Flipkartలో ఇలా సేల్ స్టార్ట్.. అలా iPhone 13 స్టాక్ అవుట్‌!

|

Apple కంపెనీ 2021 iPhone మోడ‌ల్ లాంచ్‌తో 64GB స్టోరేజ్ వేరియంట్‌ను ప‌క్క‌న పెట్టిన విష‌యం తెలిసిందే. iPhone 13 సిరీస్ నుంచి బేస్ వేరియంట్ 128GB స్టోరేజీ వేరియంట్‌తో ప్రారంభ‌మ‌వుతుంది. కాగా, Flipkartలో ప్ర‌స్తుతం కొన‌సాగుతున్న బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో iPhone 13 మోడ‌ల్ యొక్క 128GB వేరియంట్ కు భారీ డిమాండ్ వ‌చ్చింది.

 
Flipkartలో ఇలా సేల్ స్టార్ట్.. అలా iPhone 13 స్టాక్ అవుట్‌!

సేల్ మొద‌లైన కొద్ది సేప‌టికే iPhone 13 మోడ‌ల్ 128జీబీ వేరియంట్ల స్టాక్ అయిపోయినట్లు తెలుస్తోంది. ఈ సేల్‌లో ఐఫోన్ 13 భారీగా అమ్ముడ‌య్యాయి. Flipkart ప్లస్ సభ్యులు సెప్టెంబర్ 22న సేల్‌కు ఒక రోజు ముందే డిస్కౌంట్‌లు మరియు ఆఫర్‌లను పొందగలిగారు. దీంతో, మిగ‌తా యూజ‌ర్లంద‌రికీ.. ఈరోజు అసలు సేల్ ప్రారంభం కావ‌డానికి ముందే iPhone 13 మోడ‌ల్ 128జీబీ వేరియంట్ స్టాక్ లో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

Apple కంపెనీ ఇటీవ‌ల iPhone 14 లాంచ్‌కు ముందు, ఐఫోన్ 13 ధరను గణనీయంగా తగ్గించింది. దీంతో ఆ డివైజ్‌ యొక్క 128GB వేరియంట్ అస‌లు ధర రూ.69,990 ఉండ‌గా.. సెప్టెంబరు 22 అర్ధరాత్రి దాదాపు రూ.20 వేల తగ్గింపుతో రూ.49,990 లిస్ట్ చేయ‌బ‌డింది. దీంతో ఈ ఐఫోన్ కోసం చాలా కాలంగా వేచి ఉన్న ఎంతో మంది దీన్ని కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఇంకో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే.. ఐఫోన్ 14 మ‌రియు ఐఫోన్ 13కి మ‌ధ్య ఫీచ‌ర్ల‌లో పెద్ద‌గా తేడాలు ఏమీ లేక‌పోవ‌డంతో చాలా మంది ఈ డీల్‌పై ఆస‌క్తి క‌న‌బ‌ర్చిన‌ట్లు స‌మాచారం.

Flipkartలో ఇలా సేల్ స్టార్ట్.. అలా iPhone 13 స్టాక్ అవుట్‌!

ప్ర‌స్తుతానికి ఇది Flipkart బిగ్ బిలియన్ సేల్‌లో ధ‌ర రూ.57,990 గా చూపిస్తోంది. కొనుగోలుదారులు తమ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవ‌డం ద్వారా అద‌నంగా రూ.16వేల వరకు అదనపు తగ్గింపును పొందవచ్చు. అయితే, త‌గ్గింపు అనేది మీ డివైజ్ యొక్క మోడల్ మరియు పరిస్థితి మీద ఆధార‌ప‌డి ఉంటుంది. కొనుగోలు కోసం ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించడంపై అదనంగా 5% క్యాష్‌బ్యాక్ ఉంటుంది.

Flipkartలో ఇలా సేల్ స్టార్ట్.. అలా iPhone 13 స్టాక్ అవుట్‌!

iPhone 13 మోడ‌ల్ 128GB వేరియంట్ స్టాక్‌లోకి మ‌ళ్లీ వ‌స్తుందా!
ఐఫోన్ 13 మోడ‌ల్ 128GB వేరియంట్ స్టాక్ గురించి ప్ర‌స్తుతానికి ఫ్లిప్‌కార్ట్ ఏమీ ప్ర‌స్తావించ‌లేదు. కానీ, ఇది స్టాక్‌కు తిరిగి వచ్చే అవకాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఆ త‌ర్వాత మ‌ళ్లీ విక్ర‌యాలు వేగంగా జ‌రిగిపోవ‌చ్చు. మీరు iPhone 13ని పొందాలనుకుంటే, కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయం, ఎందుకంటే దాని 256GB మరియు 512GB వేరియంట్‌లుకూడా ఫ్లిప్‌కార్ట్‌లో త‌గ్గింపుతో రూ.66,990 మరియు రూ.86,990 గా ఉన్నాయి.

iPhone 13 స్పెసిఫికేషన్స్:
ఆపిల్ ఐఫోన్13 మోడల్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, ఈ మొబైల్ కు 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR పానెల్ డిస్‌ప్లేను క‌లిగి ఉంది. ఇది A15 బ‌యోనిక్ చిప్‌ను క‌లిగి ఉంది. ఇది 4జీబీ ర్యామ్, 512జీబీ వ‌ర‌కు ఇంట‌ర్న‌ల్ స్టోరేజ్ కెపాసిటీల‌ను క‌లిగి ఉంది. ఈ మొబైల్ ఐఓఎస్‌ 15 ఓఎస్ పై ప‌నిచేస్తుంది. ఇక ఛార్జ్‌ విష‌యానికొస్తే 3240mAh సామ‌ర్థ్యం గ‌ల బ్యాట‌రీని అందిస్తున్నారు.

 

ఇక కెమెరాల విష‌యానికొస్తే.. ఈ మొబైల్ డ్యుయ‌ల్ కెమెరా సెట‌ప్‌ను క‌లిగి ఉంది. ప్ర‌ధాన కెమెరా 12-మెగాపిక్సెల్ క్వాలిటీలో ప్రైమ‌రీ కెమెరాగా అందిస్తున్నారు. ఇక మ‌రొక‌టి 12 మెగాపిక్సెల్ క్వాలిటీతో అల్ట్రా వైడ్ యాంగిల్‌ లెన్స్ ఇస్తున్నారు. ఇక వీడియో కాలింగ్ సెల్ఫీ విష‌యానికొస్తే.. 12 మెగాపిక్సెల్ క్వాలిటీ గ‌ల లెన్స్ ఫ్రంట్ క్యాం కు ఇస్తున్నారు.

Best Mobiles in India

English summary
Apple iPhone 13 Model 128GB Variant on out of stock in flipkart sale.

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X