCR, ముంబై, పూణె, బెంగళూరు నగరాల్లో సరికొత్త యాపిల్ స్టోర్లను ప్రారంభించనుంది. ఈ టెక్ దిగ్గజం ఈ విస్తరణ ప్రణాళికతో భారతీయ వినియోగదారులకు మరింత చేరువ కానుంది.
అంతేకాదు, కొత్త యాపిల్ స్టోర్లలో ఉద్యోగాల జాతర కూడా మొదలైపోయింది. జాన్ టాఫీ అనే యాపిల్ స్టోర్ లీడర్ స్వయంగా లింక్డ్‌ఇన్‌లో ఈ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ నగరాలలో యాపిల్ వృద్ధి చెందడం పట్ల తాము ఎంతో ఉత్సాహంగా ఉన్నామని అన్నారు. మంచి టాలెంట్ ఉన్న వ్యక్తులు రిటైల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

స్టోర్లలో పనిచేయాలనే అభిరుచి గల వ్యక్తులకు ఈ ఉద్యోగాలు ఎప్పుడూ తెరుచుకునే ఉంటాయి. యాపిల్ జాబ్ పోర్టల్ \"జాబ్స్ ఎట్ యాపిల్\"లో ఇరవైకి పైగా జాబ్ నోటిఫికేషన్లు దర్శనమిస్తున్నాయి. అందులో దాదాపు సగం ఉద్యోగాలు రిటైల్ స్టోర్స్‌లోనే పనిచేయడానికి కావడం విశేషం.
* భారతదేశానికి ఇండియా మంచి మార్కెట్..
అసలు ఇండియాపై యాపిల్ ఇంతగా ఫోకస్ పెట్టడానికి కారణం ఏంటంటే.. మన దేశం యాపిల్‌కి చాలా ఫేవరెట్ మార్కెట్ అయిపోయింది మరి. 2025 మొదటి మూడు నెలల్లోనే రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ముంబై, ఢిల్లీ స్టోర్లకు వచ్చిన రెస్పాన్స్ చూసి యాపిల్ ఫుల్ ఖుషీ అయిపోయింది.
అందుకే ఇప్పుడు భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. ఈ స్టోర్లలోకి వెళ్తే లగ్జరీ షాపింగ్ ఎక్స్‌పీరియన్స్‌తో పాటు, ఇండియాలో యాపిల్ ఫ్యాన్స్ కమ్యూనిటీని మరింత పెంచుకోవచ్చని యాపిల్ భావిస్తోంది. యాపిల్ తన మొదటి ఇండియన్ స్టోర్స్‌ను 2023లో గ్రాండ్‌గా ఓపెన్ చేసింది. అప్పుడే ఐఫోన్ కొత్త మోడల్ లాంచ్ అయిన టైమ్‌లో జనాలు ఎగబడి కొన్నారు.
* కొత్త స్టోర్లతో లాభాలు
ఇప్పుడు ఈ కొత్త స్టోర్స్‌తో, మరింత మంది కస్టమర్లకు యాపిల్ రిటైల్ ఎక్స్‌పీరియన్స్ సొంతమవుతుంది. అంతేకాదు, టెక్ ఎక్స్‌పర్ట్స్ సపోర్ట్, స్టోర్ ఈవెంట్స్ కూడా అందుబాటులోకి వస్తాయి. ఇండియా కోసం యాపిల్ వేసిన పెద్ద ప్లాన్స్‌లో ఇదొకటి చెప్పొచ్చు. చూస్తుంటే, కొత్త స్టోర్లు, బోలెడన్ని ఉద్యోగాలతో ఇండియాలో యాపిల్ మరింత స్ట్రాంగ్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
* ఐఫోన్ లవర్స్‌కి మరో న్యూస్..
యాపిల్ సన్నని ఐఫోన్‌ను రిలీజ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఐఫోన్ 17 ఎయిర్ పేరుతో సెప్టెంబర్‌లో లాంచ్ చేసే ఛాన్స్ ఉంది. ఐఫోన్ 17 సిరీస్‌లో ప్లస్ మోడల్‌కు బదులుగా ఈ స్లిమ్ మోడల్ రానుందని టాక్. లైట్ వెయిట్ డిజైన్, పవర్‌ఫుల్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ దీని ముఖ్యమైన ఫీచర్లు.
సెప్టెంబర్ 9 నుంచి 11 మధ్యలో ఈ ఫోన్‌ను అఫీషియల్‌గా అనౌన్స్ చేయొచ్చు, సేల్స్ మాత్రం సెప్టెంబర్ 18 లేదా 19 నుంచి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ రూమర్స్ నిజమైతే, ఐఫోన్ 17 ఎయిర్ ప్రపంచంలోనే సన్నని స్మార్ట్‌ఫోన్‌గా రికార్డు క్రియేట్ చేయడం పక్కా.


Click it and Unblock the Notifications








