iPhone 14 స‌ర‌ఫరాలో స‌మ‌స్యలున్నాయా.. విడుద‌ల ఆల‌స్యం కానుందా!

|

Appleకంపెనీ నుంచి iPhone 14 విడుద‌ల‌ కోసం టెక్ ప్రియులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ, సెప్టెంబ‌ర్‌లో ఆ స్మార్ట్‌ఫోన్‌ విడుద‌ల చేయాల్సి ఉండ‌గా.. ఉత్ప‌త్తిలో భాగంగా కంపెనీ కొన్ని స‌ర‌ఫ‌రా స‌మ‌స్య‌లను ఎందుర్కొంటున్న‌ట్లు తెలుస్తోంది. iPhone 14 స్మార్ట్‌ఫోన్ల ఉత్ప‌త్తికి కావాల్సిన కెమెరాల లెన్స్ సంబంధించిన స‌ర‌ఫ‌రా స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు చైనాకు చెందిన ప్ర‌ముఖ Apple విశ్లేష‌కుడు మింగ్ కువో వెల్ల‌డించారు.

 
iPhone 14 స‌ర‌ఫరాలో స‌మ‌స్యలున్నాయా.. విడుద‌ల ఆల‌స్యం కానుందా!

iPhone 14 ఉత్ప‌త్తిలో కెమెరా లెన్స్ కొర‌త‌:
ప్ర‌ముఖ విశ్లేష‌కుడు మింగ్ కువో వెల్ల‌డించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. Apple కంపెనీ ఇదువ‌ర‌కే క‌రోనా మ‌హ‌మ్మారి కార‌ణంగా లాక్‌డౌన్‌తో గ‌తంలో స‌ప్లై చైన్ లో కొర‌త స‌మ‌స్య‌ను ఎదుర్కొంది. కాబ‌ట్టి ఈసారి అటువంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కోకుండా ఉండాల‌ని.. iPhone 14 విడుద‌లలో జాప్యం జ‌ర‌గ‌కుండా చేసేందుకు భారీ ఉత్ప‌త్తిలో భాగంగా స‌ర‌ఫ‌రా విభాగాల‌ను కూడా మెరుగుప‌రిచింది. కానీ, ఈ సారి యాపిల్‌కు కెమెరా లెన్స్ స‌ర‌ఫరా చేసే జీనియ‌స్‌, iPhone 14 కెమెరా లెన్స్‌లో క్వాలిటీ స‌మ‌స్య‌ను ఎదుర్కొంది. ఈ ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు సంబంధించిన విష‌యాల‌ను కువో ట్విట‌ర్ వేదిక‌గా అప్‌డేట్ చేశారు. జీనియస్ iPhone 14 బ్యాక్ కెమెరా లెన్స్‌ల విష‌యంలో కోటింగ్-క్రాక్ క్వాలిటీ స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లు పేర్కొన్నారు.

లాంచ్ విష‌యంలో జాప్యం ఉండ‌దు..
దీంతో, Apple మ‌రో కెమెరా లెన్స్ స‌ర‌ఫ‌రా విభాగం అయిన లార్గాన్‌కు 10 మిలియ‌న్ కెమెరా లెన్స్‌ల ఆర్డర్‌ను చేసింది. అదృష్ట‌వ‌శాత్తూ ఈ తైవానీస్ కంపెనీ స‌ప్లై చైన్‌లో ఏర్ప‌డిన ఈ అంత‌రాయాన్ని వీలైనంత త్వ‌ర‌గా క్లియ‌ర్ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో iPhone 14 విడుద‌ల విష‌యంలో యాపిల్‌కు ఎలాంటి జాప్యం జ‌ర‌గ‌బోద‌ని స్ప‌ష్టం అయింది. ఇదిలా ఉండ‌గా.. జీనియ‌స్ కంపెనీ కెమెరా లెన్స్‌ల క్వాలిటీ స‌మ‌స్య‌ల‌పై స్పందించాల్సి ఉంద‌ని కువో పేర్కొన్నారు.

iPhone 14 స‌ర‌ఫరాలో స‌మ‌స్యలున్నాయా.. విడుద‌ల ఆల‌స్యం కానుందా!

ఒక‌వేళ జీనియ‌స్ కంపెనీ iPhone 14 బ్యాక్ కెమెరా లెన్స్ సంబంధించిన స‌మ‌స్య‌ను పరిష్కరించకపోతే.. లార్గాన్ కంపెనీ ఆపిల్ నుండి మరింత భారీ ఆర్డర్‌ను పొందే అవకాశం ఉంది. ఐఫోన్ 14 సిరీస్ సరఫరా సమస్యలను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి కాదు. గ‌తంలో కూడా, ఐఫోన్ 14 డిస్‌ప్లే మరియు ర్యామ్‌కి సరఫరా ఆలస్యాన్ని కూడా కువో పేర్కొన్న విష‌యం తెలిసిందే.

Apple iPhone 14 మోడ‌ల్స్ ఎన్ని:
Apple iPhone 14 ను సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌నున్న‌ట్లు కంపెనీ ఇదువ‌ర‌కే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. యాపిల్‌ నాలుగు మోడల్స్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. వీటిలో iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro మరియు iPhone 14 Pro Max ఉన్నాయి. ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మాక్స్ అన్ని తాజా అప్‌గ్రేడ్‌లతో కూడిన హై-ఎండ్ మోడల్‌లుగా చెప్పబడుతున్నాయి. మ‌రోవైపు ఐఫోన్ 14 మరియు మాక్స్ మోడల్‌లు ముందు విడుద‌లైన‌ ఐఫోన్ 13 సిరీస్‌కు సంబంధించిన కొన్ని లక్షణాలను కలిగి ఉంటాయ‌ని తెలుస్తోంది.

