Home
News

Flipkart లో iPhone 13 కొనుగోలుపై భారీ ఆఫ‌ర్‌.. ఓ లుక్కేయండి!

ప్ర‌ముఖ ఈ-కామర్స్ దిగ్గజం Flipkart ఇప్పుడు బిగ్ దసరా సేల్‌ను నిర్వహిస్తున్న విష‌యం తెలిసిందే. అందులో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, ల్యాప్‌టాప్‌లు స‌హా అనేక గ్యాడ్జెట్ల‌పై ఆక‌ర్ష‌ణీయ‌మైన డిస్కౌంట్లు అందిస్తోంది. ఈ సేల్ అక్టోబర్ 5 నుండి ప్రారంభమైంది.. కాగా, ఇది రేపు అంటే అక్టోబర్ 8 వరకు కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ సమయంలో, 128GB వేరియంట్ iPhone 13 పై అద్భుత‌మైన ఆఫ‌ర్ అందుబాటులో ఉంది.

Flipkart

ప్ర‌స్తుతం ఈ iPhone 13 వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.59,990కి అందుబాటులో ఉంది, అయితే దీనిని ఈ సేల్‌లో భాగంగా ప‌లు ఆఫ‌ర్ల‌తో రూ.50,000లోపు ధ‌ర‌కు కొనుగోలు చేయవచ్చు. మీరు కూడా ఐఫోన్ మారాల‌నుకుంటే ఇదే మంచి స‌మ‌యం. ఒక‌వేళ త‌క్కువ ధ‌ర‌కు ఐఫోన్ 13 కొనుగోలు చేయాల‌నుకుంటే ఇది పూర్తిగా చ‌ద‌వండి.

Flipkart

Flipkart ఎక్స్ఛేంజ్ ఆఫర్:
కస్టమర్‌లు తమ పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే రూ.16,900 వరకు తక్షణ క్రెడిట్‌ని ఆస్వాదించవచ్చు. త‌ద్వారా iPhone 13 ధరను రూ.43,000కి తగ్గించవచ్చు. అదే సమయంలో, కస్టమర్‌లు 6 నెలల వరకు నో-కాస్ట్ EMIని కూడా ఎంచుకోవచ్చు. అదనంగా, HDFC క్రెడిట్ మరియు డెబిట్ కార్డ్ హోల్డర్లు EMI లావాదేవీలపై రూ.1,000 మరియు EMI కాని లావాదేవీలపై రూ.500 తగ్గింపును పొందుతారు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్‌లకు అదనంగా 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

Flipkart హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఆఫర్‌లు:
ఫ్లిప్‌కార్ట్ బిగ్ దసరా సేల్ 2022 సంద‌ర్భంగా హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌తో కూడా భాగస్వామిగా ఉంది. అయితే, HDFC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లను ఉపయోగించే కొనుగోలుదారులు యాన్యువ‌ల్ సేల్ సమయంలో 10 శాతం తక్షణ తగ్గింపును పొందగలరు. సాధారణంగా ఎంపిక చేసిన బ్యాంకులపై 10 శాతం ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ రూ.1,000కి పరిమితం చేయబడింది. ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ డీల్స్ మరియు నో-కాస్ట్ EMI మరియు స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌ను కూడా అందిస్తోంది.

Flipkart

యాపిల్ కంపెనీ అధికారిక సైట్లో కూడా ఫెస్టివ్ సేల్ కొన‌సాగుతోంది:
భార‌త్‌లో పండ‌గ సీజ‌న్ ప్రారంభ‌మైన నేప‌థ్యంలో Apple కంపెనీ యొక్క అధికారిక సైట్ వేదిక‌గా ప్ర‌త్యేక సేల్ కొన‌సాగుతోంది. Apple India స్టోర్‌లో ప్ర‌స్తుతం పండ‌గ సీజ‌న్ సేల్ లైవ్‌లో ఉంది. ఈ సేల్ సమయంలో, కొనుగోలుదారులు తాజా iPhone 14 సిరీస్‌తో సహా అనేక ఉత్పత్తులపై రూ.7,000 తగ్గింపు పొంద‌వ‌చ్చు.

iPhoneలు, MacBooks, iPadలు, AirPodలు మరియు మరిన్నింటి వంటి Apple ఉత్పత్తులపై డిస్కౌంట్ ఆఫర్ వర్తిస్తుంది. అయితే, Apple తక్షణ క్యాష్‌బ్యాక్ అందించడానికి HDFC బ్యాంక్ మరియు అమెరికన్ ఎక్స్‌ప్రెస్‌లతో భాగస్వామ్యం కలిగి ఉంది. కాబ‌ట్టి, ఆ ఎంపిక చేసిన కస్టమర్‌లకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఈ సేల్ సమయంలో, పైన పేర్కొన్న బ్యాంకుల కస్టమర్‌లు ఆయా క్రెడిట్ కార్డుల‌ను వినియోగించి రూ.41వేల కంటే ఎక్కువ కొనుగోళ్ల‌పై రూ.7వేల‌ వరకు తక్షణ తగ్గింపును పొందుతారు.

మ‌రోవైపు, భారతదేశంలో Apple iPhone 14 Plus సేల్‌కు అందుబాటులోకి:
Apple యొక్క అతిపెద్ద నాన్-ప్రో మోడ‌ల్ అయిన iPhone 14 ప్ల‌స్‌ దేశంలో సేల్‌కు అందుబాటులోకి వ‌చ్చింది. శుక్ర‌వారం నుంచి కంపెనీ iPhone 14 ప్ల‌స్ వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. iPhone 14 ప్ల‌స్ యొక్క 128GB వేరియంట్‌ రూ.89,900 ప్రారంభ ధరకు అందుబాటులో ఉంది. 256GB వేరియంట్ ధర రూ.99,900 కు అందుబాటులో ఉంది. ఇకపోతే, 512GB స్టోరేజీతో కూడిన గరిష్ట వేరియంట్ ధర రూ.1,19,900 కు అందుబాటులో ఉంది. స్మార్ట్‌ఫోన్‌లో బ్లూ, మిడ్‌నైట్, స్టార్‌లైట్, పర్పుల్ మరియు ప్రొడక్ట్ రెడ్ వంటి అనేక క‌ల‌ర్ ఆప్ష‌న్లు ఉన్నాయి. ఇది భారతదేశంలోని ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ స్టోర్‌లలో అందుబాటులో ఉంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple iPhone 13 available under Rs.50,000 in flipkart festive sale
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X