Just In
- 10 hrs ago
Poco X5 Pro 5G ఇండియా లాంచ్ తేదీ మరియు ధర లీక్ అయింది! వివరాలు
- 1 day ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 1 day ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 1 day ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
Don't Miss
- News
హిందూపురంలో బాలయ్యకు తృటిలో తప్పిన ప్రమాదం- సుదీర్ఘ విరామం తరువాత రావడంతో..
- Sports
INDvsNZ : ‘షోలే2’ వచ్చేస్తుంది.. బాలీవుడ్ సీన్ రీక్రియేట్ చేసిన టీమిండియా కెప్టెన్!
- Finance
upi limit: UPI తో ఎంత డబ్బు పంపించవచ్చో తెలుసా ? అంతకు మించి పంపాలంటే..
- Lifestyle
ఈ ఆహారాలకు ఎక్స్ పైరీ డేట్ ఉండదని మీకు తెలుసా?
- Movies
Bigg Boss Telugu: బిగ్ బాస్ లోకి స్టార్ హీరోయిన్? అసలు విషయం బయటపెట్టిన అలనాటి తార!
- Automobiles
అప్డేటెడ్ హోండా యాక్టివా కొనేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన 5 విషయాలు
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
iPhone 14 సిరీస్ లాంచ్, ఊహించిన తేదీ కంటే ఆలస్యం కానుందా!
Apple కంపెనీ నుంచి తదుపరి తరం ఐఫోన్‌ల విడుదలకు సమయం దగ్గర పడుతోంది. సెప్టెంబర్ 6వ తేదీన రాబోయే iPhone 14 సిరీస్‌ను కంపెనీ ఆవిష్కరించవచ్చని మునుపటి నివేదికలు సూచించాయి.

కానీ, తాజా మీడియా వర్గాల నివేదికలను పరిశీలిస్తే.. iPhone 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు సెప్టెంబర్ నెల 7వ తేదీ బుధవారం విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు సూచించబడింది. ఇంకా అందుకు సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Apple ఐఫోన్ 14 లాంచ్ తేదీ ఎప్పుడు!
బ్లూమ్‌బెర్గ్‌లోని మార్క్ గుర్మాన్ వెల్లడించిన వివరాల ప్రకారం, Apple కంపెనీ సెప్టెంబర్ 7వ తేదీన iPhone 14 సిరీస్‌ను లాంచ్ చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 5వ తేదీ సోమవారం లేబర్ డే కాగా, మంగళవారం ట్రావెల్ డే ఉండటంతో, సెప్టెంబర్ 7 బుధవారం రోజును ఐఫోన్ కొత్త మోడల్స్ లాంచ్ కోసం ఎంపిక చేసుకున్నట్లు గుర్మాన్ తెలిపారు. ఈ లాంచ్ ఈవెంట్‌లో iPhone 14 సిరీస్‌తో పాటు, కొత్త ఆపిల్ Watch Series 8, Watch SE, మరియు Watch Pro లను కూడా కంపెనీ యూజర్ల ముందుకు తీసుకు రావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక iPhone 14 సిరీస్ సేల్ విషయానికొస్తే.. సెప్టెంబర్ 16వ తేదీ శుక్రవారం నుంచి విక్రయాలు చేసేందుకు కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేయవచ్చని గుర్మాన్ పేర్కొన్నారు. అంటే ఎప్పటిలాగే లాంచ్ తర్వాత పది రోజులకు సేల్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, Apple నుంచి ఎంట్రీ లెవల్ ఐప్యాడ్ మరియు ఐప్యాడ్ ప్రోతో పాటు కొత్త మ్యాక్‌లు అక్టోబర్ లేదా ఈ ఏడాది చివర్లో లాంచ్ అవుతాయని గుర్మాన్ తెలిపారు. వాటితో పాటు మాకోస్ వెంచురా మరియు ఐప్యాడ్ ఓఎస్ 16 కూడా అక్టోబర్‌లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. iOS 16 మరియు వాచ్‌ఓఎస్ 9 సెప్టెంబర్‌లో విడుదల కానున్నాయి.

రాబోయే సిరీస్‌లో ప్రత్యేకతలు!
గత సంవత్సరం మాదిరిగానే, Apple ఐఫోన్ 14 లైనప్‌లో నాలుగు కొత్త మోడళ్లను లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. మొట్టమొదటిసారిగా, కంపెనీ 6.7-అంగుళాల డిస్‌ప్లేతో నాన్-ప్రో-మాక్స్ iPhone 14 వేరియంట్‌ను విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే, ప్రో మోడల్‌లలో కొత్త కెమెరా డిజైన్ మరియు ఫేస్ ఐడి సెన్సార్ కటౌట్‌లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.
iPhone 14 నాన్-ప్రో మోడల్‌లలో iPhone 13 నుండి A15 బయోనిక్ చిప్‌ను ఉపయోగిస్తుందని తెలుస్తోంది. మరోవైపు, iPhone 14 ప్రో మరియు ప్రో మాక్స్ మోడల్‌లు సరికొత్త ఆపిల్ సిలికాన్ A16 బయోనిక్ SoCని అందిస్తున్నట్లు సమాచారం. అదనంగా, iPhone 14 ప్రో వేరియంట్‌లు కొత్త 48MP కెమెరా సెన్సార్‌తో రానున్నాయని లీకుల ద్వారా తెలుస్తోంది.

Apple iPhone 14 మోడల్స్ ఎన్ని:
Apple iPhone 14 ను సెప్టెంబర్‌లో విడుదల చేయనున్నట్లు కంపెనీ ఇదువరకే ప్రకటించిన విషయం తెలిసిందే. యాపిల్ నాలుగు మోడల్స్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. వీటిలో iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro మరియు iPhone 14 Pro Max ఉన్నాయి. ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మాక్స్ అన్ని తాజా అప్‌గ్రేడ్‌లతో కూడిన హై-ఎండ్ మోడల్‌లుగా చెప్పబడుతున్నాయి. మరోవైపు ఐఫోన్ 14 మరియు మాక్స్ మోడల్‌లు ముందు విడుదలైన ఐఫోన్ 13 సిరీస్‌కు సంబంధించిన కొన్ని లక్షణాలను కలిగి ఉంటాయని తెలుస్తోంది.

ధరలు ఎలా ఉండబోతున్నాయి!
ఇటీవలి ఊహాగానాల ప్రకారం, iPhone 14 ధర iPhone 13 మాదిరిగానే ఉంటుందని అంచనా వేయబడింది. కంపెనీ ఇప్పుడు iPhone 14ని భారతదేశంలో తయారు చేస్తున్నందున, ఐఫోన్ 13 లాంచ్ ధరతో పోల్చినప్పుడు.. iPhone 14 ను కొంచెం తక్కువ ధరకు లాంచ్ చేయవచ్చు అని అంతా భావిస్తున్నారు.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470