బడ్జెట్ ఎఫెక్ట్ : భారీగా పెరిగిన ఐఫోన్ ధరలు

|

ఇంపోర్టెడ్ మొబైల్స్ పై 15 శాతంగా ఉన్న కస్టమ్స్ సుంఖాన్ని 20 శాతానికి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఐఫోన్ ధరలు కొండెక్కాయి. లేటస్ట్‌గా లాంచ్ అయిన ఐఫోన్ ఎక్స్‌తో పాటు మిగిలిన ఐఫోన్ మోడల్స్ రేట్లను యాపిల్ ఒక్కసారిగా పెంచేసింది. పెరిగిన కొత్త ధరలు ఫిబ్రవరి 5 నుంచి అమల్లోకి వచ్చేసాయి.

 
బడ్జెట్ ఎఫెక్ట్ : భారీగా పెరిగిన ఐఫోన్ ధరలు

ఐఫోన్ ఎస్ఈ మోడల్‌ భారత్‌లోనే తయారవుతుండటంతో ఈ ఫోన్ పై ఎటువంటి ధర పెంపును యాపిల్ అనౌన్స్ చేయలేదు. మిగిలిన ఐఫోన్ మోడల్స్ ధరలు 3 శాతానికి పైగా పరిగాయి. ఇదే సమయంలో యాపిల్ వాచ్‌ల ధరలు కూడా 8.3 శాతానికి పెరిగాయి. పెరిగిన ధరలకు సంబంధించిన పూర్తి వివరాలను యాపిల్ తన అఫీషియల్ వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది. గడిచిన మూడు నెలల కాలంగా ఐఫోన్ ధరలు పెరగటం ఇది రెండవ సారి. బడ్జెట్ ఎఫెక్ట్ కారణంగా కొత్త ధరట్యాగ్‌లను ఐఫోన్ మోడల్స్ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

ఐఫోన్ ఎస్ఈ

ఐఫోన్ ఎస్ఈ

ఈ ఐఫోన్ మోడల్ పూర్తిగా భారత్‌లోనే తయారవుతండటంతో పాత రేటుతోనే ఈ ఫోన్‌ను విక్రయించటం జరుగుతోంది. బెంగుళూరుకు చెందిన విస్ట్రన్ అనే కాంట్రాక్ట్ మాన్యూఫ్యాక్షురర్ ద్వారా యాపిల్ ఈ ఫోన్‌లను తయారు చేయిస్తోంది. 32జీబి మోడల్ ధర రూ.26,000గాను, 128జీబి మోడల్ ధర రూ.35,000గాను ఉంది. ఇదే సమయంలో ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూ.20,499 ధర ట్యాగ్‌తో విక్రరయిస్తోంది.

ఐఫోన్ ఎక్స్

ఐఫోన్ ఎక్స్

బడ్జెట్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఐఫోన్ ఎక్స్ ధరను 3.2 శాతానికి పెంచారు. దీంతో రూ.92,340గా ఉన్న 64జీబి ఐఫోన్ ఎక్స్ వేరియంట్ ధర రూ.95,390కి, రూ.1,05,720గా ఉన్న 256జీబి ఐఫోన్ ఎక్స్ వేరియంట్ ధర రూ.1,08,930కి పెరిగింది.

ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్
 

ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్

బడ్జెట్ ఎఫెక్ట్ నేపథ్యంలో ‘ఐఫోన్ 8', 64జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.66,120 నుంచి రూ.67,940కి పెరిగింది. 256జీబి వేరియంట్ ధర రూ.79,420 నుంచి రూ.81,500కు పెరిగింది. ఇక ఐఫోన్ 8 ప్లస్ విషయానికి వచ్చేసరికి 64జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.75,450 నుంచి రూ.77,560కి పెరిగింది. 256జీబి వేరియంట్ ధర రూ.88,750 నుంచి రూ.91,110కు పెరిగింది.

ట్రంప్ చేతిలో ఐఫోన్, ఆ ఒక్క దాని కోసమేనట !ట్రంప్ చేతిలో ఐఫోన్, ఆ ఒక్క దాని కోసమేనట !

ఐఫోన్ 7, ఐఫోన్ 8 ప్లస్

ఐఫోన్ 7, ఐఫోన్ 8 ప్లస్

బడ్జెట్ ఎఫెక్ట్ కారణంగా ఐఫోన్ 7 (32జీబి వేరియంట్) ధర రూ.50,810 నుంచి రూ.52,370కి పెరిగింది.

ఐఫోన్ 7 (128జీబి వేరియంట్) ధర రూ.59,910 నుంచి రూ.61,560కి పెరిగింది. ఇక ఐఫోన్ 7 ప్లస్ విషయానికి వచ్చేసరికి 32జీబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ.62,840కి చేరుకుంది. ఇదే సమయంలో 128జీబి వేరియంట్ ధర రూ.70,180 నుంచి రూ.72,060కు చేరుకుంది.

ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్

ఐఫోన్ 6ఎస్, ఐఫోన్ 6ఎస్ ప్లస్

ధరల పెంపు నేపథ్యంలో ఐఫోన్ 6ఎస్ 32జీబి వేరియంట్ ధర రూ.42,900గాను, 128జీబి వేరియంట్ ధర రూ.52,100గాను ఉంది.

ఐఫోన్ 6

ఐఫోన్ 6

నాలుగు సంవత్సరాల క్రితం మార్కెట్లో లాంచ్ అయిన ఐఫోన్ 6 ధరను రూ.30,780 నుంచి రూ.31,900కు యాపిల్ పెంచింది.

Best Mobiles in India

English summary
Apple increases prices of iPhone X, iPhone 8, iPhone 7 and iPhone 6S In India, iPhone SE price unchanged

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X