బంపర్ ఆఫర్.. ఆపిల్ ఐప్యాడ్ రూ 15,000..!

Posted By: Staff

 బంపర్ ఆఫర్.. ఆపిల్ ఐప్యాడ్ రూ 15,000..!

 

టెక్నాలజీ దిగ్గజం ఆపిల్ 'న్యూ ఐప్యాడ్' సక్సెస్‌పుల్‌గా విడుదల చేసిన సందర్బంలో... ఐప్యాడ్ 2 ధరను తగ్గించిన విషయం తెలిసిందే. దీనితో పాటు 'ఆపిల్ ఐప్యాడ్‌ 1'ని కేవలం రూ 15,000లకే అందజేస్తుంది. ఏప్రిల్ 2010లో ఆపిల్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా విడుదల చేసిన ఈ ఐప్యాడ్ 1కి ఆ రోజుల్లో ప్రజలు నీరాజనాలు పట్టారు.

ఇప్పటికే ఇండియా, అమెరికా, యూరప్ దేశాలలో దీనికున్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఆపిల్ మార్చి 7న 'న్యూ ఐప్యాడ్' పేరుతో మూడవ జనరేషన్ టాబ్లెట్‌ని విడుదల చేసి, మార్చి 16 నుండి ప్రపంచ వ్యాప్తంగా దీని అమ్మకాలను మొదలు పెట్టనుంది. దీంతో 'ఐప్యాడ్ 1'కి మరింత ఆదరణ పెంపొందించేందుకు గాను కొత్త అధునాతన ఫీచర్స్‌తో దీనిని రీమోడల్ చేసి మార్కెట్లోకి కేవలం రూ 15,000లకే విడుదల చేయనుంది.

'ఆపిల్ ఐప్యాడ్‌ 1' ప్రత్యేకతలు:

ఆపరేటింగ్ సిస్టమ్: iOS 4 operating system

ప్రాససెర్: 1GHz A4 processor, 256MB RAM

చిఫ్ సెట్: Apple A4 chipset

చుట్టుకొలతలు: 242.8 x 189.7 x 13.4 mm

బరువు: 730 g

డిస్ ప్లే: 9.7-inch LED-backlit TFT capacitive touchscreen with 768 x 1024 pixels resolution

డిస్ ప్లే ఫీచర్స్: scratch-resistant surface, multi-touch input method, accelerometer

ఇంటర్నల్ మెమరీ: 16GB, 32GB, 64GB

ఇంటర్నెట్ కనెక్టివిటీ: WiFi + 3G; WiFi

బ్యాటరీ: up to 10 hours of video playback

బ్లూటూత్: Bluetooth 2.1

యుఎస్‌బి: USB 2.0

టివి అవుట్‌పుట్: TV-out 35mm audio jack

ప్లేయర్స్:  MP4 player, MP3, WAV, AAC player

iBooks PDF reader

Assisted GPS

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot