iPhone 11, iPhone SE ఫోన్‌ల మీద భారీ ధర తగ్గింపు!!!
గత రాత్రి 10.30PM కు అమెరికన్ స్మార్ట్ ఫోన్ కంపెనీ ఆపిల్ వర్చువల్ ఈవెంట్ ద్వారా ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లను గ్రాండ్ గా విడుదల చేసింది. ఆపిల్ యొక్క తాజా ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 12 సిరీస్ ఫోన్‌లు వేగవంతమైన పనితీరు మరియు అద్భుతమైన iOS అనుభవంతో పాటు ఉత్తమమైన కెమెరా ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఐఫోన్ 12 మినీ సరికొత్త ఐఫోన్ రూ.69,990 ధర వద్ద నుండి ప్రారంభమవుతున్నది. ఐఫోన్‌ల లాంచ్ తో ఐఫోన్ 11 మరియు ఐఫోన్ Se యొక్క ధరలను సవరించింది. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఐఫోన్ 11 & ఐఫోన్ SE తగ్గింపు ధరల వివరాలు
ఐఫోన్ 12 సిరీస్ ఫోన్‌లు విడుదల కావడంతో అందరూ ఉహించిన విధంగా పాత మోడల్లు ఐఫోన్ 11 మరియు ఐఫోన్ SE యొక్క ధరలను ఆపిల్ సంస్థ తగ్గించింది. ఐఫోన్ 11 యొక్క 64GB వేరియంట్‌ను రూ.54,990 మరియు 128GB స్టోరేజ్ మోడల్ యొక్క ధరను రూ.59,990కు తగ్గించింది. అలాగే ఐఫోన్ SE యొక్క 64GB వేరియంట్‌ను రూ.39,990 ధరకు మరియు 128GB వేరియంట్‌ను రూ.44,990 ధరకు మరియు 256GB వేరియంట్ యొక్క ధరను రూ.54,990 కు తగ్గించారు.

ఇండియాలో ఆపిల్ దీపావళి ఆఫర్
ఇండియాలోని ఆపిల్ స్టోర్ లో ప్రస్తుతం దీపావళి ఆఫర్లను అందిస్తున్నది. ఇందులో భాగంగా ఐఫోన్ 11 మరియు ఐఫోన్ SE కొనుగోలు మీద అద్భుతమైన తగ్గింపు ఆఫర్లను అందిస్తున్నాయి. దీపావళి ఆఫర్‌లో భాగంగా ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్ నుండి ఆపిల్ ఐఫోన్ 11ను కొనుగోలు చేసిన వారికి అదనంగా ఎయిర్‌పాడ్స్‌ను ఉచితంగా అందిస్తున్నది. ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్ కాకుండా ఆపిల్ స్టోర్ నుండి చేసిన కొనుగోళ్లకు మాత్రమే ఈ ఆఫర్ చెల్లుతుంది.

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ల మీద తగ్గింపు ఆఫర్లు
ఇండియాలో పండుగ సీజన్ లో ఐఫోన్‌లను అధిక డిస్కౌంట్ ధర వద్ద కొనుగోలు చేయదలచిన వారు అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్‌ల ద్వారా పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ SE యొక్క 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్‌ను రూ.37,900 ధర వద్ద విక్రయిస్తోంది. అక్టోబర్ 16న ఫ్లిప్‌కార్ట్‌లోని బిగ్ బిలియన్ డేస్ అమ్మకం సమయంలో మీరు దానిని మరింత తక్కువ ధరకు పొందవచ్చు. అలాగే ఐఫోన్ SEను అమ్మకాల సమయంలో రూ.30,000 రిటైల్ ధర వద్ద పొందే అవకాశం ఉంది. ఆపిల్ యొక్క సొంత స్టోర్‌లోని ప్రస్తుత ధరలతో పోలిస్తే ఇది భారీ ధర తగ్గింపు.

అమెజాన్‌లో ఐఫోన్ 11 మీద తగ్గింపు ఆఫర్స్
అమెజాన్‌లో ప్రస్తుతం ఐఫోన్ 11 యొక్క ధర దాని అసలు ధర 67,900 రూపాయల వద్ద చూపిస్తోంది. అయితే అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ అమ్మకం సమయంలో ఐఫోన్ 11 మీద అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్లతో రూ.18,000 ధర తగ్గింపుతో రూ.49,990 ధరకె విక్రయించనున్నది. ఆపిల్ తన యొక్క పోర్టల్ లో వసూలు చేస్తున్న ధర కంటే ఇది దాదాపు 5,000 రూపాయలు తక్కువ.


Click it and Unblock the Notifications








