జీరో డౌన్ పేమెంట్‌తో యాపిల్ ఐఫోన్ 6!

Posted By:

 జీరో డౌన్ పేమెంట్‌తో యాపిల్ ఐఫోన్ 6!

యాపిల్ సంస్థ ఇటీవల ఇండియన్ మార్కెట్లో విడుదల చేసిన ఐఫోన్ 6, ఐఫోన్ 6 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌లకు వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తోన్న విషయం తెలిసిందే. తమ విక్రయాలను మరింత పెంచుకునే క్రమంలో యాపిల్ ఈ రెండు ఫోన్‌ల కొనుగోళ్లకు సంబంధించి జీరో డౌన్ పేమెంట్ ప్లాన్‌ను రిలయన్స్ సంస్థ సహకారంతో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

2013లో రిలయన్స్, యాపిల్ సంస్థలు సంయుక్తంగా ఐఫోన్ 5ఎస్, 5సీ మోడళ్ల పై జీరో డౌన్ పేమెంట్ ప్లాన్‌లను అందించాయి. అనధికారికంగా తెలుస్తోన్న సమాచారం మేరకు ఈ జీరో డౌన్ పేమెంట్ ప్లాన్‌లో భాగంగా ఐఫోన్ 6ను కొనుగోలు చేసిన వినియోగదారుడు 24 నెలల పాటు నెలకు రూ.3,099 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. జీరో డౌన్ పేమెంట్ ప్లాన్‌లో భాగంగా ఐఫోన్ 6ప్లస్‌ను కొనుగోలు చేసిన వినియోగదారుడు 24 నెలల పాటు నెలకు రూ.3,599 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.

English summary
Apple hints at zero down-payment plans for iPhone 6 in India. Read more in Telugu Gizbot....
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot