స్టన్నింగ్ ఫీచర్లతో ఆపిల్ ఐఫోన్ 11, సంచలనంగా మారిన లీకు ఫోటోలు
టెక్ రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న రారాజు ఆపిల్ ఎప్పటికప్పుడు తమ అభిమానులను అలరిస్తూనే ఉంది. కంపెనీ నుంచి సరికొత్తగా మొబైల్స్ ను తీసుకొస్తూ యూజర్లకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. ఆపిల్
టెక్ రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతున్న రారాజు ఆపిల్ ఎప్పటికప్పుడు తమ అభిమానులను అలరిస్తూనే ఉంది. కంపెనీ నుంచి సరికొత్తగా మొబైల్స్ ను తీసుకొస్తూ యూజర్లకు సరికొత్త అనుభూతిని అందిస్తోంది. ఆపిల్ కంపెనీ నుంచి వచ్చిన ప్రతి ఐఫోన్ సునామి అమ్మకాలను తలపిస్తూనే ఉంది. హై ఎండ్ ప్రీమియం మార్కెట్లో ఆపిల్ కంపెనీదే రాజ్యం.

ఈ మధ్య ఐఫోన్ ఎక్స్ సీరిస్ లో పలు మోడళ్లను విడుదల చేసిన ఆపిల్ కంపెనీ ఇప్పుడు కొత్త మోడల్ ఐఫోన్లను మరి కొన్ని నెలల్లో రిలీజ్ చేయనుంది. కాగా కొత్త ఐఫోన్ మోడల్స్ రిలీజ్ కాకముందే ఫీచర్లకు సంబంధించి పుకార్లు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నాయి.

ఐఫోన్ 11
రాబోయే ఐఫోన్లలో కళ్లు చెదిరే డిజైన్, ఎట్రాక్టింగ్ ఫీచర్లు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈలోపే ఆపిల్ కొత్త ఐఫోన్ 11 కు సంబంధించి ఫొటోలు లీకయ్యాయి. సోషల్ మీడియాలో ఐఫోన్ 11 ఫీచర్లు ఇవే అంటూ లీకైన ఫొటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోలను బ్లూమ్ బెర్గ్ టెక్ రైటర్ @markgurman తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.

లీకైన ఫొటోల ప్రకారం..
అప్ కమింగ్ ఐఫోన్ 11లో ట్రిపుల్ కెమెరా ఫీచర్ యూనిట్ ఉన్నట్టు కనిపిస్తోంది. ట్రైయాంగులర్ ఫార్మేషన్ లో త్రి లెన్స్ కెమెరాలు రౌండ్ స్క్వేయిర్ సెట్టింగ్ తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఐఫోన్ 11 తో పాటు ఐఫోన్ 11 మ్యాక్స్, ఐఫోన్ ఎక్స్ఆర్2 ఫోన్లలో కూడా ఎట్రాక్టింగ్ సేమ్ ఫీచర్లు ఉంటాయని టెక్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

A13 Chip Set
ఆపిల్ నుంచి త్వరలో రానున్న మూడు ఐఫోన్లలో A13 Chip Set మెయిన్ ప్రాసిసర్ స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉండనుందని తెలుస్తోంది. అయితే ఆపిల్ ఈ మూడు ఫోన్లకు పేరు ఏం పెట్టిందనే దానిపై ఇప్పటికి కచ్చితమైన సమాచారం లేదు. కానీ, ఈ కొత్త ఐఫోన్లను ఆపిల్ iPhone 11, iPhone 11 Max, iPhone XR2 పేర్లతో డిజైన్ చేసినట్టు సమాచారం.

ఐఫోన్ 11 మ్యాక్స్ లో
2019 ఏడాదిలో వస్తాయని అంచనా వేస్తున్న ఐఫోన్లలోని ఐఫోన్ 11 మ్యాక్స్ లో వైడ్ యాంగిల్ లెన్స్ తో 3 రియర్ కెమెరా సెట్ అప్ ఉన్నట్టు తెలుస్తోంది. హర్డ్ వేర్ అప్ గ్రేడ్.. సాఫ్ట్ వేర్ పనితీరును వేగవంతం చేసేలా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ఐఫోన్ ఎక్స్ ఆర్2
ఐఫోన్ ఎక్స్ ఆర్2 మోడల్ లో రియర్ ప్యానెల్ తో స్పోర్ట్ డ్యుయల్ లెన్స్ సెటప్ ఉండనుంది. బడ్జెట్ వేరియంట్ మోడల్ ఫోన్ అయిన ఈ ఫోన్ ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేయనుంది. ఈ ఫీచర్లను గతంలో వచ్చిన ఐఫోన్లు ఐఫోన్ ఎక్స్, ఐఫోన్ ఎక్స్ఎస్ లలో చూసే ఉంటాం. దీంతో పాటుగా సోనీ ఆల్ట్రా వైడ్ లెన్స్ కూడా ఈ ఫోన్లలో రానున్నాయి.

రివర్స్ ఛార్జింగ్ ఫీచర్
రివర్స్ ఛార్జింగ్ ఫీచర్ ను శాంసంగ్ గెలాక్సీ ఎస్10లో ప్రవేశపెట్టగా.. ఈ ఏడాది సెప్టెంబర్ లో ఆపిల్ రిలీజ్ చేసే ఐఫోన్లలో కూడా ఇదే ఫీచర్ రానుంది. మూడు కొత్త ఐఫోన్లలో ఎనేబుల్డ్ ఛార్జింగ్ ఫీచర్ ఉంటుంది. ఆపిల్ ఐఫోన్లలో రిలీజ్ అయిన మోడల్స్ లో రియర్ కెమెరా సెటప్ డిజైన్ స్క్వెయిర్ హంప్ ఉండటంపై ఐఫోన్ లవర్స్ నుంచి విమర్శలు వచ్చాయి. వచ్చే ఐఫోన్ 11 మోడల్స్ లో ఈ చెత్త డిజైన్ ను ఆపిల్ తొలగిస్తుందని ఐఫోన్ లవర్స్ భావిస్తున్నారు.

ios 13
ఇదిలా ఉంటే ఆపిల్ కంపెనీ తన లేటెస్ట్ అప్ డేట్ ఆపరేటింగ్ సిస్టం iOS 13ను అతి త్వరలో రిలీజ్ చేయనుంది. ఇది ఐఫోన్ 6ప్లస్ కన్నా ముందున్న ఫోన్లకు ఈ ఆపరేటింగ్ సిస్టం అప్లికేబుల్ కాదనే రూమర్లు కూడా వినిపిస్తున్నాయి. ఆపిల్ నుంచి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు వీటిపై క్లారిటీ లేదని నిపుణులు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications








