ఐఫోన్ స్లో అయినందుకు రూ.196కోట్ల జరిమానా

By Gizbot Bureau
|

ఐఫోన్ కి కోర్టు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. భారీ పరిహారాన్ని జరిమానాగా విధించింది. కస్టమర్లకు చెప్పకుండా ఫోన్లు స్లో అయ్యేలా చేసినందుకు యాపిల్ కంపెనీకి రూ.196కోట్ల జరిమానా విధించారు. France's competition, fraud watchdog DGCCRFలు కట్టాల్సిందేనని ఆదేశాలు జారీచేశారు. 2017లో కొన్ని ఐ ఫోన్లు స్లో డౌన్ అయ్యాయని యాపిల్ నిర్దారించింది. ఇదంతా వాటి జీవితకాలం పెంచడం కోసమే చేసినట్లు తేల్చాయి. చాలా కాలంగా కస్టమర్లు ఐ ఫోన్లు స్లో అవడాన్ని గమనించి.. కొత్త ఫోన్లు కొనుగోలు చేయడం కోసమే ఇలా చేస్తుందని ఆరోపించుకుంటూ గడిపేస్తున్నారు. 2017లో కంపెనీ ఫోన్ల లైఫ్ పెంచడం కోసమే చేశామని అంతేకానీ ఫోన్లు మార్చుకోవడం కోసం కాదని వెల్లడించింది.

 

ఫోన్ల లైఫ్ టైం 

ఫోన్ల లైఫ్ టైం 

ఐ ఫోన్లలో ఉండే లిథియమ్ అయాన్ బ్యాటరీల సామర్థ్యం చాలా తక్కువ మొత్తంలో మాత్రమే స్టోర్ చేసుకోగలదు. దీంతో ఫోన్ల లైఫ్ టైం తగ్గుతుంది. ఐ ఫోన్లలో ఉండే ఎలక్ట్రానిక్ పరికరాలు సేఫ్ గా ఉండాలని ఇలా చేశారట. ఐ ఫోన్6, ఐ ఫోన్6ఎస్, ఐ ఫోన్ ఎస్ఈ సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసి బ్యాటరీ లైఫ్ పెరిగేలా చేశాయి. మరి ఐ ఫోన్లు ఇప్పటికీ స్లోగానే పనిచేస్తున్నాయా.. అంటే నిజమే అలానే ఉన్నాయి. 2017 నుంచి అదే పరిస్థితిలో ఉంటున్నాయని యాపిల్ సంస్థ వెల్లడించింది. 

ఆ ఫోన్ల వివరాలు

ఆ ఫోన్ల వివరాలు

iPhone 6, 6 Plus, 6S, 6S Plus

iPhone SE

iPhone 7, iPhone 7 Plus

iPhone 8, iPhone 8 Plus 

iPhone X(< iOS 12.1)

iPhone XS, XS Max and XR running ((< iOS 13.1)

వాట్సాప్ డార్క్ మోడ్ ఫీచర్ త్వరలో
 

వాట్సాప్ డార్క్ మోడ్ ఫీచర్ త్వరలో

ఐఫోన్ యూజర్లు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వాట్సాప్ డార్క్ మోడ్ ఫీచర్ త్వరలో రాబోతోంది. ఆండ్రాయిడ్ యూజర్లలో బీటా వెర్షన్‌లో అందుబాటులోకి వచ్చిన ఈ డార్క్ మోడ్ ఫీచర్.. అతి త్వరలో ఐఫోన్లలో రానుంది. ఐఫోన్ iOS డివైజ్ కొత్త బీటా వెర్షన్ వాట్సాప్ లో డార్క్ మోడ్ ఎనేబుల్ అయింది. త్వరలో స్టేబుల్ వెర్షన్ ఐఫోన్ వాట్సాప్ యూజర్లకు ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది. డార్క్ మోడ్ పై టెస్టింగ్ రన్ నడుస్తోందని మ్యాక్ రుమార్స్ రిపోర్టు తెలిపింది.ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ డార్క్ మోడ్ ఫీచర్ పాపులర్ ఐఓఎస్ యాప్స్‌లో ఇదివరకే అప్ డేట్ అయింది.

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం టెస్టింగ్ 

ఆండ్రాయిడ్ యూజర్ల కోసం టెస్టింగ్ 

మరోవైపు వాట్సాప్ ఇలాంటి డార్క్ మోడ్ ఫీచర్ ను ఆండ్రాయిడ్ యూజర్ల కోసం టెస్టింగ్ చేస్తోంది. గతనెలలోనే ఆండ్రాయిడ్ బీటా వెర్షన్ లో డార్క్ మోడ్ ఫీచర్ కనిపించింది. వాట్సాప్ బీటా ఆండ్రాయిడ్‌లో APK ద్వారా ఈజీగా ఫీచర్ పొందవచ్చు. కానీ, ఐఓఎస్ యూజర్లు మాత్రం వాట్సాప్ టెస్ట్ ఫ్లయిట్ ప్రొగ్రామ్‌లో (పూర్తి నెలల సమయం) జాయిన్ కావాల్సి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Apple has been fined €25 million (£21m) for secretly slowing down older iPhones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X