ఐఫోన్ 12 & 12 మినీ ఫోన్ల కొనుగోలుపై రూ.11,910 వరకు డిస్కౌంట్ ఆఫర్లు!! మిస్ అవ్వకండి

|

ప్రపంచం మొత్తం మీద ఉన్న ప్రజలు ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లను ఉపయోగించడానికి అధికంగా ఇష్టపడుతున్నారు. స్మార్ట్‌ఫోన్లలో అనేక రకాల బ్రాండ్లు అందుబాటులో ఉన్నాయి. ఎన్ని బ్రాండ్లు ఉన్నప్పటికీ కూడా ఆపిల్ ఐఫోన్ బ్రాండ్లకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఈ బ్రాండ్ మోడల్స్ అన్ని కూడా అధిక ధర వద్దనే లభిస్తూఉంటాయి. కొత్త మోడల్స్ విడుదల అయినప్పటికీ కూడా పాత మోడల్స్ కి కూడా ప్రత్యేక ఆదరణ ఉంది. ఈ సంస్థ ఇప్పుడు ఐఫోన్ 14 సిరీస్ మోడల్స్ లను లాంచ్ చేసే పనిలో ఉంది. కానీ ఇప్పుడు ఐఫోన్ 12 సిరీస్ లోని ఐఫోన్ 12 మరియు ఐఫోన్ 12 మినీ ఫోన్ల కొనుగోలు మీద ఎన్నడూ లేనివిధంగా సుమారు రూ.11,910 వరకు డిస్కౌంట్లను అందిస్తోంది.

 

ఐఫోన్ 12 సిరీస్

ఐఫోన్ 12 సిరీస్ ఫోన్లను తగ్గింపు ధరలతో ఇప్పుడు అమెజాన్ ఇండియా మరియు ఫ్లిప్‌కార్ట్ నుండి కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. ఈ హ్యాండ్‌సెట్‌లపై వర్తించే డిస్కౌంట్‌లు వివిధ రకాల వేరియంట్‌ల స్టోరేజ్ వ్యత్యాసాల ప్రకారం మారుతూ ఉంటాయి. ఇ-కామర్స్ సైట్‌లు అదనంగా ఐఫోన్ 12 మోడళ్లపై బ్యాంక్ మరియు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లను కూడా అందిస్తున్నాయి. ఆపిల్ ఐఫోన్ 12 మరియు ఐఫోన్ 12 మినీ యొక్క కొన్ని కలర్ వేరియంట్‌లు మరియు నిర్దిష్ట స్టోరేజ్ ఎంపికలు అమెజాన్ మరియు ఫ్లిప్‌కార్ట్ రెండింటిలోనూ అందుబాటులో లేవు అని గుర్తుంచుకోవాలి.

ఐఫోన్ 12 తగ్గింపు ధరలు

ఐఫోన్ 12 తగ్గింపు ధరలు

ఐఫోన్ 12 యొక్క 64GB స్టోరేజ్ బ్లాక్ కలర్ వేరియంట్ MRP ధర కంటే రూ.11,910 తగ్గింపుతో లభిస్తుంది. అమెజాన్ ఇండియాలో దీనిని రూ.65,900 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అలాగే అదే స్టోరేజ్ ఆప్షన్ యొక్క బ్లూ అండ్ వైట్ వేరియంట్ రూ.11,000 తగ్గింపుతో లభిస్తుంది. రెడ్ కలర్ వేరియంట్ రూ.9,910 డిస్కౌంట్ మరియు పర్పుల్, గ్రీన్ కలర్ ఆప్షన్‌లపై రూ.8,910 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.

MRP
 

అలాగే ఐఫోన్12 ఫోన్ యొక్క 128GB స్టోరేజ్ వేరియంట్ MRP నుండి రూ.11,000 తగ్గింపుతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. అమెజాన్ లో దీనిని రూ.70,900 ధర వద్ద పొందవచ్చు. అలాగే ఐఫోన్ 12 యొక్క 256GB వేరియంట్ MRP నుండి రూ.26,901 తగ్గింపుతో రూ.94,900 ధర వద్ద లభిస్తుంది. అదనంగా ఇ-కామర్స్ సైట్ ఎక్సచేంజ్ పై రూ.11,650 వరకు తగ్గింపును మరియు బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్‌పై రూ.2,000 వరకు క్యాష్ బ్యాక్ ని కూడా అందిస్తుంది.

ఐఫోన్ 12 స్పెసిఫికేషన్స్

ఐఫోన్ 12 స్పెసిఫికేషన్స్

ఆపిల్ ఐఫోన్12 మోడల్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆపిల్ యొక్క కొత్త అంతర్గత A15 బయోనిక్ SoC చేత నిర్మించబడి ఉంది. ఇందులో 6 కోర్ CPU రెండు హై-పెర్ఫార్మెన్స్ మరియు నాలుగు సమర్థవంతమైన కోర్లతో పాటు 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ను కలిగి ఉన్నాయి. అలాగే ఇది 2.5 గంటల మెరుగైన బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉంది. ఇది 256GB కంటే ఎక్కువ స్టోరేజ్‌తో లభ్యమవుతున్న మొట్టమొదటి నాన్-ప్రో ఐఫోన్‌ కావడం విశేషం. ఐఫోన్ 13 ఫోన్ 20 శాతం స్క్రీన్ స్పేస్, 120Hz రిఫ్రెష్ రేట్ తో 5.4-అంగుళాల మెరుగైన ప్రకాశాన్ని కలిగి ఉన్నాయి. పవర్-ఎఫెక్టివ్ సిస్టమ్ కోసం స్వైప్ స్పీడ్ వంటి యూజర్ ఇన్‌పుట్ ఆధారంగా వాటి రిఫ్రెష్ రేట్లను డైనమిక్‌గా సర్దుబాటు చేయవచ్చు. అలాగే ఇది పగటిపూట ప్రకాశం వరుసగా 800 నిట్స్ మరియు 1000 నిట్స్ కాగా, గరిష్టంగా హెచ్‌డిఆర్ ప్రకాశం 1200 నిట్స్ వరకు ఉంటుంది. ఇవి డాల్బీ విజన్ HDR10 మరియు HLG కి కూడా మద్దతు ఇస్తారు. వీటి ముందు భాగంలో సిరామిక్ షీల్డ్ మెటీరియల్ మరియు IP68 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌లు ఉన్నాయి. అవి పింక్, బ్లూ, మిడ్నైట్, స్టార్‌లైట్, మరియు రెడ్ వంటి ఐదు కొత్త కలర్ లలో అందుబాటులో ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Apple iPhone 12 and iphone 12 Mini Sales Offers Up to RS.11,910 Discounts on Amazon and Flipkart

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X