వైమానిక దళంలో 'ఆపిల్ ఐప్యాడ్ 2'

Posted By: Prashanth

వైమానిక దళంలో 'ఆపిల్ ఐప్యాడ్ 2'

 

టెక్నాలజీ దిగ్గజం 'ఆపిల్' యొక్క ఉత్తమ ఉత్పాదన 'ఐప్యాడ్ 2' త్వరలో అమెరికా సంయుక్త ఎయిర్ ఫోర్స్‌లో కీలక పాత్ర పోషించనుందని సమాచారం. పని ఒత్తిడిని తగ్గించేందుకు గాను 'ఐప్యాడ్ 2' పరకరాలను క్రూస్ వాడనున్నారు. నివేదిక ప్రకారం విమాన బృందాలు పని తేలిక అవ్వడంతో పాటు...మెరుగైన సమాచారం అందించే భాగంలో వీటిని సమన్వయ పరచుకునేందుకు సహాయం అందించనున్నాయి.

గతంలో ఉపయోగిస్తున్న నావిగేషన్ చార్ట్స్, మాన్యువల్స్ స్ధానంలో ఐప్యాడ్స్‌ 2ని ఉపయోగించడం వల్ల నావిగేషన్‌కి, ఆపరేట్ చేసేందుకు గాను విమాన బృందాలకు సులువుగా ఉంటుందని తెలిపారు. ఈ నావిగేషన్ మ్యాప్స్‌ని అమెరికా సంయుక్త ఎయిర్ ఫోర్స్‌లో పైలెట్స్ కూడా వినియోగించవచ్చు. ఇలా ఐప్యాడ్ 2 లను అమెరికా సంయుక్త ఎయిర్ ఫోర్స్‌ లో వినియోగించాలనే ఆలోచన డిజిటల్ రంగంలో ఓ విప్లవాత్మక మార్పుగా భావిస్తున్నారు.

ఈ నిర్ణయం మిలిటరీ సెక్టార్‌లో ఎక్కువ పాపులారిటీ సంపాదిస్తున్న 'రిమ్ ప్లే బుక్ 'ని అడ్డుకునే మార్గంగా కనిపిస్తుంది. ఆపిల్ ఐప్యాడ్ 2ని ఉపయోగించి అమెరికా సంయుక్త ఎయిర్ ఫోర్స్‌ యొక్క కార్యకలాపాలు మరింత సమర్థవంతంగా నిర్వర్తించే యోచనలో ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot