2021 Q1లో అధికంగా అమ్ముడైన ఫోన్‌గా iPhone 12 సరికొత్త రికార్డు...
ఆపిల్ సంస్థ ఇటీవల తన యొక్క అభిమానుల కోసం ఐఫోన్ 12 ను విడుదల చేసింది. ఇప్పుడు ఇది ఆపిల్ సంస్థ యొక్క మెయిన్ ఫోన్ గా మారింది. ఆపిల్ సంస్థ యొక్క ఐఫోన్ అమ్మకాలలో ఐఫోన్ 12 దాని విలువను మళ్ళీ నిరూపించింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ యొక్క తాజా నివేదిక ప్రకారం ప్రపంచం మొత్తం మీద 2021 Q1 స్మార్ట్ఫోన్ అమ్మకాలలో అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌గా ఐఫోన్ 12 రికార్డును సృష్టించింది. రాబడి మరియు వాల్యూమ్ పరంగా కూడా ఐఫోన్ 12 అందరికంటే ముందంజలో ఉంది. 2021 Q1లో అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌ల జాబితాలో మొదటి నాలుగు ఫోన్లు ఐఫోన్‌లు ఉండడం గమనార్హం. ఆపిల్ సంస్థ ఇప్పుడు చార్టుల్లో ఆధిపత్యం చెలాయించింది. దీని గురించి మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

కౌంటర్ పాయింట్ రీసెర్చ్ యొక్క తాజా నివేదిక ప్రకారం గ్లోబల్ షిప్‌మెంట్స్‌లో 5 శాతం వాటాతో ఐఫోన్ 12 మొదటి స్థానంలో నిలిచిందని వెల్లడించారు. దాని తరువాత 4 శాతం వాటాతో ఐఫోన్ 12 ప్రో మాక్స్, 3 శాతం వాటాతో ఐఫోన్ 12 ప్రో, 2 శాతం వాటా ఎగుమతులతో ఐఫోన్ 11 తరువాతి స్థానాలను ఆక్రమించాయి. ఈ జాబితాలో గల ఇతర ఫోన్ల విషయానికి వస్తే షియోమి రెడ్‌మి 9A 2 శాతం ఎగుమతులతో ఐదవ స్థానంలో ఉండగా 1 శాతం ఎగుమతులతో రెడ్‌మి 9 ఆరవ స్థానంలో ఉంది. తరువాత ఏడవ స్థానంను 1 శాతం ఎగుమతులతో శామ్సంగ్ గెలాక్సీ A ఆక్రమించగా అదే 1 శాతం ఎగుమతులతో ఎనిమిదవ స్థానంను రెడ్‌మి నోట్ 9 అందుకున్నది. చివరిగా తొమ్మిది మరియు పదవ స్థానాలను 1 శాతం ఎగుమతులతో శామ్సంగ్ గెలాక్సీ A21s మరియు గెలాక్సీ A31 లు అందుకున్నాయి.

ఆదాయ పరంగా చూసుకుంటే ఐఫోన్ 12 ప్రో మాక్స్ 12 శాతం ఆదాయ ఉత్పత్తితో మొదటి స్థానంలో ఉంది. అలాగే 11 శాతం ఆదాయ వనరులతో ఐఫోన్ 12 రెండవ స్థానంలో ఉండగా, 9 శాతం వృద్ధితో ఐఫోన్ 12 ప్రో మూడవ స్థానంలో, మరియు 3 శాతం వృద్ధితో ఐఫోన్ 11 నాల్గవ స్థానంలో ఉంది. ఐదవ స్థానంలో 3 శాతం ఆదాయ ఉత్పత్తితో శామ్‌సంగ్ గెలాక్సీ S21 అల్ట్రా, ఆరవ స్థానంలో ఐఫోన్ 12 మినీ (2 శాతం), ఏడవ స్థానంలో గెలాక్సీ S21 5G (2 శాతం), ఎనిమిదవ స్థానంలో 2 శాతం ఆదాయ వృద్ధి ఉత్పత్తితో హువాయి మేట్ 40 ప్రో, తొమ్మిదవ స్థానంలో గెలాక్సీ S21 + 5G (1 శాతం), ఐఫోన్ SE 2020 పదవ స్థానంలో 1 శాతం ఆదాయ ఉత్పత్తితో ఉన్నాయి.

5G ఫోన్‌లకు ప్రస్తుతం బలమైన డిమాండ్ ఉన్న కారణంగా మరియు 2020 లో తక్కువ స్మార్ట్‌ఫోన్ అమ్మకాల కారణంగా ఆపిల్ ఈ ప్యాక్‌కు నాయకత్వం వహించగలిగింది. Q1 2021 లో ప్రపంచ స్మార్ట్‌ఫోన్ ఆదాయం రికార్డు దశలో100 బిలియన్ డాలర్లకు మించిపోయాయని సూచించబడింది. ఐఫోన్ 12 ఇటీవలే ఈ ఏడాది జనవరిలో అత్యధికంగా అమ్ముడైన ఫోన్‌గా అవతరించింది.


Click it and Unblock the Notifications








