Apple యూజ‌ర్లూ.. మీ డివైజ్‌ల‌ను అప్‌డేట్ చేసుకున్నారా!

|

Apple కంపెనీ త‌మ యూజ‌ర్ల‌కు కీల‌క సూచ‌న చేసింది. iOS 15.6.1, macOS Monterey 12.5.1, మరియు iPadOS 15.6.1 అప్‌డేట్‌లు ప్ర‌స్తుతం భారతదేశంలో కూడా అందుబాటులో ఉన్నాయ‌ని.. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ డివైజ్‌ల‌ను అప్‌డేట్ చేసుకోవాల‌ని సూచించింది. జీరో-డే గా పిలువ‌బ‌డే రెండు హానిక‌ర మాల్వేర్‌లు దాడి చేసే ప్ర‌మాదం ఉంద‌ని.. కాబ‌ట్టి అప్‌డేట్ చేసుకోవాల‌ని యూజ‌ర్ల‌ను కోరింది. వాటిని వెంట‌నే క‌ట్ట‌డి చేయ‌క‌పోతే హ్యాక‌ర్లు సిస్టమ్‌లోకి ప్రవేశించి, సున్నితమైన డేటాను యాక్సెస్ చేయవచ్చు. కాగా, వినియోగదారుల డేటా భ‌ద్ర‌త‌ను నిర్ధారించడానికి కంపెనీ సఫారి బ్రౌజర్ కోసం విడిగా అప్‌డేట్‌ను కూడా విడుదల చేస్తోంది. ఇది సఫారి 15.6.1కి సంస్కరణను అప్‌గ్రేడ్ చేస్తుంది.

 
Apple యూజ‌ర్లూ.. మీ డివైజ్‌ల‌ను అప్‌డేట్ చేసుకున్నారా!

ఛేంజ్‌లాగ్ ప్రకారం, 'CVE-2022-32894' మరియు 'CVE-2022-32893 అనే పేర్ల‌తో రెండు మాల్వేర్ల‌ను ఇటీవ‌ల ఓ ప‌రిశోధ‌కుడు క‌నుగొన్నాడు. ఇవి iPhone, Macs మరియు iPad ఈ మూడు Apple డివైజ్‌ల‌ను ప్రభావితం చేయ‌గ‌ల పేర్కొన్నాడు. CVE-2022-32894 అనేది "అవుట్-ఆఫ్-బౌండ్స్ రైట్ ఇష్యూ"గా వర్ణించబడింది. ఈ మాల్వేర్ మీ డివైజ్ యొక్క OS (ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌)కు సంబంధించి ప్రధానమైన కెర్నల్‌ను ప్రభావితం చేస్తుంది. 'CVE-2022-32893' అనేది వెబ్‌కిట్ మాల్వేర్ అని పేర్కొన్నారు. అయితే, ఈ మాల్వేర్‌లు మీ డివైజ్‌ల‌పై దాడి చేయ‌క ముందే.. మీ iPhone, Mac మరియు iPadని అప్‌డేట్ చేయాలని సూచించబడింది.

Apple యూజ‌ర్లూ.. మీ డివైజ్‌ల‌ను అప్‌డేట్ చేసుకున్నారా!

iOS 15.6.1 మరియు iPadOS 15.6.1 ఓఎస్‌లు ప‌లు డివైజ్‌ల‌కు ప్ర‌స్తుతానికి అప్‌డేట్‌కు అందుబాటులోకి వ‌చ్చాయి. iPhone 6s మరియు తర్వాత వ‌చ్చిన డివైజ్‌లు, iPad Pro (అన్ని మోడల్‌లు), iPad Air 2 మరియు ఆ తర్వాత వ‌చ్చిన డివైజ్‌లు, iPad 5వ తరం మరియు తరువాత వ‌చ్చిన డివైజ్‌ల‌కు, iPad mini 4 మరియు తర్వాత వ‌చ్చిన డివైజ్‌ల‌కు, మరియు iPod touch (7వ తరం) కోసం అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి.

Apple యూజ‌ర్లూ.. మీ డివైజ్‌ల‌ను అప్‌డేట్ చేసుకున్నారా!

సాఫ్ట్‌వేర్‌ను మాన్యువల్‌గా డౌన్‌లోడ్ చేయడానికి ఈ పద్ద‌తిని పాటించండి.
* సెట్టింగ్‌లు > జనరల్ > సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ > డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.

