ఆపిల్ ఐఫోన్ 13 కొనుగోలుపై రూ.24,000 తగ్గింపు!! ఆఫర్ మిస్ చేసుకోకండి..

|

ఆపిల్ బ్రాండ్ యొక్క iPhone 13 లాంచ్ అయిన తర్వాత ఆపిల్ సంస్థ తన యొక్క ఐఫోన్ 12 తో సహా అనేక మోడల్స్ ఫోన్లపై భారీగా ధర తగ్గింపును అందించింది. అదనంగా ఐఫోన్ 12 మరియు ఐఫోన్ 11 సిరీస్‌లు పండుగ సీజన్‌లలో చాలా తక్కువ ధరలకు విక్రయించబడుతున్నాయి. కానీ మీరు సరికొత్త ఐఫోన్ 13ని కొనుగోలు చేయాలనుకుంటే దీని కంటే ఉత్తమ సమయం రాకపోవచ్చు. ఐఫోన్ 13 లాంచ్ అయిన దాని ప్రారంభ ధర రూ.79,900 కు బదులుగా ఇప్పుడు కేవలం రూ.55,000 ధర వద్ద కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

ఐఫోన్ 13

అంటే కస్టమర్లు ఆపిల్ ఐఫోన్ 13 మోడల్‌ను రూ.24,000 తగ్గింపుతో ఇప్పుడు కొనుగోలు చేయవచ్చు. ఈ తగ్గింపు Apple యొక్క అధికారిక విక్రేత వెబ్‌సైట్ Indiaistore.comలో అందుబాటులో ఉంది. అలాగే ఈ ఆఫర్‌లో క్యాష్‌బ్యాక్ మరియు ఎక్స్ఛేంజ్ బోనస్‌లు కూడా అదనంగా ఉన్నాయి. ఈ వెబ్‌సైట్ iPhone 13పై రూ.6,000 వరకు క్యాష్‌బ్యాక్ ను ఇస్తోంది. ఆ తర్వాత దీని యొక్క ధర రూ.73,900కి చేరుకుంటుంది. ఇది కాకుండా వినియోగదారులు తమ పాత ఫోన్‌లను కూడా మార్పిడి చేసుకోవచ్చు. అలాగే HDFC బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్‌లపై EMI లావాదేవీలు మరియు HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై EMI యేతర లావాదేవీలపై రూ.6000.00 క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది.

ఆపిల్ ఐఫోన్ 13 డిస్కౌంట్ ఆఫర్లు

ఆపిల్ ఐఫోన్ 13 డిస్కౌంట్ ఆఫర్లు

ఉదాహరణకు మీరు మంచి స్థితిలో ఉన్న iPhone XR 64GBని మార్చుకుంటే కనుక మీకు రూ.18,000 తగ్గుతుంది. ఆ తర్వాత iPhone 13ని రూ.55,900కి కొనుగోలు చేయవచ్చని వెబ్‌సైట్ చూపించింది. బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్ మరియు జెస్ట్‌మనీపై డౌన్ పేమెంట్‌తో 24 నెలల వరకు నో కాస్ట్ EMI స్కీమ్ లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇందుకోసం 24 నెలలకు ప్రతి నెల రూ.3329 ప్రారంభ వాయిదా చెల్లించాల్సి ఉంటుంది.

iPhone

iPhone 13 యొక్క 256 మరియు 512 GB వేరియంట్‌లపై ఇలాంటి ఆకర్షణీయమైన ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. వినియోగదారులు iPhone 13 యొక్క 256 GB వేరియంట్‌ను రూ.89,900 ధరకు బదులుగా రూ. 24,000 తగ్గింపుతో రూ.65,900 ధర వద్ద పొందవచ్చు. అలాగే iPhone 13 యొక్క 512 వేరియంట్‌ను రూ.1,09,900 ధరకు బదులుగా రూ.24,000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. అంటే మీరు దానిని రూ.85,900 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

