ఓ మంచి పనికి ఆపిల్ కంకణం!

By Prashanth
|
Apple


స్నేహపూర్వక పర్యావరణాన్ని పోత్సహిస్తూ టెక్ దిగ్గజం ఆపిల్ బయోడిగ్రేడబుల్ ప్యాకింగ్ (పర్యావరణానికి హానికరం కాని) విధానానికి శ్రీకారం చుట్టింది. ఆపిల్ సరికొత్త ఐపోడ్ నానో ఇంకా ఐపోడ్ టచ్‌లు పర్యావరణానికి ఏమాత్రం హాని తలపెట్టని బయోడిగ్రేడబుల్ ప్యాకింగ్‌తో వినియోగదారుల చెంతకు రానున్నాయి. ఆపిల్ తీసుకున్న నిర్ణయానికి సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

ఇండియన్ మార్కెట్లోకి త్వరలో కొత్త జనరేషన్ ఐపోడ్ టచ్ ఇంకా నానో!

ఇండియాలో త్వరలో విడుదల కానున్న కొత్త తరం ఆపిల్ ‘ఐపోడ్ టచ్’ అలాగే ‘ఐపోడ్ నానోల’ ధరల వివరాలను ఆపిల్ ఇండియా తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

సరికొత్త 5వ తరం ఐపోడ్ టచ్ (32జీబి వర్షన్): రూ.23,900,

సరికొత్త 5వ తరం ఐపోడ్ టచ్ (64జీబి వర్షన్): రూ.30,900,

సరికొత్త ఐపోన్ నానో: రూ.12,500.

మరోవైపు ఆపిల్ తన 4వతరం ఐపోడ్ టచ్ ధరలను తగ్గించింది. ప్రస్తుత ధరలను పరిశీలిస్తే …

4వ తరం ఐపోడ్ టచ్ (16జీబి వర్షన్): రూ.15,900,

4వ తరం ఐపోడ్ టచ్ (32జీబి వర్షన్): రూ.19,500,

ఐపోడ్ షుఫుల్ ఇంకా ఐపోడ్ క్లాసిక్‌లను పాత ధరలకే విక్రయిస్తున్నారు… ఐపోడ్ షుఫుల్ ధర రూ.3,700, ఐపోడ్ క్లాసిక్ ధర రూ.19,900.

సరికొత్త ఐప్యాడ్ టచ్ ఫీచర్లు:

4 అంగళాల వెడల్పు స్ర్కీన్, రెటీనా డిస్‌ప్లే, మల్టీ-టచ్ ఐపీఎస్ టెక్నాలజీ (రిసల్యూషన్ 1136 x 640పిక్సల్స్), ఓలియోఫోబిక్ ఫింగర్ ప్రింట్ రెసిస్టెంట్ కోటింగ్, ఆపిల్ ఏ5 చిప్‌సెట్, 5 మెగాపిక్సల్ ఐసైట్ కెమెరా (ఆటో ఫోకస్, ఎల్ఈడి ఫ్లాష్), ఇన్-బుల్ట్ లియోన్ బ్యాటరీ (40 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 8 గంటల వీడియో ప్లేబ్యాక్).

సరికొత్త ఐపోడ్ నానో ఫీచర్లు:

2.5 అంగుళాల వెడల్పాటి స్ర్కీన్, మల్టీటచ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 240 x 320పిక్సల్స్), ఇన్-బుల్ట్ రీచార్జబుల్ లియోన్ బ్యాటరీ (30 గంటల మ్యూజిక్ ప్లేబ్యాక్, 3.5 గంటల వీడియో ప్లేబ్యాక్).

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X