ఆపిల్ కొత్త ప్రయోగం ఫలించేనా..?

Posted By:

ఆపిల్ కొత్త ప్రయోగం ఫలించేనా..?

 

కొత్తగా మార్కెట్లోకి ఆపిల్, సెర్చ్ ఇంజన్ గెయింట్ గూగుల్ త్వరలో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌కి అనుసంధానంగా పనిచేసి స్మార్ట్ ఫోన్స్‌కి అవసరమైన సమాచారాన్ని అందించే ఉత్పత్తులను ప్రవేశపెట్టనున్నారు. గూగుల్ ఎక్స్ ల్యాబ్‌లో ఈవిషయంపై సీక్రెట్‌గా రీసెర్చర్స్ పని చేయడం జరుగుతుందని న్యూయార్క్ టైమ్స్ ఓ కధనంగా ప్రచురించింది.

ఇందు కోసం గాను ఆపిల్ కంపెనీ రూపొందించే స్మార్ట్ ఫోన్ భాగాలను ప్రత్యేకంగా రూపొందించాల్సి ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఆపిల్ కర్వ్ గ్లాస్‌పై ప్రయోగం మొదలుపెట్టింది. ఆపిల్ ఆర్టిఫీసియల్ ఇంటెలిజెన్స్ సాప్ట్ వేర్ 'సిరి'కి ఈ డివైజ్ ద్వారా కనెక్ట్ అవ్వోచ్చు. అసలు ఆపిల్ డివైజ్‌లకు ఇది సాద్యం అవుతుందా లేదా అనే విషయాలను ఆపిల్ ఉద్యోగులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం ఆపిల్ చేస్తున్న ఈ ప్రయోగం గనుక సక్సెస్ ఐతే మొబైల్ కమ్యూనికేషన్ అనేది సెంట్రల్ హాబ్‌గా పని చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot