Just In
- 13 hrs ago
Infinix కొత్త స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది! లాంచ్ ఆఫర్ ధర చూడండి!
- 16 hrs ago
Apple iOS 16.3 కొత్త అప్డేట్ లాంచ్ చేసింది! కొత్త ఫీచర్లు తెలుసుకోండి!
- 18 hrs ago
వాట్సాప్ లో ఒరిజినల్ క్వాలిటీ తో ఫోటోలు పంపేందుకు కొత్త ఫీచర్! ఎలా పనిచేస్తుంది?
- 1 day ago
ఇండియా సొంత మొబైల్ OS, BharOS ను మీ ఫోన్లో అప్డేట్ చేయవచ్చా? తెలుసుకోండి.
Don't Miss
- Movies
Malikappuram Movie Review అయ్యప్పస్వామి ట్రావెలాగ్.. ఆకట్టుకొన్న దేవ నందా, ఉన్ని ముకుందన్
- News
హిందూపురంలో బాలకృష్ణ అవుట్- తారక్ ఇన్: జోరుగా మంతనాలు..!!
- Finance
BharOS: అండ్రాయిడ్, IOS లకు షాకిస్తున్న BharOS
- Lifestyle
ఈ అలవాట్లు సంబంధంలో ప్రేమను బలోపేతం చేస్తాయి
- Sports
KL Rahul పెళ్లి.. ఖరీదైన బహుమతులు ఇచ్చిన ధోనీ, కోహ్లీ!
- Automobiles
'బొలెరో నియో లిమిటెడ్ ఎడిషన్' లాంచ్ చేసిన మహీంద్రా.. ధర ఎంతో తెలుసా?
- Travel
భాగ్యనగరపు పర్యాటక ఆకర్షణ.. గోల్కొండ కోట!
Apple పాత మోడళ్లతో పోలిస్తే iPhone 14 ధర ఎక్కువగా ఉండనుందా!
యూఎస్‌కు చెందిన ప్రముఖ మొబైల్స్ తయారీ సంస్థ యాపిల్ నుంచి iPhone 14 సిరీస్ విడుదల కోసం చాలా మంది ఆతృతగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. Apple Watch Series 8తో పాటు iPhone 14 సిరీస్ కూడా ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో కంపెనీ నుంచి విడుదల అవుతుందని అంతా భావిస్తున్నారు. మీడియా వర్గాల లీకుల ప్రకారం, ఈ iPhone 14 సిరీస్ మొబైల్స్ పాత మొడల్ ఐఫోన్ల కంటే చాలా ఎక్కువ ధర ఉండే అవకాశం ఉంటుందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి.

గాడ్జెట్ టెండెన్సీ నుండి వచ్చిన నివేదిక ప్రకారం, ఆపిల్ iPhone 14 సిరీస్‌ను సెప్టెంబర్‌లో 90 మిలియన్ యూనిట్ల బ్యాచ్‌తో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. గత వారం, సరఫరా 10 శాతం తగ్గినట్లు నివేదికలు సూచించాయి. అయితే, ఎకనామిక్ డైలీలోని మరొక నివేదిక మాత్రం సరఫరా తగ్గింపు గురించి తమకు ఎటువంటి సమాచారం అందలేదని పేర్కొంది. ఆగస్టు చివరి నాటికి కంపెనీ భారీ ఉత్పత్తిని ప్రారంభిస్తుందని నివేదికలు పేర్కొన్నాయి. iPhone 14 సిరీస్ మొబైల్స్ యాపిల్ కంపెనీ నుంచి గతంలో విడుదలైన ఇతర ప్రో మోడళ్లతో పోలిస్తే ఎక్కువ ధర ఉండొచ్చని నివేదిక సూచించింది.
నివేదికలో ఉదహరించిన డేటా ప్రకారం, iPhone 14 Pro 128GB వేరియంట్ ప్రారంభ ధర $1,100 ఉండొచ్చని అంచనా. మరోవైపు, iPhone 14 Pro Max 128GB బేస్ వేరియంట్ ధర $1,200 ఉండొచ్చని నివేదిక అంచనాల ప్రకారం తెలుస్తోంది.

ఆపిల్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఐఫోన్ 14 సిరీస్‌ను విడుదల చేయనున్న విషయం తెలిసిందే. iPhone 14 సిరీస్ మొబైల్స్, యాపిల్ పాత మోడల్స్ తో పోలిస్తే ఇంకా మెరుగైన ఫీచర్లతో వస్తుందని అంతా భావిస్తున్నారు. Apple సంస్థ iPhone 14 సిరీస్‌తో iPhone 'Mini'ని నిలిపివేయాలని భావిస్తున్నట్లు సమాచారం. iPhone 14 మరియు iPhone 14 Max లు యాపిల్ A15 బయోనిక్ చిప్ తో మరింత శక్తివంతమైన వెర్షన్‌తో వస్తాయని పుకార్లు వస్తున్నాయి. అయితే iPhone 14 Pro మరియు iPhone 14 Pro Max లు Apple నుండి కొత్త గా విడుదలైన A16 బయోనిక్ చిప్ కలిగి ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. సెప్టెంబర్‌లో ఐఫోన్ 14 సిరీస్‌తో పాటు ఆపిల్ వాచ్ సిరీస్ 8ని కూడా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
iPhone14 డిస్‌ప్లే ప్రత్యేకతలు:
టెక్ విశ్లేషకుడు గుర్మాన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఐఫోన్ 14 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లోని డిస్‌ప్లే ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండడానికి వీలుగా కొత్త డిస్‌ప్లే ఫీచర్ ని కంపెనీ తీసుకొనిరానున్నట్లు తెలిపాడు. ఆపిల్ వాచ్ సిరీస్ 5 మరియు దాని అప్ గ్రేడ్ మోడల్‌లలో ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో అదే విధంగా పని చేస్తుంది. సరళంగా చెప్పాలంటే iPhone 14 సిరీస్‌లోని ప్రో మోడల్‌లు ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే మోడ్ (ఆల్వేస్ ఆన్ మోడ్) ప్రారంభించబడినప్పుడు స్క్రీన్ ఫ్రేమ్ రేట్‌ను తగ్గిస్తాయి. తద్వారా అవి తక్కువ బ్యాటరీని వినియోగించుకునేలా చేస్తాయి. ప్రస్తుత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లే పని చేసే విధానం కూడా ఇదే. ఐఫోన్ 14 సిరీస్‌లోని ప్రో మోడళ్లలో కంపెనీ A16 బయోనిక్ చిప్‌సెట్ ని కలిగి ఉండనున్నట్లు మునుపటి నివేదికలు సూచిస్తున్నాయి. A16 బయోనిక్ చిప్ కొత్త మరియు మెరుగైన CPU మరియు GPUతో పాటు LPDDR5 RAMకి మద్దతుతో కూడా వస్తుంది.

iPhone14 మ్యాక్స్ లీక్ స్పెసిఫికేషన్‌ల వివరాలు
iPhone14 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ కి సంబందించిన స్పెసిఫికేషన్స్ వివరాలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ లీక్ సమాచారం ప్రకారం ఆపిల్ సంస్థ నుంచి రాబోయే ఐఫోన్ 14 మ్యాక్స్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.68-అంగుళాల ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 2,778×1,284 పరిమాణంలో 458 పిక్సెల్‌ల(PPI) సాంద్రతను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుత జెనరేషన్ A15 బయోనిక్ SoCతో రన్ అవుతూ 6GB LPDDR4X RAMతో జతచేయబడి వస్తుంది. ప్రస్తుతం అదే చిప్ తో ఐఫోన్13 సిరీస్ ఫోన్లు మరియు కొత్త ఐఫోన్ SE (2022) కూడా శక్తిని పొందుతున్నాయి. గత లీక్‌ల ప్రకారం ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్14 ప్రో మాక్స్ ఫోన్లు రెండు కూడా A16 బయోనిక్ SoCలతో శక్తిని పొందే అవకాశం ఉంది.
-
54,999
-
36,599
-
39,999
-
38,990
-
1,29,900
-
79,990
-
38,900
-
18,999
-
19,300
-
69,999
-
79,900
-
1,09,999
-
1,19,900
-
21,999
-
1,29,900
-
12,999
-
44,999
-
15,999
-
7,332
-
17,091
-
29,999
-
7,999
-
8,999
-
45,835
-
77,935
-
48,030
-
29,616
-
57,999
-
12,670
-
79,470