'ఆపిల్ న్యూ ఐప్యాడ్' ని మొదట కోనుగోలు చేసేది ఎవరు..?

Posted By: Super

'ఆపిల్ న్యూ ఐప్యాడ్' ని మొదట కోనుగోలు చేసేది ఎవరు..?

 

మార్చి 16 ఈరోజుకి ఎంతో ప్రత్యేకత ఉంది. మొదటిది ప్రపంచంలో నాల్గవ పెద్ద ఆర్దిక వ్యవస్దగా ఉన్న భారత్ ఈరోజు తన బడ్జెట్‌ని ప్రవేశపెడుతుంది. రెండవది ఆసియా కప్‌లో టీమిండియా, బంగ్లాదేశ్‌తో తలపడనుంది. గత సంవత్సర నుండి తన శతకాల సెంచరీ కోసం వేచిచూస్తున్న క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఈ మ్యాచ్‌లోనైనా వందో సెంచరీని సాధిస్తాడని అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక మూడవది టెక్నాలజీ రంగంలో విశేషంగా సేవలందిస్తున్న ఆపిల్ కంపెనీ కొత్తగా ఆవిష్కరించిన 'ఆపిల్ న్యూ ఐప్యాడ్' ని ఈరోజే ఆపిల్ స్టోర్స్‌లోకి ఉదయం 8 గంటలకు విడుదల చేస్తుంది.

'ఆపిల్ న్యూ ఐప్యాడ్' ని మొదట కోనుగోలు చేసేది ఎవరు..?

'ఆపిల్ న్యూ ఐప్యాడ్' మొదటగా కొనుగోలు చేసే దేశస్దులు అమెరికన్లు అనుకుంటే పోరపాటే. 'ఆపిల్ న్యూ ఐప్యాడ్' ని ప్రపంచ వ్యాప్తంగా  లండన్, అమెరికా, కెనడా, ఆస్టేలియా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, హాంగ్ కాంగ్, స్విట్జర్లాండ్, సింగపూర్, పుర్టినో రికో లాంటి దేశాలలో విడుదల చేస్తున్నారు. కాలమానం ప్రకారం కాలిఫోర్నియాతో పోలిస్తే జపాన్ దేశ రాజధాని టోక్యో 16 గంటలు ముందు ఉన్నారు. దీనిని బట్టి చూస్తే అమెరికన్లే కంటే ముందు మార్చి 16 జపనీస్‌కే వస్తుంది. కాబట్టి ప్రపంచంలో మొదటి 'ఆపిల్ న్యూ ఐప్యాడ్'ని అందుకోనున్న ప్రజలు జపనీస్ కావడం విశేషం.

ఈ క్రింద చిత్రంలో మీరు గనుక గమనించినట్లేత జపాన్ రాజధాని టోక్యోలోని గింజా జిల్లాలో ఉన్న ఆపిల్ స్టోర్ వద్ద ఉదయం 3.30 గంటల నుండే ప్రజలు బారులు తీరి ఉన్నారు. క్యూలో ముందు వరుసలో ఉన్న ప్రజలు చలినిసైతం లెక్కచేయకుండా కూర్చొని ఉన్నారు.

'ఆపిల్ న్యూ ఐప్యాడ్' ని మొదట కోనుగోలు చేసేది ఎవరు..?

ఇంకా చెప్పాలంటే జపాన్‌లో ఆపిల్ ఉత్పత్తులకు ఉన్న గిరాకీ, డిమాండ్ మరే ఏదేశంలో ఉండదు. 'ఆపిల్ న్యూ ఐప్యాడ్' ని తామే మందుగా సొంతం చేసుకోవాలన్న వారి తపనను చూస్తుంటే ముచ్చట వేస్తుంది. ఇక ఆపిల్ స్టోర్ ప్రతినిధులు మాట్లాడుతూ గతంలో ఆపిల్ విడుదల చేసిన తర్వాత ఐఫోన్ 4ఎస్ తర్వాత పెద్ద ఎత్తున అభిమానులు ఇప్పుడేనని అన్నారు. ఆపిల్ ఐఫోన్ 4ఎస్ విడుదలై జపాన్ మొబైల్ మార్కెట్లో నెంబర్ వన్ కలెక్షన్స్ వసూలు చేయడమే కాకుండా.. రికార్డు స్దాయి అమ్మకాలు నమోదు చేసింది.

ఆపిల్ 'న్యూ ఐప్యాడ్" వివరాలు సంక్షిప్తంగా:

శక్తిమంతమైన చిప్, హై-డెఫినిషన్ స్క్రీన్, మెరుగైన 5 మెగా పిక్సెల్ కెమెరా, 4జీ టెక్నాలజీకి అనువైనదిగా దీన్ని తీర్చిదిద్దారు. ఐప్యాడ్2 కన్నా ఇది కొంచెం మందంగా 9.4 మిల్లీమీటర్లుగా ఉంటుంది. వై-ఫై ఉపయోగించినప్పుడు బ్యాటరీ లైఫ్ సుమారు 10 గంటలు ఉంటుంది, అదే 4జీ ఉపయోగిస్తే ఒక గంట తగ్గుతుంది. ఇక స్టోరేజి సమస్యలు తలెత్తకుండా ఈ డివైజ్ లో 'ఐక్లౌడ్" పేరిట క్లౌడ్ సర్వీసులు కూడా అందిస్తున్నారు.

దీనితో కంటెంట్‌ను … ఐప్యాడ్‌లోనే భద్రపర్చుకోవాల్సిన పని లేకుండా కంపెనీ సర్వర్లలో ఉంచుకోవచ్చు. ఇది ఈ నెల 16 నుంచి అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియా, జపాన్ తదితర దేశాల్లో ఐప్యాడ్‌ హైడెఫినిషన్‌‌‌‌ను విక్రయించనున్నారు. భారత్‌లో దీన్ని ఎప్పుడు ప్రవేశపెడతారన్నది కంపెనీ వెల్లడించలేదు. కొత్త ఐప్యాడ్ ధర వై-ఫై రకానికైతే 499-699 డాలర్లు (రూ. 24,950- రూ. 31,450) మధ్య ఉంటుంది. అదే 4జీ వెర్షన్‌కైతే 629-829 డాలర్లు (రూ. 31,450-41,450) దాకా ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot