Home
News

ఇవాళ విడుదల కానున్న ఆపిల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లు.. మీ స్మార్ట్‌ఫోన్‌, గ్యాడ్జెట్‌ సపోర్టు చేస్తుందా?

ఆపిల్‌ యూజర్‌లు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఆపిల్ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లు (Apple intelligence) ఇవాళ భారత్‌లో అందుబాటులోకి రానుంది. ఇవాళ రాత్రి 10.30 గంటలకు విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఆపిల్‌ సంస్థ ఇటీవల నిర్వహించిన WWDC 2024 (వరల్డ్ వైడ్ డెవలపర్‌ కాన్ఫరెన్స్) ఈవెంట్‌లో ఆపిల్‌ సంస్థ iOS 18.1 అప్‌డేట్‌తోపాటు ఈ ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌ను పరిచయం చేసింది.

అయితే ఈ ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ను కొన్ని మోడళ్లు మాత్రమే సపోర్టు చేయనున్నాయి. ఐఫోన్ 15 ప్రో మోడళ్లు సహా ఐఫోన్‌ సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లు ఆపిల్‌ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను సపోర్టు చేయనున్నాయి. అయితే ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ అన్ని ఫీచర్‌లు ఒకేసారి అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది.

Apple intelligence launch date

ఇవాళ విడుదల చేసే అప్‌డేట్‌ కేవలం కొన్ని ఫీచర్‌లు మాత్రమే అందుబాటులో ఉంటాయని సమాచారం. మిగిలిన ఫీచర్‌లు 2025 సంవత్సరంలో అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది. ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌లలో ఒకటైన రైటింగ్‌ టూల్‌ ద్వారా టెక్స్ట్‌లో స్పెల్లింగ్స్‌ మరియు గ్రామర్‌లో తప్పులను గుర్తించవచ్చు. ఫ్రెండ్లీ, ప్రొఫిషనల్‌, Concise ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది.

దీంతోపాటు ఫోటోస్‌ యాప్‌లోను అనేక అప్‌గ్రేడ్‌లు రానున్నాయి. యూజర్‌లకు కావాల్సిన విధంగా ఫోటోలు, మ్యూజిక్‌తో ప్రత్యేక అల్బమ్‌ను క్రియేట్‌ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ అంతా ఆటోమేటిక్‌గానే జరుగుతుంది. యూజర్లు నచ్చిన Text అందించిన అనంతరం.. అందుకు అనుగుణంగా ఫోటోలు, మ్యూజిక్‌ను ఎంపిక చేసుకొని ప్రత్యేక ఆల్బమ్‌ను క్రియేట్‌ చేస్తుంది.

దీంతోపాటు Siri కూడా అనేక అప్‌డేట్‌లు పొందనుంది. కొత్త యూజర్‌ ఇంటర్‌ఫేస్‌తోపాటు అనేక అప్‌డేట్‌లు రానున్నాయని తెలుస్తోంది. అయితే ఇవాళ విడుదల కానున్న ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా కొన్ని అప్‌డేట్‌లు మాత్రమే అందుబాటులోకి రానున్నాయి. మిగిలినవి త్వరలో విడుదల కానున్నాయని తెలుస్తోంది.

Apple intelligence launch date

ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ ఫీచర్‌ను ఐఫోన్ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్, ఐఫోన్‌ 16, ఐఫోన్ 16 ప్లస్‌, ఐఫోన్‌ 16 ప్రో, ఐఫోన్‌ 16 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్‌లు సపోర్టు చేయనున్నాయి. వీటితోపాటు ఐప్యాడ్‌ ప్రో 2021 మోడల్‌ తర్వాత పరికరాలు, ఐప్యాడ్‌ ఎయిర్‌ 2022 మోడల్‌ పరికరాలు సపోర్టు చేయనున్నాయి.

దీంతోపాటు మ్యాక్‌ ప్రో M2, మ్యాక్ స్టూడియో M1 మ్యాక్స్‌ మరియు తర్వాత వెర్షన్‌లు, మ్యాక్‌బుక్‌ ప్రో M1 సహా తర్వాత వెర్షన్‌లు, మ్యాక్‌బుక్‌ ఎయిర్‌ M1 మరియు తర్వాత వెర్షన్‌లు, మ్యాక్‌ మిని M1 మరియు తర్వాత తరం వెర్షన్‌లు, ఐమ్యాక్‌ M1 సహా తర్వాత తరం వెర్షన్‌లు ఆపిల్‌ ఇంటెలిజెన్స్‌ను సపోర్టు చేయనున్నాయి.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌ కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌ మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీ తోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple intelligence releasing today in india here are the supported devices list
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X