Home
News

Apple ల్యాప్‌టాప్‌లపై రూ.30 వేల ధర తగ్గింపు.. ధరలు ఎందుకు తగ్గించారంటే?

ప్రముఖ టెక్‌ దిగ్గజం ఆపిల్ ఇండియా గుడ్‌న్యూస్‌ చెప్పింది. మ్యాక్‌బుక్‌ ల్యాప్‌టాప్‌లపై భారీగా తగ్గింపును ప్రకటించింది. 14 అంగుళాల Apple Macbook Pro ధరను రూ.30 వేలు తగ్గించింది. ఆపిల్‌ M3 మ్యాక్‌బుక్‌ ప్రో ప్రారంభ ధర రూ.1,69,900గా ఉంది. అదే M2 మ్యాక్‌బుక్‌ విడుదల సమయంలో ధర రూ.1,99,900గా ఉంది.

ఆపిల్‌ తీసుకున్న ఈ తగ్గింపు నిర్ణయం కారణంగా 14 అంగుళాల మ్యాక్‌బుక్‌ ఈ రెండు మోడళ్లు కస్టమర్లకు మరింత చేరువ కానున్నాయి. ఈ రెండు మోడళ్లు శక్తివంతమైన ప్రాసెసర్‌ను కలిగి ఉన్నాయి. మరియు గతం కంటే అందుబాటు ధరకు కొనుగోలు చేయవచ్చు.

Apple huge price cut on 14 inch macbook pro

ఆపిల్‌ సంస్థ నుంచి కొత్త ఉత్పత్తులు విడుదల అయిన సమయంలో పాత ఉత్పత్తులపై కొన్ని సందర్భాల్లో ధరలను తగ్గిస్తుంది. ప్రస్తుతం 14 అంగుళాల మ్యాక్‌బుక్‌ ప్రో మోడళ్లపై ఏకంగా రూ.30 వేల తగ్గింపును ప్రకటించింది. భారత్‌లో ఆపిల్‌ సంస్థ అందించిన డిస్కౌంట్‌లో ఇది ఒకటిగా నిలిచింది. ఫలితంగా ఈ మోడల్‌ ల్యాప్‌టాప్‌లు మరింత మందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది. ఫలితంగా అమ్మకాలు పెరిగే అవకాశం ఉంది.

ఆపిల్‌ ల్యాప్‌టాప్‌ ధరల తగ్గింపునకు కారణం ఏంటి? : భారత్‌ మార్కెట్‌లో ల్యాప్‌టాప్ సెగ్మెంట్‌లో భారీ పోటీ ఉంటుంది. చాలా వరకు ఇతర ల్యాప్‌టాప్‌ తయారీ సంస్థల ఉత్పత్తులు అందుబాటులో ధరలో ఉంటాయి. ధరను తగ్గించడం ద్వారా.. ఇతర సంస్థలకు ఆపిల్‌ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంతోపాటు భారత్‌ మార్కెట్‌లో 14 అంగుళాల మ్యాక్‌బుక్‌ ప్రో మోడళ్ల విక్రయాల పెంపు లక్ష్యంగాను ఈ ధరలను తగ్గించినట్లు భావించవచ్చు.

ప్రతి మ్యాక్‌బుక్ ప్రో మోడల్‌ HDR కంటెంట్‌ కోసం 1000 nits మరియు 1600 nits గరిష్ఠ బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంటాయి. మరియు XDR డిస్‌ప్లేను కలిగి ఉంటాయి. ఈ రెండు మ్యాక్‌బుక్‌ ప్రో మోడళ్లు 1080p కెమెరా, 6 స్పీకర్‌ సౌండ్‌ సిస్టమ్‌ మరియు అనేక కనెక్టివిటీ ఎంపికలతో వస్తుంది.

సెప్టెంబర్‌ 12న నిర్వహించిన వండర్‌లస్ట్‌ ఈవెంట్‌లో ఆపిల్ సంస్థ ఐఫోన్‌ 15 సిరీస్‌ను విడుదల చేసింది. ఐఫోన్‌ 15 బేస్‌ మోడల్‌ రూ.79,900, అలాగే ఐఫోన్ 15 ప్లస్‌ ప్రారంభ ధర రూ.89,900గా ఉంది. ఈ రెండు ఫోన్లు 128GB, 256GB, 512GB అంతర్గత స్టోరేజీ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ రెండు ఫోన్లు నలుపు, నీలం, ఆకుపచ్చ, పింక్‌, పసుపు రంగుల్లో లభిస్తుంది.

ఐఫోన్ 15 ప్రో బేసి వేరియంట్‌ ధర రూ. 1,39,900గా ఉంది. అదే ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ రూ.1,59,900గా ఉంది. బ్లాక్‌ టైటానియం, బ్లూ టైటానియం, నేచురల్‌ టైటానియం, వైట్‌ టైటానియం రంగుల్లో గరిష్ఠంగా 1TB అంతర్గత స్టోరేజీ వేరియంట్‌ను కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్‌ 15, 15 ప్లస్‌ ఫోన్లు OLED సూపర్‌ రెటినా డిస్‌ప్లేతో వస్తాయి. గరిష్ఠ బ్రైట్‌నెస్‌ 2000 నిట్స్‌ వరకు ఉంటుంది. ఈ ఫోన్ రెండు వేరియంట్లు వేర్వేరు డిస్‌ప్లే సైజులను కలిగి ఉంటుంది. ఐఫోన్ 15.. 6.1 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. అదే 15 ప్లస్‌ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెండు దృఢమైన గాజు, నీరు, దుమ్ము నిరోధకతను కలిగి ఉంటాయి.

ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌ ఫ్లాట్‌ ఎడ్జ్‌ డిజైన్‌ను కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్లు ప్రోమోషన్ డిస్‌ప్లేను కలిగి ఉన్నాయి. 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో వస్తాయి. అయితే ఐఫోన్ 15 ప్రో 6.1 అంగుళాల డిస్‌ప్లే, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్‌ 6.7 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ రెండు ఫోన్లు A17 ప్రో బయోనిక్‌ చిప్‌ ఆధారంగా పనిచేస్తాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple huge price cut on 14 inch macbook pro models
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X