Home
News

Apple intelligence అందుబాటులోకి వచ్చిన ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌.. ఎలా ఇన్‌స్టాల్‌ చేసుకోవాలి..?

ఆపిల్ ఇంటెలిజెన్స్‌ ఎట్టకేలకు (Apple intelligence) అందుబాటులోకి వచ్చింది. iOS 18.1 మరియు iPadOS 18.1, macOS Sequoia 15.1 సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ ద్వారా ఈ ఫీచర్‌లు యూజర్‌లకు అందుబాటులోకి వచ్చాయి. ఫలితంగా ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్‌ సహా మరిన్ని డివైస్‌ల పనితీరు మరింత మెరుగుపడుతుందని, వినియోగదారులకు మరిన్ని ఫీచర్‌లు అందుబాటులోకి వస్తాయని ఆపిల్ చెబుతోంది. తాజా అప్‌డేట్‌ ద్వారా యూజర్‌లు తమ రోజువారీ కార్యకలాపాల నిర్వహణ మరింత సులభం కానుంది. Siri సహా రైటింగ్‌ టూల్‌, ఫోటోస్‌ యాప్‌లో అప్‌డేట్‌లు ఉండనున్నాయి.

ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ను ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్‌, ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్ సహా ఐమ్యాక్‌ M1 సహా తర్వాత వెర్షన్‌లు సపోర్టు చేస్తాయి. వీటితోపాటు మ్యాక్ మిని M1 సహా తర్వాత వెర్షన్‌లు, మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M1 సహా తర్వాత మోడళ్లు, మ్యాక్‌ స్టూడియో M1 మ్యాక్స్‌ సహా తర్వాత విడుదలైన మోడళ్లు ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ను సపోర్టు చేస్తాయి.

Apple intelligence

మ్యా ప్రో M2 అల్ట్రా, ఐఫ్యాడ్‌ ఎయిర్‌ M1 సహా 2022 తర్వాత అందుబాటులో వచ్చిన మోడళ్లు ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ను సపోర్టు చేస్తాయి. దీంతోపాటు ఐప్యాడ్‌ ప్రో M1 సహా 2021 తర్వాత విడుదలైన మోడళ్ల యూజర్‌లు ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లను ఉపయోగించుకోవచ్చు.

ఆపిల్‌ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను వినియోగించుకొనేందుకు ఐఫోన్‌ యూజర్‌లు కొత్తగా అందుబాటులోకి వచ్చిన iOS 18.1 OS కు అప్‌డేట్‌ కావాల్సి ఉంటుంది. ఇందుకోసం మీ హ్యాండ్‌సెట్‌కు వచ్చిన నోటిఫికేషన్‌ను క్లిక్‌ చేయడం లేదా సెట్టింగ్స్‌లోకి వెళ్లి అప్‌డేట్‌ చేసుకోవాలి. ఇందుకోసం కనీసం 50 శాతం బ్యాటరీ ఛార్జింగ్‌, అవసరమైన స్టోరేజీని కలిగి ఉండాలి.

Apple intelligence

ఐఫోన్ 15 ప్రో మోడళ్లు, ఐఫోన్ 16 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లలోని సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అనంతరం జనరల్‌ ఆప్షన్‌పైన క్లిక్‌ చేయాలి. తర్వాత సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ పై క్లిక్‌ చేసి.. iOS 18.1 ను అప్‌డేట్ చేసుకోవచ్చు. కొత్త OS వెర్షన్‌కు అప్‌డేట్‌ అయ్యాక.. ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ Waitlist లోకి చేరాల్సి ఉంటుంది. Waitlist పైన క్లిక్‌ చేసిన తర్వాత ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ & సిరి పైన క్లిక్‌ చేయాలి.

ఐఫోన్ మ్యాక్‌ యూజర్‌లు అయితే ఆపిల్‌ మెనులోకి వెళ్లాలి. అనంతరం సిస్టమ్‌ సెట్టింగ్స్‌ పైన ట్యాప్‌ చేయాలి. అనంతరం ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ & సిరి వెయిట్‌లిస్ట్‌లో జాయిన్ కావాల్సి ఉంటుంది. అనంతరం మీకు నోటిఫికేషన్‌ రూపంలో ఆపిల్‌ నుంచి సమాచారం అందుతుంది. తర్వాత సంబంధిత సాఫ్ట్‌వేర్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం కానుంది.

తాజా అప్‌డేట్‌లతో యూజర్‌లకు రైటింగ్‌ టూల్‌ సహా సిరి, ఫోటోస్‌ యాప్‌లో అనేక అప్‌గ్రేడ్‌లు వస్తాయి. ఈ రైటింగ్‌ టూల్‌ ద్వారా Rewrite, ప్రూఫ్‌ రీడ్‌ సహా ఏదైనా అంశాన్ని సరళంగా రాసేందుకు ఉపయోగపడుతుంది. Siri మరింత మెరుగ్గా పనిచేస్తుంది. ఫోటోస్‌ యాప్‌ ద్వారా మీకు నచ్చిన ఫోటోలో అవసరం లేని వాటికి తొలగించేందుకు అవకాశం ఉంటుంది. దీంతోపాటు మరిన్ని అప్‌డేట్‌లు యూజర్‌లకు అందుబాటులో ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple intelligence now available to supported devices, top features and install guide
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X