ఆపిల్ iOS 16 కొత్త అప్‌డేట్‌లో అందుబాటులోకి వచ్చే మెరుగైన ఫీచర్‌లు ఇవే!!

|

ఆపిల్ సంస్థ ప్రతి సంవత్సరం నిర్వహించే వరల్డ్-వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (WWDC) మీటింగ్ 2022 లో నిర్వహించడానికి జూన్ 6, 2022కి షెడ్యూల్ చేయబడింది. యాపిల్ సంస్థ ఈ ఈవెంట్ లో ఏడాది పొడవునా పని చేస్తు కనుగొన్న కొత్త సాఫ్ట్‌వేర్ మరియు ఉత్పత్తులను ఆవిష్కరిస్తూ తన యొక్క అభివృద్ధిని పెంచుకుంటున్నది. ఈ సంవత్సరం WWDC ఈవెంట్‌లో Apple iOS యొక్క కొత్త వెర్షన్‌ iOS 16 ను ప్రకటించనున్నది. iOS యొక్క ఈ కొత్త వెర్షన్ ఐఫోన్ 14 సిరీస్‌తో పాటుగా మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత అర్హత ఉన్న ప్రతి ఇతర ఐఫోన్లు అప్‌డేట్‌ రూపంలో పొందుతుంది. ఈ సంవత్సరం కొత్త iOS వెర్షన్‌తో ఎటువంటి ప్రయోజనాలను ఆశించవచ్చో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

iOS 16 కొత్త అప్‌డేట్‌ నుంచి ఆశించే ఫీచర్లు

iOS 16 కొత్త అప్‌డేట్‌ నుంచి ఆశించే ఫీచర్లు

** iOS 16 కొత్త అప్‌డేట్‌లో పొందే ప్రయోజనాల విషయానికి వస్తే అన్నింటి కంటే మొదటిది iOS 16తో సరికొత్త నోటిఫికేషన్‌ల ప్యానెల్‌ను చూడాలని మేము ఆశించవచ్చు. iOS 15తో నోటిఫికేషన్‌ల నిర్వహణ అంత గొప్పగా లేదు. కానీ iOS 16తో ఇది మంచిగా మారుతుందని భావిస్తున్నారు.

** రెండవది ఆపిల్ ఐఫోన్ల లాక్ స్క్రీన్ కోసం విడ్జెట్ వాల్‌పేపర్‌లను తీసుకురావాలని భావిస్తున్నారు. ఈ వాల్‌పేపర్‌లు ఎలా ఉంటాయో అర్థం కావడం లేదు.

** iOS 16 యొక్క అప్‌డేట్‌లోని అత్యంత ఉత్తేజకరమైన ఫీచర్ AOD (ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే) ఫీచర్ కావచ్చు. ఇది గణనీయమైన మరియు అధిక మొత్తంలో బ్యాటరీని వినియోగించుకుంటుంది. ఐఫోన్ దీన్ని ఎలా పరిష్కరించి అమలులోకి తీసుకొని వస్తుందో ఆసక్తికరంగా చూడాలి.

** iOS 16 అప్‌డేట్‌లో ఆపిల్ సంస్థ కొత్తగా భారీగా అప్‌గ్రేడ్ చేసిన హెల్త్ యాప్ మరియు మెసేజెస్ యాప్‌ని పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఆపిల్ యొక్క మెసేజ్స్ యాప్‌లో కొన్ని సోషల్ మీడియా ఫీచర్లు ఉండవచ్చు అని కొన్ని లీక్లు తెలుపుతున్నాయి.

iOS 16 కొత్త అప్‌డేట్‌
 

ఆపిల్ iOS 16 కొత్త అప్‌డేట్‌లో కొత్త విషయాలు చాలానే ఉండవచ్చు. ఆపిల్ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్‌ను అధికారికంగా ప్రకటించిన తర్వాత మరిన్ని విషయాలు తెలుస్తాయి. ఏ ఐఫోన్ కొత్త OS అప్‌డేట్‌ను స్వీకరిస్తుందో కూడా ముందు ముందు తెల్సుకోవాలి. ఈ కొత్త అప్‌డేట్‌ ఆపిల్ పాత తరం ఐఫోన్‌లకు కూడా మద్దతునిస్తుదో లేదో చూడాలి. ఐఫోన్ 6 ప్లస్ వంటి చాలా పాత ఫోన్లలో కొన్ని హార్డ్‌వేర్ లోపాలు ఉండడంతో కొత్త OS అనేది ఈ పరికరాలలో సరిగ్గా పని చేయకపోవచ్చు.

