కంపెనీ ఎదుగుదలకు తొడ్పడినంత మాత్రాన అన్ని షేర్లా..

Posted By: Staff

కంపెనీ ఎదుగుదలకు తొడ్పడినంత మాత్రాన అన్ని షేర్లా..

యాపిల్ ఎప్పుడూ సంచలనాలకు నిలయమే. స్టీవ్ జాబ్స్ మరణం తర్వాత యాపిల్ మళ్లీ మరోసారి వార్తల్లోకి వచ్చింది. అందుకు కారణం గత సంవత్సరం యాపిల్ కంపెనీ రికార్డు స్దాయి లాభాలను $108.25 బిలియన్లు సాధించడంతో, యాపిల్ కంపెనీలో ఉన్న ఆరుగురు టాప్ ఎగ్జిక్యూటివ్స్‌కి $60 మిలియన్ స్టాక్‌ని ఇవ్వడం జరిగింది.

వివరాల్లోకి వెళితే యాపిల్ కంపెనీకి చెందిన సాప్ట్ వేర్ ఛీప్ స్కాట్ ఫార్టాల్, ఛీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ పీటర్, మార్కెటింగ్ లీడ్ ఫిల్ స్కిల్లర్‌లకు ఒక్కొక్కరికి వారు కంపెనీకి చేసిన సేవలకు గాను, 150,000యాపిల్ షేర్స్‌ని 2016వ సంవత్సరం వరకు అందించింది. శుక్రవారం స్టార్ మార్కెట్‌ని బట్టి చూస్తే యాపిల్ కంపెనీ ఆరుగురు టాప్ ఎగ్జిక్యూటివ్‌లకు అందించిన సొమ్ము మొత్తం సుమారుగా $60 మిలియన్లు ఉంటుందని అంటున్నారు. శుక్రవారానికి యాపిల్ షేర్లు డౌన్ $2.83, $400.24గా ఉన్నాయి.

ఈ విషయంపై యాపిల్ కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ యాపిల్ కంపెనీ అత్యున్నత శిఖరాలకు చేరుకొవడానికి గాను వారు అందించిన సేవలకు గాను ఈ రివార్డుని ప్రకటించడం జరిగిందని తెలియజేశారు. ఇది ఇలా ఉంటే యాపిల్ కంపెనీకి ఎప్పటి నుండో సేవలను అందిస్తున్న రిటైల్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా పవి చేస్తున్న రాన్ జాన్సన్ ఈ సంవత్సరం జూన్‌లో కంపెనీని విడిచి వెళ్లనున్నారని సమాచారం.

యాపిల్ కంపెనీ ఈ విషయాన్ని ప్రకటించకపోయినప్పటికీ, రాన్ జాన్సన్ గురించి '9to5Mac' పత్రికలో ఓ కధనం ప్రసారం అయింది. ఆ కధనం ప్రకారం రాన్ జాన్సన్ డిపార్ట్ మెంట్ స్టోర్ చైన్ అయిన 'జె.సి.పెన్నీ' కంపెనీగా సీఈవోగా భాధ్యతలను చేపట్టనున్నారని సమాచారం.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot