ఏప్రిల్‌లో ఎక్కువ‌గా ఏ కంపెనీ ఫోన్లు అమ్ముడ‌య్యాయో తెలుసా!

|

యూఎస్ కు చెందిన ప్ర‌ముఖ మొబైల్ త‌యారీ సంస్థ యాపిల్ గ్లోబ‌ల్ మార్కెట్లో త‌న‌కు ఎవ‌రూ సాటి లేర‌ని మ‌రోసారి నిరూపించుకుంది. ఏప్రిల్ నెల‌లో గ్లోబ‌ల్ మార్కెట్‌లో అత్య‌ధిక మొబైల్స్ అమ్మిన బెస్ట్ సెల్లింగ్ ఫోన్ల జాబితాలో తొలి స్థానాన్ని సాధించింది. ఈ మేర‌కు కౌంట‌ర్‌పార్ట్ అనే సంస్థ ఓ నివేదిక‌లో వెల్ల‌డించింది. ఇత‌ర టెక్ దిగ్గ‌జాల‌తో పోలిస్తే ఏప్రిల్ నెల‌లో యాపిల్ సంస్థ అత్య‌ధిక ఫోన్లు అమ్ముడైన‌ట్లు ఆ నివేదిక పేర్కొంది. ఈ జాబితాలో షావోమీ, శాంసంగ్ మొబైల్ కంపెనీల పేర్లు కూడా ఉన్నాయి. కాక‌పోతే, యాపిల్ గ‌తేడాది మాదిరిగానే తొలి స్థానం సాధించ‌డం విశేషం. ఈ ఏడాది మార్చిలో అన‌గా 2022 మొదటి త్రైమాసికంలో కూడా iPhone 13 మ్యాక్స్ మరియు iPhone 13 అత్యధికంగా అమ్ముడైన డివైజ్‌లుగా ఉన్నాయని వెల్లడించింది.

 
ఏప్రిల్‌లో ఎక్కువ‌గా ఏ కంపెనీ ఫోన్లు అమ్ముడ‌య్యాయో తెలుసా!

యాపిల్‌కు చెందిన మొత్తం ఐదు మోడ‌ల్స్ టాప్ సెల్లింగ్ జాబితాలో ఉన్నాయి. iPhone 13 గ్లోబల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో 5.5 శాతం వాటాతో జాబితాలో అగ్రస్థానంలో ఉంది. భారతదేశంలో iPhone 13 Pro Max ప్రారంభ ధర రూ. 1,27,900 వద్ద విక్రయిస్తోంది. అదేవిధంగా దేశంలో స్టాండ‌ర్ట్‌ iPhone 13 రూ.72,990కి అందుబాటులో ఉంది. జాబితాలోని మిగిలిన డివైజ్‌లు iPhone 13 Pro, iPhone 12 మరియు iPhone SE 2022 లు ఉన్నాయి. Apple iPhone SE 2022 మోడల్‌కి సంబంధించి సమీక్షకుల నుండి మంచి స్పంద‌న రాలేదని తెలుస్తోంది. iPhone SE 2022 టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ ఫోన్‌ల లిస్ట్‌లో 7వ స్థానంలో ఉంది.

ఏప్రిల్‌లో ఎక్కువ‌గా ఏ కంపెనీ ఫోన్లు అమ్ముడ‌య్యాయో తెలుసా!

ఏప్రిల్ నెల మొత్తం అమ్మకాలలో యాపిల్ సంస్థ‌ 89 శాతం వాటాను కలిగి ఉంది, ఈక్ర‌మంలో శాంసంగ్ సంస్థ‌ టాప్ మోడల్స్ మొత్తం అమ్మకాలలో కేవలం 22 శాతం మాత్రమే ఉండ‌టం గ‌మ‌నార్హం. ఏదేమైన‌ప్ప‌టికీ.. శాంసంగ్‌కు చెందిన Samsung Galaxy S22 Ultra చాలా ఎక్కువ ధ‌ర క‌లిగిన‌ప్ప‌టికీ 1.5 శాతం షేర్‌తో జాబితాలో 5వ స్థానాన్ని సంపాదించడం విశేషం. Samsung Galaxy S22 Ultra ప్రస్తుతం భారతదేశంలో రూ. 1,04,999కి విక్రయించబడుతోంది. తాజా జాబితా ప్రాథమికంగా అధిక ధర ఉన్న‌ప్ప‌టికీ, దాంతో సంబంధం లేకుండా డిజైన్, కెమెరా మరియు పనితీరు పరంగా అన్నింటిలో ఉత్తమమైన స్మార్ట్‌ఫోన్ కొన‌డానికి 1 లక్ష కంటే ఎక్కువ ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నవారు చాలా మంది ఉన్నారని ఈ తాజా గ‌ణాంకాలు సూచిస్తున్నాయి. Samsung Galaxy A13, Galaxy A03 కోర్ మరియు ఇటీవల ప్రారంభించిన Galaxy A53 5G వంటి స్మార్ట్‌ఫోన్లు కూడా జాబితాలో ఉండ‌టం విశేషం. Redmi Note 11 LTE కూడా 1.3 శాతం షేర్‌తో చివరి స్థానంలో ఉంది.

ఏప్రిల్‌లో ఎక్కువ‌గా ఏ కంపెనీ ఫోన్లు అమ్ముడ‌య్యాయో తెలుసా!
iPhone 13 స్పెసిఫికేషన్స్
ఆపిల్ ఐఫోన్13 మోడల్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆపిల్ యొక్క కొత్త అంతర్గత A15 బయోనిక్ SoC చేత నిర్మించబడి ఉంది. ఇందులో 6 కోర్ CPU రెండు హై-పెర్ఫార్మెన్స్ మరియు నాలుగు సమర్థవంతమైన కోర్లతో పాటు 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ను కలిగి ఉన్నాయి. అలాగే ఇది 2.5 గంటల మెరుగైన బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉంది. ఇది 256GB కంటే ఎక్కువ స్టోరేజ్‌తో లభ్యమవుతున్న మొట్టమొదటి నాన్-ప్రో ఐఫోన్‌ కావడం విశేషం. ఐఫోన్ 13 ఫోన్ 20 శాతం స్క్రీన్ స్పేస్, 120Hz రిఫ్రెష్ రేట్ తో 5.4-అంగుళాల మెరుగైన ప్రకాశాన్ని కలిగి ఉన్నాయి. పవర్-ఎఫెక్టివ్ సిస్టమ్ కోసం స్వైప్ స్పీడ్ వంటి యూజర్ ఇన్‌పుట్ ఆధారంగా వాటి రిఫ్రెష్ రేట్లను డైనమిక్‌గా సర్దుబాటు చేయవచ్చు. అలాగే ఇది పగటిపూట ప్రకాశం వరుసగా 800 నిట్స్ మరియు 1000 నిట్స్ కాగా, గరిష్టంగా హెచ్‌డిఆర్ ప్రకాశం 1200 నిట్స్ వరకు ఉంటుంది. ఇవి డాల్బీ విజన్ HDR10 మరియు HLG కి కూడా మద్దతు ఇస్తారు.
Best Mobiles in India

English summary
Apple iPhone 13 rules the list of best selling phones across the world

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X