Just In
Don't Miss
- News
నిత్యానందకు ఫ్రెంచ్ ప్రభుత్వం షాక్.. 4 లక్షల డాలర్ల ఫ్రాడ్ కేసులో విచారణ
- Movies
బాలయ్య-బోయపాటి చిత్రానికి ముహుర్తం ఖరారు.. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫిక్స్
- Sports
400 క్లబ్: తొలి భారత క్రికెటర్‌గా చరిత్ర సృష్టించేందుకు సిక్స్ దూరంలో రోహిత్ శర్మ
- Automobiles
మహీంద్రా ఎక్స్‌యూవీ300 బిఎస్-6 వచ్చేసింది.. మారుతి బ్రిజా, టాటా నెక్సాన్‌లకు గట్టి షాక్!!
- Lifestyle
అంగస్తంభన పెంచే మాత్రలు తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు!
- Finance
హాల్‌మార్కింగ్ ద్వారా కస్టమర్లకు ఎంతో ప్రయోజనం, భరోసా
- Travel
అక్బర్ కామాగ్నికి బలి అయిన మాళ్వా సంగీతకారిణి రూపమతి ప్యాలెస్
ఐఫోన్ 11 సీరిస్ స్మార్ట్‌పోన్లు వచ్చేస్తున్నాయ్, కళ్లు చెదిరే ఫీచర్లు
అమెరికా స్మార్ట్‌పోన్ దిగ్గజం ఆపిల్ తన తరుాత సీరిస్ ఐఫోన్‌ను త్వరలోనే లాంచ్ చేయనుంది. ఐఫోన్ 11ను సెప్టెంబర్‌లో లాంచ్ చేయనుందని తాజా లీక్‌ల ద్వారా తెలుస్తోంది. సెప్టెంబర్ రెండవ వారంలో ఐఫోన్ 11, 11 ప్రొ, 11 ఆర్, 11 మాక్స్ పేరుతో మూడు మోడళ్లలో లాంచ్ చేయనుంది. 5జీ టెక్నాలజీ అప్‌గ్రేడ్, ట్రిపుల్ రియర్ కెమెరా లాంటి ఫీచర్లతో వీటిని తీసుకురానుందని సమాచారం.
సాధారణంగా సెప్టంబరు మాసంలో తన ఫ్లాగ్‌షిప్ డివైస్‌లను లాంచ్ చేయడం ఆపిల్ ఆనవాయితీగా పాటిస్తూ వస్తోంది. అయితే ఈ సాంప్రదాయాన్ని గత రెండేళ్లుగా మిస్ అవుతూ వస్తోంది.

సెంటిమెంట్‌ను ఫాలో కావాలని..:
2017 లో, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ సెప్టెంబరులో విడుదల చేయగా , ఐఫోన్ ఎక్స్‌ను నవంబర్‌లో తీసుకొచ్చింది. అయితే 2018 లో, ఐఫోన్ ఎక్స్ సెప్టెంబరులో, లోయర్-ఎండ్ ఐఫోన్ ఎక్స్ అక్టోబర్‌లో ప్రారంభించింది. 2019లో మాత్రం సెప్టెంబర్ సెంటిమెంట్‌ను ఫాలో కావాలని ఆపిల్ భావిస్తోందట.

సెప్టెంబరు 1 నుంచి అమెరికాలో:
మరోవైపు అమెరికా చైనా ట్రేడ్‌వార్ నేపథ్యంలో సెప్టెంబరు 1 నుంచి అమెరికాలో చైనా దిగుమతులపై 10శాతం సుంకాల విధింపు ప్రకటన చైనాలో ఆపిల్ విక్రయాలపై ప్రభావం చూపుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. తాజాగా సుంకాల విధింపును డిసెంబరు వరకు వాయిదా వస్తూ ట్రంప్ సర్కారు నిర్ణయం తీసుకుంది.

ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్:
ఇదిలా ఉంటే ‘ఐఫోన్లు' మరింత భద్రతతో వినియోగదారుల ముందుకు రాబోతున్నాయి. ఐఫోన్ X స్మార్ట్‌ఫోన్‌లో టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌కు బదులుగా ఫేస్ ఐడీ ఫీచర్‌ను ప్రవేశపెట్టిన విషయం విదితమే. అయితే ఆ తరువాత వచ్చిన ఐఫోన్ XR, XS, XS మ్యాక్స్ ఫోన్లలోనూ టచ్ ఐడీ ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. కేవలం ఫేస్ ఐడీనే ఇచ్చారు. కానీ 2021లో రానున్న ఐఫోన్లలో ఫేస్ ఐడీతోపాటు ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లను కూడా ఆపిల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.

2021 ఐఫోన్లలో 5జీ ఫీచర్:
2021లో రానున్న ఐఫోన్లలో క్వాల్‌కామ్ రూపొందించే అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌లను ఉపయోగించనున్నారట. ప్రస్తుతం అనేక ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లలో ఇప్పటికే ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందిస్తున్నారు. దీంతో అదే బాటలో ఆపిల్ కూడా ఇన్‌స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌లను ఏర్పాటు చేస్తున్నదని తెలిసింది. ఇక డిస్‌ప్లేపై ఫింగర్ ప్రింట్ సెన్సింగ్ ఏరియాను కూడా పెద్ద మొత్తంలో ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. కాగా 2021 ఐఫోన్లలో 5జీ ఫీచర్ ఉండబోతోంది. ఈ క్రమంలో ఆ ఫీచర్‌కు పైన తెలిపిన ఇన్‌స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ కూడా జత కానుంది.

2017లోనే ఈ టెక్నాలజీ పేటెంట్ కోసం దరఖాస్తు:
అండర్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్' సెన్సార్లతో ఐఫోన్లు 2021 నాటికి మార్కెట్‌లోకి రాబోతున్నాయి. ఐఫోన్ల యాజమాన్యం 2017లోనే ఈ టెక్నాలజీ పేటెంట్ కోసం దరఖాస్తు చేసుకుంది.కాగా ఐఫోన్ల భద్రతకు ఇంతకుముందు ‘టచ్‌ఐడీ' పద్ధతి ఉండేది. స్క్రీన్‌కు దిగువన సెట్‌పైన ఫింగర్ ప్రింట్ ద్వారా ఫోన్‌ను లాక్, అన్‌లాక్ చేసే వెసులుబాటు ఉండేది. ఆ తర్వాత ఐఫోన్లతో ‘ఫేస్‌ఐడీ' పద్ధతి వచ్చింది. ఆ తర్వాత 8 ప్లస్ సిరీస్ నుంచి ఈ ఫింగర్ ఐడీని తీసివేసి ఒక్క పేస్‌ఐడితో ఐఫోన్లు వచ్చాయి. ఇప్పుడు మళ్లీ ‘ఇన్‌స్క్రీన్ ఫింగర్ ప్రింట్ ఐడీ (స్క్రీన్ మీద వేలి ముద్రను రిజిస్టర్ చేయడం ద్వారా సౌకర్యంతో ఐఫోన్లు వస్తున్నాయట.
-
29,999
-
14,999
-
28,999
-
37,430
-
1,09,894
-
15,999
-
36,990
-
79,999
-
71,990
-
49,999
-
14,999
-
9,999
-
64,900
-
37,430
-
15,999
-
25,999
-
46,354
-
19,999
-
17,999
-
9,999
-
18,270
-
22,300
-
33,530
-
14,030
-
6,990
-
20,340
-
12,790
-
7,090
-
17,090
-
15,500