Home
News

Apple M4 Chip నవంబర్‌ 1వ తేదీన ఆపిల్‌ ఏం చేయనుంది.. తాజా లీక్స్‌ ఏం చెబుతున్నాయి..?

ఆపిల్‌ నుంచి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న అనేక ఉత్పత్తులు (Apple Upcoming Launches) త్వరలో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. M4 చిప్‌సెట్‌లతో కూడిన మ్యాక్‌బుక్‌లు లాంచ్‌ కానున్నాయి. బ్లూమ్‌బెర్గ్‌ మార్క్‌ గుర్మన్‌ నివేదిక ఆధారంగా మ్యాక్‌బుక్‌ ప్రో సహా M4 చిప్‌సెట్‌తో కూడిన వివిధ మోడళ్లు నవంబర్‌ 1న విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ జాబితాలో 14 అంగుళాల మ్యాక్‌బుక్‌ ప్రో M4 చిప్‌సెట్‌తో లాంచ్‌ కానుందని తెలుస్తోంది.

దీంతోపాటు (Apple M4 Chip) 14 అంగుళాల మ్యాక్‌బుక్‌ ప్రో M4 ప్రో చిప్‌సెట్‌, 16 అంగుళాల మ్యాక్‌బుక్‌ ప్రో M4 మ్యాక్‌ చిప్‌సెట్‌తో లాంచ్‌ కానుందని తెలుస్తోంది. దీంతోపాటు M4 చిప్‌సెట్‌తో కూడిన ఐమ్యాక్‌ మరియు మ్యాక్‌ మినీ M4, M4 ప్రో వేరియంట్‌లు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

apple may launched M4 chip powered products on november 1st 2024 leakes suggested

వీటితోపాటు 2025 సంవత్సరంలో ఆపిల్‌ మరిన్ని ఉత్పత్తులను లాంచ్‌ చేయనుంది. M4 చిప్‌సెట్‌తో కూడిన 13 అంగుళాలు, 15 అంగుళాల మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ మోడళ్లను లాంచ్‌ చేయనుంది. దీంతోపాటు ఐఫోన్ SE 4 మోడల్‌ సహా 11 అంగుళాలు, 13 అంగుళాల ఐప్యాడ్‌ ఎయిర్‌ కూడా విడుదల కానుందని తెలుస్తోంది. దీంతోపాటు ఎయిర్‌ట్యాగ్‌ అప్‌డేట్‌ వెర్షన్‌, మ్యాక్‌ స్టూడియో మరియు M4 చిప్‌తో కూడిన మ్యాక్ ప్రో మోడళ్లను కూడా లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది.

అయితే ఈ ఉత్పత్తులు చాలావరకు అభివృద్ధి దశలో ఉన్నాయి. వీటి విడుదల తేదీలు సహా ఇతర స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌ల వివరాలు తెలియాల్సి ఉంది. ఇటీవల వచ్చిన గుర్మన్‌ నివేదిక ఆధారంగా ఐఫోన్‌ SE 4 మార్చి 2025లో విడుదల కానుందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ హ్యాండ్‌సెట్‌ సంబంధించిన అనేక వివరాలు లీక్‌ అవ్వగా.. తాజాగా డిస్‌ప్లే వివరాలు లీక్‌ అయ్యాయి.

గుర్మన్‌ లీక్స్‌ ఆధారంగా ఐఫోన్ SE 4 మోడల్‌ నాచ్‌తో కూడిన ఎడ్జ్‌ టూ ఎడ్జ్‌ స్క్రీన్‌తో ఐఫోన్‌ 14 తరహా డిజైన్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. ప్రస్తుత ఐఫోన్ SE 3 మోడల్‌ కేవలం 4.7 అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంది. త్వరలో విడుదల కానున్న ఐఫోన్ SE 4 మోడల్‌ 6.1 అంగుళాల OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలుస్తోంది.

దీంతోపాటు ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ సపోర్టు, యాక్షన్‌ బటన్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతోపాటు కెమెరా విభాగం పరంగా 48MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అనేక ఆధునిక ఫీచర్‌ సహా అప్‌గ్రేడ్‌ల కారణంగా ఐఫోన్‌ SE 4 మోడళ్‌ ధర రూ.49,900 గా ఉంటుందని తెలుస్తోంది. అయితే ఈ వివరాలపై ఆపిల్‌ ఎటువంటి ప్రకటన చేయలేదు.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple Expected to launch Macbook pro M4 and iPad Mini M4, iMac M4 on november 1st 2024 here are the details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X