ఐఫోన్ 14 సిరీస్ మోడల్‌ల ధరలు, స్పెసిఫికేషన్స్ ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి

|

ఆపిల్ ఐఫోన్ బ్రాండ్ నుంచి కొత్తగా రాబోతున్న ఐఫోన్14 సిరీస్ మోడల్ కి సంబంధించిన పుకార్లు చాలా వారాలుగా జరుగుతున్నాయి. ఐఫోన్ 14 సిరీస్ యొక్క లైనప్‌లో ఐఫోన్ 14, ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మ్యాక్స్ మరియు ఐఫోన్ 14 ప్రో మాక్స్ అనే నాలుగు మోడల్‌లు ఉంటాయని అందరూ భావిస్తున్నారు. అయితే ఈ కొత్త సిరీస్ అభివృద్ధిని ఆపిల్ సంస్థ ఇంకా ధృవీకరించలేదు. అయితే దాని కంటే ముందుగా ఐఫోన్ 14 మాక్స్ కొత్త వేరియంట్ యొక్క స్పెసిఫికేషన్‌లు మరియు ధరల వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ హ్యాండ్‌సెట్ 90Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే, A15 బయోనిక్ చిప్‌ మరియు 6GB RAM + 256GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌ ఫీచర్లను కలిగి ఉంది. ఐఫోన్ 14 మ్యాక్స్ హ్యాండ్‌సెట్ కు సంబందించిన మరిన్ని వివరాల గురించి తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 

ఐఫోన్ 14 మ్యాక్స్ లీక్ ధరల వివరాలు

ఐఫోన్ 14 మ్యాక్స్ లీక్ ధరల వివరాలు

Tipster Sam (@Shadow_Leak) ట్విట్టర్ పోస్ట్ ద్వారా ఐఫోన్ 14 మ్యాక్స్ ఫోన్ యొక్క ధరలు మరియు స్పెసిఫికేషన్‌ల వివరాలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ లీక్ ప్రకారం ఐఫోన్ 14 మ్యాక్స్ ఫోన్ యొక్క 6GB RAM +128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర $899 (దాదాపు రూ. 69,600) గా ఉంది. అయితే ఇతర వేరియంట్ ధరల వివరాలు ప్రస్తుతానికి తెలియరాలేదు.

ఐఫోన్ 14 మ్యాక్స్ లీక్ స్పెసిఫికేషన్‌ల వివరాలు
 

ఐఫోన్ 14 మ్యాక్స్ లీక్ స్పెసిఫికేషన్‌ల వివరాలు

ఐఫోన్ 14 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ కి సంబందించిన స్పెసిఫికేషన్స్ వివరాలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ లీక్ సమాచారం ప్రకారం ఆపిల్ సంస్థ నుంచి రాబోయే ఐఫోన్ 14 మ్యాక్స్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.68-అంగుళాల ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 2,778×1,284 పరిమాణంలో 458 పిక్సెల్‌ల(PPI) సాంద్రతను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుత జెనరేషన్ A15 బయోనిక్ SoCతో రన్ అవుతూ 6GB LPDDR4X RAMతో జతచేయబడి వస్తుంది. ప్రస్తుతం అదే చిప్ తో ఐఫోన్13 సిరీస్ ఫోన్లు మరియు కొత్త ఐఫోన్ SE (2022) కూడా శక్తిని పొందుతున్నాయి. గత లీక్‌ల ప్రకారం ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్14 ప్రో మాక్స్ ఫోన్లు రెండు కూడా A16 బయోనిక్ SoCలతో శక్తిని పొందే అవకాశం ఉంది.

ఆపిల్

ఆపిల్ సంస్థ నుంచి రాబోయే ఐఫోన్ 14 మ్యాక్స్ ఫోన్ లోని ఆప్టిక్స్ విషయానికి వస్తే ఇది 12-మెగాపిక్సెల్ సెన్సార్‌లతో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌తో ప్యాక్ చేయబడి వస్తుందని భావిస్తున్నారు. అలాగే ఈ హ్యాండ్‌సెట్ 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉండి నాచ్ ఫీచర్ మరియు ఫేస్ ID అన్ లాక్ తో వస్తుంది అని భావిస్తున్నారు.

Apple AR గ్లాసెస్‌ స్పెసిఫికేషన్స్ అంచనా

Apple AR గ్లాసెస్‌ స్పెసిఫికేషన్స్ అంచనా

ఆపిల్ సంస్థ తయారుచేసే AR గ్లాసెస్ వినూత్న హ్యాండ్ ట్రాకింగ్‌ను అందించడమే కాకుండా ఈ హెడ్‌సెట్ అత్యంత సున్నితమైన బహుళ 3D సెన్సింగ్ మాడ్యూల్స్‌తో వస్తుంది. Ming-chi Kuo ప్రకారం నిర్మాణాత్మక కాంతి సెన్సార్‌లు చేతుల్లోని వస్తువులను గుర్తించగలవు. అలాగే ఫేస్ ID అమోజీని రూపొందించడానికి ముఖ కవళికలను ఎలా గుర్తించగలదో పోల్చవచ్చు. ఆపిల్ సంస్థ నుంచి రాబోయే హెడ్‌సెట్ గేమింగ్, మీడియా వినియోగం మరియు కమ్యూనికేషన్‌పై అధికంగా దృష్టి పెడుతుంది.

Apple ట్యాప్-టు-పే ఫీచర్ ఎలా పనిచేస్తుంది

Apple ట్యాప్-టు-పే ఫీచర్ ఎలా పనిచేస్తుంది

ఆపిల్ సంస్థ కొత్తగా ప్రారంభించిన ట్యాప్-టు-పే ఫీచర్ పేమెంట్లను ప్రారంభించడానికి NFC టెక్నాలజీను ఉపయోగిస్తుంది. ఐఫోన్‌లలో ట్యాప్-టు-పే ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత వ్యాపారులు తమ వినియోగదారులకు సపోర్టింగ్ ఐఓఎస్ యాప్ ద్వారా కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్ ను అందించగలరని కంపెనీ తెలిపింది. చెక్అవుట్ సమయంలో వ్యాపారి ఆపిల్ పే, కాంటాక్ట్‌లెస్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ లేదా వ్యాపారి iPhoneకి సమీపంలో ఉన్న ఇతర డిజిటల్ వాలెట్‌తో చెల్లించడానికి వారి ఐఫోన్ లేదా ఆపిల్ వాచ్ ని ఉపయోగించమని కస్టమర్‌ను ప్రాంప్ట్ చేస్తారు. ఆ తర్వాత పేమెంట్ సురక్షితంగా పూర్తవుతుంది.

Best Mobiles in India

English summary
Apple iPhone 14 Series Models Price and Specifications Details Leaked

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X