 

ఇదిలా ఉండ‌గా.. యాపిల్ ఇకపై మినీ వేరియంట్‌ను ప‌క్క‌న పెట్ట‌నున్న‌ట్లు ధృవీకరించబడింది. ఇప్పటివరకు ఎదురైన ఈ స‌ప్లై చైన్ స‌మ‌స్య‌లు భారీ ఉత్పత్తిని ప్రభావితం చేయనంత వ‌ర‌కు, Apple iPhone 14 లాంచ్ విష‌యంలో ఎలాంటి జాప్యం ఉండదు. రాబోయే రోజుల్లో మరిన్ని అప్‌డేట్‌లు వచ్చే అవకాశం ఉంది.

iPhone 14 స‌ర‌ఫరాలో స‌మ‌స్యలున్నాయా.. విడుద‌ల ఆల‌స్యం కానుందా!

లీకుల ప్ర‌కారం రాబోయే iPhone 14 లో ఉండే ప్ర‌త్యేక‌త‌లు:
Apple విడుద‌ల చేయ‌బోయే ఈ iPhone 14 కు భారీగా డిమాండ్ ఉండ‌బోతోందని ఇప్ప‌టికే ప‌లు నివేదిక‌లు లీకులు ఇచ్చిన విష‌యంలో తెలిసిందే. చైనాలో ఇప్ప‌టికే ఈ మొబైల్స్‌కు డిస్ట్రిబ్యూట‌ర్లు, రిటైల‌ర్ల నుంచి భారీగా ప్రీపెయిడ్ డిపాజిట్లు జ‌రిగిన‌ట్లు కువో గ‌తంలో తెలిపారు. ఈ క్ర‌మంలో ఈ సీరీస్‌కు సంబంధించిన విశేషాల‌పై ఓ లుక్కేద్దాం.

అత్య‌ధికంగా ప్రీపెయిడ్ డిపాజిట్లు:
ఇప్ప‌టికే, ప్రస్తుతం iPhone 14 కు ప్రీపెయిడ్ డిపాజిట్, iPhone 13 కంటే చాలా ఎక్కువగా ఉందని, ఇది చైనాలోని కొన్ని ప్రాంతాలలో సాధారణ ప్రీపెయిడ్ మొత్తం కంటే రెండింతలు ఎక్కువగా ఉంటుందని కువో తెలిపారు. కాంపోనెంట్ సరఫరాదారుల ఐఫోన్ 14 షిప్‌మెంట్ అంచనా సుమారు 100 మిలియన్ యూనిట్లు ఉన్న‌ట్లు విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. అంతేకాకుండా EMS 90 మిలియన్ యూనిట్లు ఉంటుంద‌ని విశ్లేషకుడు చెప్పారు.

బ్యాట‌రీనే కీల‌కం:
ఈ ఫోన్ గురించి గ‌తంలో విడుద‌లైన నివేదిక ప్రకారం, iPhone 14 సిరీస్ iPhone 13 సిరీస్ కంటే మ‌రింత సామ‌ర్థ్యం ఉన్న బ్యాట‌రీల‌తో వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. iPhone 14 కు 3,279mAh బ్యాటరీతో లాంచ్ చేయబడుతుందని మరియు iPhone 14 Pro మొబైల్‌కు 3,200mAh బ్యాటరీ ఉంటుంద‌ని నివేదిక పేర్కొంది. iPhone 14 Max హ్యాండ్‌సెట్‌కు 4,325mAh బ్యాటరీని పొందుతుందని మరియు మరోవైపు, iPhone 14 Pro Max స్మార్ట్‌ఫోన్‌కు 4,323mAh బ్యాటరీని కలిగి ఉంటుందని నివేదిక లీకుల ద్వారా తెలుస్తోంది.

iPhone 14 స‌ర‌ఫరాలో స‌మ‌స్యలున్నాయా.. విడుద‌ల ఆల‌స్యం కానుందా!

iPhone14 మ్యాక్స్ లీక్ స్పెసిఫికేషన్‌ల వివరాలు
iPhone14 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ కి సంబందించిన స్పెసిఫికేషన్స్ వివరాలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ లీక్ సమాచారం ప్రకారం ఆపిల్ సంస్థ నుంచి రాబోయే ఐఫోన్ 14 మ్యాక్స్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.68-అంగుళాల ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 2,778×1,284 పరిమాణంలో 458 పిక్సెల్‌ల(PPI) సాంద్రతను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుత జెనరేషన్ A15 బయోనిక్ SoCతో రన్ అవుతూ 6GB LPDDR4X RAMతో జతచేయబడి వస్తుంది. ప్రస్తుతం అదే చిప్ తో ఐఫోన్13 సిరీస్ ఫోన్లు మరియు కొత్త ఐఫోన్ SE (2022) కూడా శక్తిని పొందుతున్నాయి. గత లీక్‌ల ప్రకారం ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్14 ప్రో మాక్స్ ఫోన్లు రెండు కూడా A16 బయోనిక్ SoCలతో శక్తిని పొందే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Apple Faces Supply Delays For iPhone 14 Rear Camera Lens; Will It Affect Launch And Shipping?

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X