ఐఫోన్ 14 సిరీస్ లీక్ వివరాలు

ఐఫోన్ 14 సిరీస్ లీక్ వివరాలు

Tipster Sam (@Shadow_Leak) ట్విట్టర్ పోస్ట్ ద్వారా ఐఫోన్ 14 మ్యాక్స్ ఫోన్ యొక్క ధరలు మరియు స్పెసిఫికేషన్‌ల వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ లీక్ ప్రకారం ఐఫోన్ 14 మ్యాక్స్ ఫోన్ యొక్క 6GB RAM +128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర $899 (దాదాపు రూ. 69,600) గా ఉంది. అయితే ఇతర వేరియంట్ ధరల వివరాలు ప్రస్తుతానికి తెలియరాలేదు. ఐఫోన్ 14 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ కి సంబందించిన స్పెసిఫికేషన్స్ వివరాలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ లీక్ సమాచారం ప్రకారం ఆపిల్ సంస్థ నుంచి రాబోయే ఐఫోన్ 14 మ్యాక్స్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.68-అంగుళాల ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 2,778×1,284 పరిమాణంలో 458 పిక్సెల్‌ల(PPI) సాంద్రతను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుత జెనరేషన్ A15 బయోనిక్ SoCతో రన్ అవుతూ 6GB LPDDR4X RAMతో జతచేయబడి వస్తుంది. ప్రస్తుతం అదే చిప్ తో ఐఫోన్13 సిరీస్ ఫోన్లు మరియు కొత్త ఐఫోన్ SE (2022) కూడా శక్తిని పొందుతున్నాయి. గత లీక్‌ల ప్రకారం ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్14 ప్రో మాక్స్ ఫోన్లు రెండు కూడా A16 బయోనిక్ SoCలతో శక్తిని పొందే అవకాశం ఉంది. ఆపిల్ సంస్థ నుంచి రాబోయే ఐఫోన్ 14 మ్యాక్స్ ఫోన్ లోని ఆప్టిక్స్ విషయానికి వస్తే ఇది 12-మెగాపిక్సెల్ సెన్సార్‌లతో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో ప్యాక్ చేయబడి వస్తుందని భావిస్తున్నారు. అలాగే ఈ హ్యాండ్‌సెట్ 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉండి నాచ్ ఫీచర్ మరియు ఫేస్ ID అన్ లాక్ తో వస్తుంది అని భావిస్తున్నారు.

OS 15.5లో కొత్త విషయాలు

OS 15.5లో కొత్త విషయాలు

iOS 15.5 కొత్త అప్‌డేట్ లోని ముఖ్యమైన విషయాల విభాగానికి వస్తే ఆపిల్ వాలెట్ యాప్‌ని తీసుకువస్తుందని చూపిస్తుంది. ఇది వినియోగదారులను ఆపిల్ క్యాష్ కార్డ్ ద్వారా త్వరగా డబ్బును పంపడానికి మరియు అభ్యర్థించడానికి అనుమతిస్తుంది. మీ ఐఫోన్ లో స్టోర్ చేయబడిన ఎపిసోడ్‌లను పరిమితం చేయడంలో మరియు పాత వాటిని ఆటొమ్యాటిక్ గా తొలగించడంలో సహాయపడే కొత్త సెట్టింగ్‌తో ఆపిల్ పాడ్‌క్యాస్ట్‌లను కూడా కొత్త అప్‌డేట్ లో అందిస్తుంది. ఇవే కాకుండా iOS 15.5 అప్‌డేట్ లో అనేక సెక్యూరిటీ పరిష్కారాలను కూడా కలిగి ఉంటుంది. iOS అప్‌డేట్ లలో ఆపిల్ యొక్క కమ్యూనికేషన్ సేఫ్టీని కూడా విస్తరింపజేస్తుంది. ఇది ప్రారంభంలో USలో ప్రారంభించబడింది. ఇది నగ్నత్వంతో ఉన్న ఫోటోలను చూడకుండా లేదా షేర్ చేయకుండా నిరోధించడానికి అనుమతిస్తుంది. ఇప్పుడు ఇది ఆస్ట్రేలియా, కెనడా, న్యూజిలాండ్ మరియు UKకి విస్తరించబడింది. ఆపిల్ తన ఆధిపత్యాన్ని తగ్గించుకోవడానికి మరియు డెవలపర్‌లు సబ్‌స్క్రిప్షన్‌లను తీసుకోవడానికి మరియు కంపెనీకి 30 శాతం కమీషన్ చెల్లించకుండా యాప్‌లో కొనుగోళ్లను ప్రారంభించేందుకు యాప్‌ల కోసం బాహ్య కొనుగోలు వ్యవస్థలను అనుమతించడంపై నియంత్రణ ఒత్తిడిని ఎదుర్కొంటోంది.

Best Mobiles in India

English summary
Apple iOS 16 New Update Brings Many Enhanced Features For iPhones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X