Home
News

ఆపిల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌ల కోసం ఎదురుచూస్తున్న వారికి గుడ్‌న్యూస్‌.. ఈ అప్‌డేట్స్‌ వచ్చేశాయ్..!

ఆపిల్‌ iOS 18.4, iPadOS 18.4, macOS sequoia 15.4 లాంచ్ అయ్యాయి. దీని ద్వారా అనేక భాషల్లో ఆపిల్ ఇంటెలిజెన్స్‌ అందుబాటులోకి వస్తుంది. ఇంగ్లీష్‌ (ఇండియా, సింగపూర్‌), ఫ్రెంచ్‌, జర్మన్‌, ఇటాలియన్‌, పోర్చుగీస్‌, స్పానీస్‌, జపనీస్‌, కొరియన్‌, సింప్లిఫైడ్‌ చైనీస్ భాషల్లో ఆవిష్కరించారు. ఇవాళ్టి నుంచి ఈ భాషల్లో అనేక AI ఫీచర్‌లు అందుబాటులోకి వస్తున్నట్లు ఆపిల్‌ సీనియర్ వైస్‌ ప్రెసిడెంట్ గ్రెగ్ జోస్వియాక్ తెలిపారు.

కొత్త అప్‌డేట్స్‌ తో భారత్‌ లో అనేక ఆపిల్‌ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ లు (Apple intelligence) అందుబాటులోకి వచ్చాయి. రైటింగ్‌ టూల్స్‌, స్మార్ట్‌ సెర్చ్‌ ఇన్ ఫోటోస్‌, ఇమేజ్ ప్లేగ్రౌండ్‌, ప్రయారిటీ నోటిఫికేషన్స్‌, స్మార్టర్‌ సిరి, విజువల్‌ ఇంటెలిజెన్స్‌, ChatGPT ఇంటిగ్రేషన్‌ సహా మరిన్ని ఫీచర్‌ లు ఉన్నాయి.

Apple intelligence

రైటింగ్ టూల్స్‌ : ఈ ఫీచర్‌ iOS, iPadOS, macOS లో అందుబాటులోకకి వచ్చాయి. దీని ద్వారా మెయిల్‌, మెసేజ్‌లు ఇతర నోట్స్‌ను ప్రూఫ్‌ రీడ్‌, రీరైట్‌ చేయవచ్చు. గ్రామర్‌ లో తప్పులు సహా వివిధ ఫార్మాట్‌లోనూ రాసేందుకు అవకాశం ఉంది. ముఖ్యమైన పాయింట్లు, జాబితా రూపంలోనూ తయారు చేయవచ్చు.

క్లిన్‌ అప్‌ ఇన్‌ ఫోటోస్‌ : కొన్ని ఫోటోల్లో అవసరం లేని వ్యక్తులు లేదా వస్తువులు ఉంటాయి. అలాంటి వాటిని ఈ ఫీచర్‌ ద్వారా తొలగించవచ్చు.

స్మార్ట్ సెర్చ్ ఇన్ ఫోటోస్ : ఈ ఫీచర్‌ ద్వారా ఫోటోలు, వీడియోలోని కొన్ని ప్రత్యేక మూమెంట్స్‌ను గుర్తించేందుకు అవకాశం ఉంది.

మెమోరీస్‌ ఇన్‌ ఫోటోస్‌ : టెక్ట్స్‌ ప్రాంప్ట్స్‌ ఆధారంగా ఫోటోలు, వీడియోలను ఎంచుకొని ఆటోమేటిక్‌గా క్రియేట్‌ చేస్తుంది. స్టోరీలైన్‌కు సంబంధించిన థీమ్‌ను కూడా యాడ్‌ చేస్తుంది.

జెన్‌మోజీ : ఈ ఫీచర్‌ ద్వారా యూనిక్‌ ఎమోజీని క్రియేట్‌ చేయవచ్చు.

ప్రయారిటీ మెసేజెస్ ఇన్ మెయిల్‌ : ఈ ఫీచర్‌ ద్వారా ముఖ్యమైన మెయిల్స్‌ హైలెట్‌ చేస్తుంది. ఈ మెయిల్‌ పూర్తిగా చదవాల్సిన అవసరం లేకుండా, వాటి సారాంశం అందిస్తుంది.

ఆడియో ట్రాన్‌క్రిప్షన్‌ : ఈ ఫీచర్‌ ఐఫోన్ యూజర్‌లకు బాగా ఉపయోగపడుతుంది. దీని ద్వారా నోట్స్‌, ఫోన్‌ యాప్‌ ఆడియో, ఫోన్‌ కాల్స్‌ను రికార్డు చేసేందుకు అనుమతి ఉంటుంది. అందులోకి ముఖ్యంశాలు గుర్తుంచుకొనే విధంగా సారాంశం రూపంలో తయారు చేస్తాయి.

వీటితోపాటు స్మార్టర్‌ సిరి, విజువల్‌ ఇంటెలిజెన్స్‌, ChatGPT ఇంటిగ్రేషన్ వంటి మరిన్ని ఫీచర్‌ లు కూడా అందుబాటులోకి వస్తాయి. ఈ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ ను ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌, ఐఫోన్ 16, ఐఫోన్ 16 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్‌, ఐఫోన్‌ 15 ప్రో వంటి ఫోన్‌లు సపోర్టు చేస్తాయి.

ఐప్యాడ్స్ విషయానికి వస్తే ఐప్యాడ్‌ ప్రో M1 సహా తర్వాత తరం డివైజ్‌ లు, మరియు ఐప్యాడ్ ఎయిర్‌ M1 సహా తర్వాత తరం వెర్షన్‌ లు దీంతోపాటు M1 చిప్‌సెట్‌ తో పనిచేసే mac సహా తర్వాత తరం డివైజ్‌ లు ఈ ఫీచర్‌లను సపోర్టు చేస్తాయి.

Best Mobiles in India

English summary
Apple intelligence has been available in india with iOS 18.4, iPadOS 18.4, macos update
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X