Apple iPhone 14 సిరీస్‌ మోడల్‌ ఫోన్‌లలో డిస్‌ప్లేలో సరికొత్త ఫీచర్స్...

|

US ఆధారిత స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ ఆపిల్ నుంచి వచ్చే ఐఫోన్‌లు ప్రపంచం మీద గొప్ప ఆదరణను అందుకున్నాయి. ఆపిల్ సంస్థ యొక్క తదుపరి ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ 14 సిరీస్ ఫోన్‌ల యొక్క ఫీచర్ల వివరాలకు సంబంధించిన వివరాలు చాలా కాలంగా ఆన్‌లైన్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ లీక్ ల ప్రకారం కొత్త ఐఫోన్ 14 సిరీస్‌ ఫోన్‌లలోని డిస్‌ప్లే ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే విధంగా కొత్త ఫీచర్‌ను మనం చూడవచ్చని సూచిస్తుంది. కంపెనీ తన ఖరీదైన ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మాక్స్ మోడళ్లలో ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లే మోడ్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. అదే విషయాన్ని బ్లూమ్‌బెర్గ్ యొక్క మార్క్ గుర్మాన్ కూడా లీక్ చేయడం జరిగింది. అతను ఆపిల్ తన iOS 16 అప్ డేట్లతో ఈ ఫీచర్‌ను రోల్ చేయవచ్చని సూచించాడు. దీనికి సంబందించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఎలా పని చేస్తుంది?

ఆల్వేస్ ఆన్ డిస్‌ప్లే ఎలా పని చేస్తుంది?

గుర్మాన్ తెలిపిన వివరాల ప్రకారం ఐఫోన్ 14 సిరీస్‌ స్మార్ట్‌ఫోన్‌లోని డిస్‌ప్లే ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండడానికి వీలుగా కొత్త డిస్‌ప్లే ఫీచర్ ని కంపెనీ తీసుకొనిరానున్నట్లు తెలిపింది. ఆపిల్ వాచ్ సిరీస్ 5 మరియు దాని అప్ గ్రేడ్ మోడల్‌లలో ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో అదే విధంగా పని చేస్తుంది. సరళంగా చెప్పాలంటే iPhone 14 సిరీస్‌లోని ప్రో మోడల్‌లు ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే మోడ్ ప్రారంభించబడినప్పుడు స్క్రీన్ ఫ్రేమ్ రేట్‌ను తగ్గిస్తాయి. తద్వారా అవి తక్కువ బ్యాటరీని వినియోగించుకునేలా చేస్తాయి. ప్రస్తుత ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లే పని చేసే విధానం కూడా ఇదే.

WhatsApp లో కొత్త రకం స్కామ్! ఈ నంబర్లు డయల్ చేసారంటే మీ అకౌంట్ హ్యాక్ అవుతుంది. జాగ్రత్త.WhatsApp లో కొత్త రకం స్కామ్! ఈ నంబర్లు డయల్ చేసారంటే మీ అకౌంట్ హ్యాక్ అవుతుంది. జాగ్రత్త.

iOS 16 అప్‌డేట్‌
 

ఎల్లప్పుడూ ఆన్‌లో ఉండే డిస్‌ప్లే కొత్త ఫీచర్ iOS 16 అప్‌డేట్‌తో వస్తుందని మార్క్ గుర్మాన్ తెలియజేసారు. ఈ కొత్త ఫీచర్ కి సంబందించిన సమాచారాన్ని కంపెనీ యొక్క రాబోయే WWDC ఈవెంట్ లో ప్రకటించాలని భావిస్తున్నారు. ఐఫోన్ 14 సిరీస్‌లోని ప్రో మోడళ్లలో కంపెనీ A16 బయోనిక్ చిప్‌సెట్ ని కలిగి ఉండనున్నట్లు మునుపటి నివేదికలు సూచిస్తున్నాయి. దీనికి అనుగుణంగా ఆపిల్ సంస్థ మరిన్ని ప్రత్యేకమైన ఫీచర్లతో ప్రో మోడళ్లను ప్రారంభించగలదని కూడా అతను పేర్కొన్నాడు.

ఐఫోన్ 14 సిరీస్‌

ఐఫోన్ సిరీస్‌లోని ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్ 14 ప్రో మాక్స్ రెండు మోడల్‌లు కూడా A16 బయోనిక్ చిప్‌ల ద్వారా శక్తిని పొందబోతున్నాయని గత వారం విడుదలైన లీక్ లు సూచిస్తున్నాయి. అయితే ఇందులో వనిల్లా మోడల్ ఐఫోన్ మరియు ఐఫోన్ 14 మాక్స్ A15 బయోనిక్ ప్రాసెసర్ల మెరుగైన వెర్షన్‌తో శక్తిని పొందబోతున్నట్లు సమాచారం. కొత్త A16 బయోనిక్ చిప్ కొత్త మరియు మెరుగైన CPU మరియు GPUతో పాటు LPDDR5 RAMకి మద్దతుతో కూడా వస్తుంది. ఐఫోన్ 14 ప్రో పర్పుల్, సిల్వర్, గ్రాఫైట్ మరియు గోల్డ్ వంటి కలర్ ఎంపికలలో వస్తున్నట్లు కొన్ని లీక్ లు చూసిస్తున్నాయి. iPhone 14 సిరీస్‌లో iPhone 14, iPhone 14 Max, iPhone 14 Pro మరియు iPhone 14 Pro Max అనే నాలుగు స్మార్ట్‌ఫోన్‌లు రానున్నాయి.

Best Mobiles in India

English summary
Apple iPhone 14 Series New Smartphones Comes With Always On Display New Features

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X