మ‌రోవైపు, ఆపిల్ కంపెనీ ఇప్ప‌టికే ఈ నెల ప్రారంభంలో iOS 16 బీటా 5 వెర్షన్‌లను విడుదల చేసింది. ఇందులో భాగంగా అనేక ర‌కాల కొత్త ఫీచ‌ర్ల‌ను యూజ‌ర్ల‌కు ప‌రిచ‌యం చేయ‌నుంది. యాపిల్ యూజ‌ర్లు ఎంత‌కాలంగానో ఎదురు చూస్తున్న బ్యాటరీ శాతాన్ని తెలియ‌జేసే ఫీచ‌ర్ అందుబాటులోకి రానుంది. 2018లో ఐఫోన్ X లాంచ్ అయిన తర్వాత యాపిల్ ఈ ఫీచర్‌ను తొలగించింది.

బ్యాట‌రీ శాతాన్ని చూడొచ్చు!
iOS 16 బీటా 5 అప్‌డేట్‌తో, వినియోగదారులు ఇప్పుడు సెట్టింగ్స్‌లోని మెనూ సెక్ష‌న్‌ నుండి బ్యాటరీ శాతాన్ని చూపించే ఫీచ‌ర్‌ను ప్రారంభించగలరు. ప్రస్తుతానికి, ఈ ఫీచర్ iPhone 12, iPhone 12 Pro, iPhone 12 Pro Max, iPhone 13, iPhone 13 Pro మరియు iPhone 13 Pro Max వంటి అర్హత కలిగిన iPhone మోడల్‌లకు అందుబాటులో ఉంది. కానీ, అదే హార్డ్‌వేర్ చిన్న స్క్రీన్ క‌లిగిన ఐఫోన్ 12 మినీ మరియు ఐఫోన్ 13 మినీ వంటి ఐఫోన్ మోడల్‌లు ఈ ఫీచర్‌ను పొంద‌డం లేదు. భవిష్యత్తులో iOS 16 వెర్షన్‌లో Apple దీన్ని ప్రారంభిస్తుందా? లేదా అనే విష‌యాన్ని మిశ్ర‌మ స్పంద‌న‌లు వినిపిస్తున్నాయి.

 
Apple యూజ‌ర్లూ.. మీ డివైజ్‌ల‌ను అప్‌డేట్ చేసుకున్నారా!

iOS 16 లో ఉండబోయే ఫీచ‌ర్లు:
Apple కంపెనీ iOS 16 తో అనేక కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా యూజ‌ర్లు క‌స్ట‌మైజ్‌డ్‌ లాక్ స్క్రీన్ ను పొంద‌డానికి అవ‌కాశం ఉంటుంది. త‌ద్వారా, వినియోగదారులు థ‌ర్డ్ పార్టీ, ఫ‌స్ట్ పార్టీ విడ్జెట్‌లను నేరుగా లాక్ స్క్రీన్‌పై ఉంచడానికి అనుమతిస్తుంది. అదేవిధంగా, ఇది డైనమిక్ వాల్‌పేపర్‌కు కూడా మద్దతు ఇస్తుంది. ఇలా అనేక ఫీచ‌ర్లు అందుబాటులోకి రానున్నాయి. దాంతో పాటుగా ఐమెసేజెస్ ఉప‌యోగించే iOS 16 యూజ‌ర్లు నిర్దిష్ట స‌మ‌యంలో ఒక‌సారి సెండ్ చేసిన మెసేజెస్‌ను అన్‌సెండ్ లేదా ఎడిట్ చేసే సౌక‌ర్యం వ‌స్తుంది.

ఐఫోన్‌లో బ్యాట‌రీ శాతాన్ని చూపించే ఫీచ‌ర్ ను ఎనేబుల్ చేయ‌డం ఎలా:
ప్రస్తుతానికి, ఈ ఫీచర్ iOS 16 యొక్క 5వ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది.
* ఈ ఫీచ‌ర్‌ను అప్‌డేట్ చేసుకోవాల‌నుకునే ఐఫోన్ యూజ‌ర్లు ముందుగా సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి.
* ఆ త‌ర్వాత బ్యాట‌రీ సెక్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలి. అనంత‌రం బ్యాట‌రీ ప‌ర్సెంటేజ్ ఆప్ష‌న్‌ను ఎంపిక చేసుకోవాలి.

Best Mobiles in India

English summary
Apple fixes 2 dangerous security flaws on iPhones and Macs, says users must update immediately

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X