ఐఫోన్ 13 స్పెసిఫికేషన్స్

ఐఫోన్ 13 స్పెసిఫికేషన్స్

ఆపిల్ ఐఫోన్ 13 మోడల్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆపిల్ యొక్క కొత్త అంతర్గత A15 బయోనిక్ SoC చేత నిర్మించబడి ఉంది. ఇందులో 6 కోర్ CPU రెండు హై-పెర్ఫార్మెన్స్ మరియు నాలుగు సమర్థవంతమైన కోర్లతో పాటు 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ను కలిగి ఉన్నాయి. అలాగే ఇది 2.5 గంటల మెరుగైన బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉంది. ఇది 256GB కంటే ఎక్కువ స్టోరేజ్‌తో లభ్యమవుతున్న మొట్టమొదటి నాన్-ప్రో ఐఫోన్‌ కావడం విశేషం. ఐఫోన్ 13 ఫోన్ 20 శాతం స్క్రీన్ స్పేస్, 120Hz రిఫ్రెష్ రేట్ తో 5.4-అంగుళాల మెరుగైన ప్రకాశాన్ని కలిగి ఉన్నాయి. పవర్-ఎఫెక్టివ్ సిస్టమ్ కోసం స్వైప్ స్పీడ్ వంటి యూజర్ ఇన్‌పుట్ ఆధారంగా వాటి రిఫ్రెష్ రేట్లను డైనమిక్‌గా సర్దుబాటు చేయవచ్చు. అలాగే ఇది పగటిపూట ప్రకాశం వరుసగా 800 నిట్స్ మరియు 1000 నిట్స్ కాగా, గరిష్టంగా హెచ్‌డిఆర్ ప్రకాశం 1200 నిట్స్ వరకు ఉంటుంది. ఇవి డాల్బీ విజన్ HDR10 మరియు HLG కి కూడా మద్దతు ఇస్తారు. వీటి ముందు భాగంలో సిరామిక్ షీల్డ్ మెటీరియల్ మరియు IP68 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌లు ఉన్నాయి. అవి పింక్, బ్లూ, మిడ్నైట్, స్టార్‌లైట్, మరియు రెడ్ వంటి ఐదు కొత్త కలర్ లలో అందుబాటులో ఉన్నాయి.

వైడ్ యాంగిల్ కెమెరా

ఐఫోన్ 13లో కొత్త వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఇది తక్కువ వెలుతురులో ప్రకాశవంతమైన ఫలితాల కోసం 47 శాతం ఎక్కువ కాంతిని సంగ్రహిస్తుంది. కొత్త సినిమాటిక్ వీడియో మోడ్ ర్యాక్ ఫోకస్‌కి మద్దతు ఇస్తుంది. ఇది కదిలేటప్పుడు కూడా సబ్జెక్టుల మధ్య ఫోకస్‌ని మార్చడానికి మరింత సులువుగా ఉంటుంది. ఒక సబ్జెక్ట్ ఫ్రేమ్‌లోకి ప్రవేశించినప్పుడు లేదా దూరంగా చూసినప్పుడు ఒక సబ్జెక్ట్ నుండి మరొక సబ్జెక్ట్‌కు నిజ సమయంలో స్వయంచాలకంగా పరివర్తనాలు జరుగుతాయి. ఆపిల్ ఫోటోగ్రఫీ డైరెక్టర్లు వినియోగదారుల దృష్టికి మార్గనిర్దేశం చేసే సృజనాత్మక ఎంపికలను అధ్యయనం చేసినట్లు చెప్పారు. ఫోటోగ్రఫీ కారణంగా టెలిఫోటో ఒకటి సహా అన్ని కెమెరాలు ఇప్పుడు నైట్ మోడ్‌తో పని చేస్తాయి. కొత్త ఐఫోన్‌లు 5G ఫీచర్‌ని కస్టమ్ డిజైన్ చేసిన యాంటెనాలు మరియు రేడియో కాంపోనెంట్‌లతో మరిన్ని బ్యాండ్‌లకు సపోర్ట్ చేస్తాయి. ఆన్-డివైస్ మెషిన్ లెర్నింగ్ కొత్త యాప్‌లను ప్రారంభిస్తుంది మరియు సిరి ఆడియో రిక్వెస్ట్‌ల కోసం ఆన్-డివైజ్ స్పీచ్ రికగ్నిషన్‌తో గోప్యతను మెరుగుపరుస్తుంది.

Best Mobiles in India

English summary
Apple iPhone 13 Special Sale Offers! HDFC Users Get More Cashback Offers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X