ఒక్క తెలుగు అక్షరం ఐఫోన్లకు చుక్కలు చూపించింది

Written By:

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న ఆపిల్ కంపెనీకి ఒక్క తెలుగు అక్షరం చుక్కలు చూపించింది. ఏడాదికో కొత్ మోడల్ తో మార్కెట్లోకి దూసుకువస్తున్న ఐఫోన్లు ఈ తెలుగు అక్షరం దెబ్బకు క్రాష్ అయి కొద్ది రోజులుగా పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నాయి. ఫోన్లో సామర్ధ్యాన్ని ఈ తెలుగు అక్షరం పూర్తిగా నెమ్మదించేలా చేస్తోందని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. దెబ్బకు ఆపిల్ కంపెనీ నివారణ చర్యలు చేపట్టింది.

6జిబి ర్యామ్‌తో Moto Z2 Force, కేక పుట్టించే ఫీచర్లు ఇవే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

తెలియని పదం ఒకటి..

మెసేజింగ్ యాప్‌ల్లో నెటిజన్లు చేసే చర్చలు, అభిప్రాయాలు, కామెంట్లలో తెలియని పదం ఒకటి ఇప్పడు ఐఫోన్ స్తంభించిపోవడానికి కారణమైందట. అది మన తెలుగుపదమేనని రిపోర్టులు చెబుతున్నాయి. 

ఇటాలియన్ బ్లాగ్ Mobile World..

ఈ విషయాన్ని తొలిసారిగా ఇటాలియన్ బ్లాగ్ Mobile World రిపోర్ట్ చేసింది. వీరు ఆ పదం ద్వారా ఐఫోన్లు క్రాష్ అయ్యే ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించారు కూడా.

ఐఫోన్లతో పాటు మిగతా ఉత్పత్తులను..

ఈ విషయాన్ని The Verge కూడా తెలిపింది. కాగా ఈ సమస్య ముఖ్యంగా తెలుగు పదాలను ఉపయోగించే వారి ఫోన్లలో తలెత్తుతోందట. కంపెనీ సైతం దీనిపై దర్యాప్తు ప్రారంభించింది. ఒక భారతీయ భాష ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న ఐఫోన్లతో పాటు మిగతా ఉత్పత్తులను క్రాష్ చేస్తోందని ఆపిల్ ప్రాథమికంగా అంచనాకు వచ్చింది.

అరుదుగా ఉపయోగించే 'జ్ఞా'

తెలుగు వాడుక భాషలో అరుదుగా ఉపయోగించే 'జ్ఞా'. ఈ ఒక్క పదం కొద్దిరోజులుగా వినియోగదారులకు నిద్రపట్టకుండా చేసింది. తెలుగు భాషలో వాడే ఒక అరుదైన అక్షరమే ఐఫోన్లు స్తంభించిపోవడానికి కారణమని తెలిపింది.

మ్యాక్ బుక్స్, ఆపిల్ వాచ్‌లపై కూడా ప్రభావం..

ఐమెసేజ్‌యాప్‌లో అక్షరాన్ని ఐఫోన్ ద్వారా పంపించినా లేదా టెక్స్ ఫీల్డ్‌లో దీన్ని టైప్ చేసిన వెంటనే ఫోన్లు పనిచేయకుండా ఆగిపోతున్నాయి. ఐఫోన్లు మాత్రమే కాదు మ్యాక్ బుక్స్, ఆపిల్ వాచ్‌లపై కూడా ప్రభావం పడింది.

ప్రతిసారి రీస్టార్ట్ ..

ఈ యాప్‌లు క్రాష్ అవుతూ అన్‌వర్కబుల్ అంటూ సందేశం రావడం.. ప్రతిసారి రీస్టార్ట్ చేయాల్సి వస్తోంది. టెలిగ్రామ్, స్కైప్ యాప్‌లపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఈ సమస్యను గుర్తించామని..దీన్ని పరిష్కరించి సంబంధిత అక్షరాన్ని తిరిగి వాడుకలో తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని ఆపిల్ సంస్థ పేర్కొంది.

ఐఓఎస్ 11.2.5 వెర్షన్‌తో పనిచేస్తున్న ఐఫోన్లు..

కాగా ఐఓఎస్ 11.2.5 వెర్షన్‌తో పనిచేస్తున్న ఐఫోన్లు, ఆపిల్ డివైజ్‌లలో ఈ సమస్య తలెత్తింది. దీనికన్నా ముందుగా వచ్చిన ఐఓఎస్ వెర్షన్ ఉత్పత్తులు బాగానే పనిచేస్తున్నాయి. ఐమెసేజ్, వాట్సప్, ఫేస్‌బుక్ మెసేంజర్, జీమెయిల్, ట్విటర్‌లో ఈ అక్ష‌రం వాడకం వల్ల ఫోన్లు స్తంభించిపోయాయి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Apple to fix Telugu character bug which can cause iPhone to crash, block Messages More News at Gizbot Telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot