Home
News

అదరహో అనిపించేలా ఐఫోన్ 11 సీరిస్ పోన్లు, ధర, ఫీచర్లు ఇవే

By Gizbot Bureau

ప్రపంచమంతా ఉత్కంఠతో ఎదురు చూస్తోన్న కొత్త ఐఫోన్‌లను ఆపిల్‌ కంపెనీ ఎట్టకేలకు విడుదల చేసింది. ఐఫోన్‌ 11, 11 ప్రో, 11 ప్రో మ్యాక్స్‌ అధునాతన స్మార్ట్‌ఫోన్‌లను ఆ పిల్‌ హెడ్‌క్వార్టర్స్‌ క్యుపర్టినోలోని స్టీవ్‌ జాబ్స్‌ ఆడిటోరియమ్‌లో జరిగిన ప్రత్యేక ఈవెంట్‌లో ఆవిష్కరించారు. ఐఫోన్‌ 11 ఆరు రంగుల్లో కొత్తగా గ్రీన్, పర్పుల్‌ రెడ్, యెల్లో రంగుల్లో లభించనున్నది. స్పెషల్‌ ఆడియో, డాల్బీ అట్మోస్‌ ఫీచర్, ఇరువైపులా 12 మెగాపిక్సెల్‌ అల్ట్రా వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 6.1 లిక్విడ్‌ రెటినా డిస్‌ప్లే, స్లో మోషన్‌ సెల్ఫీలు, ఏ13 బయోనిక్‌ చిప్‌ వంటి ప్రత్యేకతలున్నాయి. ఇక ఐఫోన్‌ 11 ప్రారంభ ధర 699 డాలర్లగా ఉంది. వీటిపై ఓ లుక్కేయండి.

ఐఫోన్ 11 ఫీచర్లు

ఐఫోన్ 11 ఫీచర్లు

6.1 అంగుళాల లిక్విడ్ రెటీనా తెర కలిగి బ్లాక్ గ్రీన్, ఎల్లో, పర్పుల్ వైట్ రెడ్ రంగుల్లో లభ్యం అవుతుంది. వెనుకవైపు 2 కెమేరాలు (12 ఎంపీ వైడ్ అల్ట్రా వైడ్ 4కే స్పష్టత, సినిమాటిక్ వీడియో, ఇప్పటివరకు ఐఫోన్లో లేని అత్యధిక స్పష్టమైన వీడియోలు తీయొచ్చు, నైట్ మోడ్) డాల్బీ అట్మోస్ శబ్దం, స్లో మోషన్ సెల్ఫీస్ (స్లోఫీస్), మరే ఇతర స్మార్ట్ ఫోన్లో లేని, అత్యధిక వేగంతో పనిచేసే ఏ 13 బయోనిక్ సీపీయూ, అత్యంత వేగంతో పనిచేసే జీపీయూ, ఐఫోన్ టెన్ ఆర్ కంటే మరో గంట అదనంగా పనిచేసే బ్యాటరీ, శరవేగంతో ముఖాన్ని గుర్తించే కెమేరా కలిగి ఉంది.

ఐఫోన్ 11 ప్రో ఫీచర్లు

ఐఫోన్ 11 ప్రో ఫీచర్లు

5.8 అంగుళాల సూపర్ రెటీనా అత్యంత దృఢమైన తెర కలిగి, మిడ్ నైట్ గ్రీన్ స్పేస్ గ్రే, సిల్వర్ వైట్ గోల్డ్ రంగుల్లో లభ్యం అవుతోంది. వెనుకవైపు సింగిల్ పీస్ గ్లాస్, స్టెయిన్ లెస్ స్టీల్, వెనుకవైపు 3 కెమేరాలు అమర్చారు. డాల్బీ అట్మోస్ శబ్దం, సెకనుకు లక్ష కోట్ల ఆపరేషన్లు జరిపే సీపీయూ, 40 శాతం తక్కువ విద్యుత్తు వినియోగం, ఐఫోన్ టెన్ ఎస్ కంటే 4 గంటల అదనంగా పనిచేసే బ్యాటరీ దీని ప్రత్యేకతలు.

ఇక ఐఫోన్ 11ప్రో మ్యాక్స్ ఫీచర్లు 

ఇక ఐఫోన్ 11ప్రో మ్యాక్స్ ఫీచర్లు 

6.5 అంగుళాల తెర కలిగి, ఐఫోన్ టెన్ ఎస్ మ్యాక్స్ కంటే 5 గంటలు అదనంగా వచ్చే బ్యాటరీ కలిగి ఉంది. వెనుక వైపు 3 కెమేరాలతో (12 వైడ్ అల్ట్రావైడ్ టెలిఫోటో) ఒకే సమయంలో 3 భిన్న రకాలుగా ఒకే ఫొటో తీయొచ్చు. కను రెప్పల మధ్య చోటును కూడా స్పష్టంగా చూపే సామర్థ్యం దీని సొంతం గా సంస్ధ పేర్కోంది.

ధర

ధర

ఐఫోన్‌ 11 64 జీబీ ధర 699 డాలర్ల నుంచి మొదలవుతుంది. ఇండియన్ కరెన్సీలో సుమారు రూ. 49,629 గా ఉండనుంది. అయితే అధికారికంగా ఇంకా ధరను నియంత్రిచంలేదు. ఐఫోన్ 11 ప్రో-- 128 జీబీ-- ధర 999 డాలర్ల నుంచి ,ఐఫోన్ 11 ప్రో మ్యాక్స్ 128 జీబీ -- ధర-- 1099 డాలర్ల నుంచి మొదలవుతుంది. 

ఇండియాలో విడుదల

ఇండియాలో విడుదల

2019 సెప్టెంబరు 13 నుంచి ముందస్తుగా బుకింగ్ చేసుకునే సౌకర్యం కల్పించారు. మూడు ఐఫోన్ 11 మోడల్స్ సెప్టెంబర్ 20 నుంచి పేటీఎం మాల్లో లభ్యం కానున్నాయి. పేటీఎం మాల్ 2019 ఐఫోన్ మూడు మోడల్స్ పై రూ.10వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందిస్తోంది. ఇండియాలో సెప్టెంబర్ 27న సేల్ ప్రారంభం కానుంది. అయితే వీటి ధరలు మాత్రం కంపెనీ రీవిల్ చేయలేదు.

Best Mobiles in India

English summary
Apple iPhone 11 Series Launch: Price, Specifications, And Availability In India
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X