ఖ‌ర్చు త‌గ్గించుకునే ప‌నిలో టెక్ కంపెనీలు.. 100 మందిని తొల‌గించిన apple!

|

ప్ర‌స్తుతం టెక్ దిగ్గజ కంపెనీలు చాలా వ‌ర‌కు ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకునే మార్గాల కోసం అన్వేషిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఉద్యోగుల తొల‌గింపుల‌ను కొన‌సాగిస్తున్నాయి. ఇటీవ‌లె మైక్రోసాఫ్ట్ 200 మందిని తొల‌గించిన‌ట్లు వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. తాజాగా, apple కంపెనీ గత వారంలో దాదాపు 100 మంది కాంట్రాక్ట్ ఆధారిత రిక్రూటర్లను ఖర్చులను తగ్గించే ప్రయత్నంలో భాగంగా తొలగించిందని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఈ తొలగింపులు Apple యొక్క వ్యాపార అవసరాలకు సంబంధించిన‌ మార్పులను ప్రతిబింబిస్తున్న‌ట్లు కంపెనీ రిక్రూటర్‌లకు సూచించిన‌ట్లు నివేదిక‌లు పేర్కొన్నాయి.

apple

నివేదిక ప్రకారం, కాలిఫోర్నియాకు చెందిన టెక్ దిగ్గజం చేప‌ట్టిన ఈ చర్య అసాధారణమైనప్పటికీ, ఇప్ప‌టికే చాలా దిగ్గ‌జ కంపెనీలు సైతం ఇదే త‌ర‌హాలో నియామ‌కాల్ని మంద‌గింప‌చేసే చ‌ర్య‌ల్ని చేప‌డుతున్నాయి. మైక్రోసాఫ్ట్, అమెజాన్, మెటా, టెస్లా మరియు ఒరాకిల్‌తో సహా ఇతర టెక్ దిగ్గజాలు ఇటీవలి నెలల్లో కొన్ని విభాగాల్లో నియామకాలను తగ్గించాయి లేదా ద్రవ్యోల్బణంతో సతమతమవుతున్నాయి మరియు సంభావ్య ఆర్థిక మాంద్యం ముందు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రిస్తున్నాయి.

apple

"మా కాస్ట్ స్ట్ర‌క్చ‌ర్‌లో ద్రవ్యోల్బణాన్ని మేము చూస్తున్నాము" అని CEO టిమ్ కుక్ గత నెలలో పేర్కొన్నారు. "లాజిస్టిక్స్, వేతనాలు మరియు కొన్ని సిలికాన్ కాంపోనెంట్స్ వంటి విషయాలలో మేము ద్ర‌వ్యోల్బ‌నాన్ని చూస్తున్నాం. అయిన‌ప్ప‌టికీ, మేము నియామకాలు చేస్తున్నాము " అని కుక్ జోడించారు. మ‌రోవైపు,కంపెనీ త‌మ కాంట్రాక్టర్లంద‌రినీ తొల‌గించ‌ద‌ని కూడా నివేదిక పేర్కొంది. అదేవిధంగా, రద్దు చేయబడిన కాంట్రాక్టర్లు ప్రయోజనాలను పొందుతారని వెల్ల‌డించింది.

apple

మైక్రోసాఫ్ట్‌లోనూ గ‌త రెండు నెల‌ల్లో 2వేల మంది తొల‌గింపు!
Microsoft కూడా ఇటీవల 200 మంది ఉద్యోగుల‌ను తొల‌గించిన‌ట్లు ప‌లు వార్తా నివేదిక‌లు పేర్కొన్నాయి. ఇప్ప‌టికే, ఈ ఏడాది జూలైలో 1,800 మందికి పైగా ఉద్యోగులను ఆ సంస్థ‌ తొలగించినట్లు విష‌యం తెలిసిందే. తాజాగా, సీఈవో సత్య నాదెళ్ల నేతృత్వంలోని బ్రాండ్ MLX (మోడరన్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్) అని పిలవబడే యూజ‌ర్ సెంట్రిక్ గ్రూప్‌ల‌లో ఒకదాని నుండి మరో 200 మంది ఉద్యోగులను తొలగించ‌నున్న‌ట్లు స‌మాచారం. అతిపెద్ద IT దిగ్గజాలలో ఒకటైన మైక్రోసాఫ్ట్ లో తొలగింపున‌కు సంబంధించిన‌ వివరాలతో ప‌లు నివేదికలు ఇంటర్నెట్‌లో నిండిపోయాయి.

ఆయా నివేదిక‌ల ప్ర‌కారం అందిన వివ‌రాలు ఇలా ఉన్నాయి. Microsoft MLX గ్రూప్ నుండి 200 మంది ఉద్యోగులను తొలగించిన‌ట్లు స‌మాచారం. రెండోసారి Microsoft పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌ ప్రక్రియలో భాగంగా తొలగింపులు జరిగిన‌ట్లు తెలుస్తోంది. నెల రోజుల క్రితమే, ఇదే కారణంతో కంపెనీ దాదాపు 1,800 మంది ఉద్యోగులను తొలగించింది.

బిజినెస్ ఇన్‌సైడర్ పేర్కొన్న ప్ర‌కారం.. మైక్రోసాఫ్ట్ MLX గ్రూప్‌లోని కొంతమంది ఉద్యోగులను సంస్థలోనే వేరే స్థానానికి వెళ్లమని లేదా సెవెరెన్స్ పే(ప‌రిహార ప్యాకేజీ) ఆప్షన్‌కి వెళ్లమని కోరింది. కొత్త పొజిషన్ లేదా సెవెరెన్స్ పే ఆప్షన్‌ను ఎంచుకోవడానికి కంపెనీ ఈ ఉద్యోగులకు 60 రోజుల కాలపరిమితిని అందించిందని నివేదిక పేర్కొంది. " మోడ్ర‌న్ లైఫ్ ఎక్స్‌పీరియ‌న్స్ టీంలోని దాదాపు 200 మంది ఉద్యోగులు కంపెనీలో మరొక స్థానాన్ని ఎంపిక చేసుకోవ‌ల్సిందిగా.. లేదా ప‌రిహార ప్యాకేజీని తీసుకోవాలని చెప్పబడింది" అని నివేదిక పేర్కొంది.

ఇందుకు సంబంధించిన వివ‌రాల‌ను, Microsoft బృందంలోని సీనియ‌ర్ అసోసియేట్ ఒకరు లింక్డ్‌ఇన్‌లో కొత్త తొలగింపు గురించి వివరాలను పంచుకున్నారు. ఈ వారం మోడ్ర‌న్ లైఫ్ ఎక్స్‌పీరియన్స్ టీమ్ స‌భ్యులు "కఠినమైన వార్త" వింటార‌ని పేర్కొంటూ ఒక రహస్య సందేశంలో ఈ విష‌యాన్ని ధృవీకరించారు. అయితే, ఇది లేఆఫ్ గురించి సూచించబడుతుందో లేదో అతను పేర్కొనలేదు.

దీనిపై Microsoft ఏమంటోంది!
ప్రస్తుతానికి, MLX గ్రూప్ నుండి 200 మంది ఉద్యోగులను తొలగించడంపై మైక్రోసాఫ్ట్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కానీ, ఈ కంపెనీ గత నెలలో 1,800 మంది ఉద్యోగుల తొలగింపున‌కు సంబంధించిన వార్త‌ల‌పై మాత్రం ధృవీకరించింది. అది కంపెనీ మొత్తం వర్క్‌ఫోర్స్‌లో ఒక శాతం (సుమారు 1.8 లక్షలు) అన్న‌ట్లు పేర్కొంది. ఈ ప్ర‌క్రియ సాధార‌ణంగా అన్ని కంపెనీలు చేసే ప‌నేన‌ని మైక్రోసాఫ్ట్ అప్ప‌ట్లో చెప్పుకొచ్చింది.

Best Mobiles in India

English summary
Apple Fires 100 Contract Employees To Reduce Costs

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X