Home
News

iPhone 15 స్మార్ట్‌ఫోన్‌లో భారీ మార్పులు.. 48MP కెమెరా, డిజైన్‌ సహా మరిన్ని..!

ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ సంస్థ ఆపిల్‌ ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో ఐఫోన్‌ 15 సీరిస్‌ ఫోన్లను విడుదల చేయనుంది. ఈ సీరిస్‌లో మొత్తం నాలుగు ఫోన్లు లాంచ్‌ కానున్నాయి. ఈ జాబితాలో ఐఫోన్‌ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌, ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మాక్స్‌ ఉన్నాయి.

కొన్ని నివేదికల ప్రకారం ఐఫోన్ 15, ఐఫోన్‌ 15 ప్లస్‌ వేరియంట్లు వాటి ముందు వెర్షన్ల కంటే ప్రధానంగా మూడు విభాగాల్లో అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంటాయని సమాచారం. ఐఫోన్‌ 15 స్డాండర్డ్‌ మోడల్‌ డైనమిక్‌ ఐలాండ్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. పంచ్‌ హోల్‌ డిస్‌ప్లే డిజైన్‌తో రానుందని సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు.

iPhone 15

కానీ ఐఫోన్‌ 14 ప్రో మోడళ్లకు ఈ తరహా డిజైన్‌ను కలిగి ఉంది. త్వరలో లాంచ్‌ కానున్న ఐఫోన్‌ 15 ఈ డిజైన్‌ను కలిగి ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఫలితంగా పాత ఫోన్లతో ఈ కొత్త సీరిస్‌ స్మార్ట్‌ఫోన్లకు వేరుచేసేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు సమాచారం.

అయితే ఆపిల్‌ గత కొన్ని సంవత్సరాలుగా ఒకే తరహా డిజైన్‌తో ఫోన్లను లాంచ్‌ చేస్తోందనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో కొత్త డిజైన్‌తో లాంచ్‌ కానున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్‌ 15 మరియు ఐఫోన్‌ 15 ప్లస్‌ మోడళ్లు.. ఐఫోన్‌ 14 ప్రో మోడల్‌లో ఉన్నట్లుగా మ్యాటీ ఫినిష్‌తో పాటు ఫ్రాస్టెడ్‌ గ్లాస్‌ బ్యాక్‌ను కలిగి ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

కెమెరా విభాగంలోనూ ప్రధాన మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. ఐఫోన్‌ 14 ప్రో మోడళ్లలో ఉన్నట్లుగా.... ఐఫోన్‌ 15 సీరిస్‌ ఫోన్లు కూడా 48MP వెనుక కెమెరాను కలిగి ఉంటుందని సమాచారం. ప్రస్తుతం చాలా ఐఫోన్లలో 12MP సెన్సార్లు మాత్రమే కలిగి ఉన్న నేపథ్యంలో.. త్వరలో రానున్న ఐఫోన్లలో కెమెరాలు భారీ అప్‌గ్రేడ్‌ చేసినట్లు అవుతుంది.

స్డాండర్డ్‌ మోడళ్లు ఆప్టికల్‌ జూమ్‌ లేదా LiDAR సెన్సార్లు కలిగి ఉండే అవకాశం లేదని సమాచారం. కేవలం ఎక్లూజివ్‌ హైఎండ్‌ మోడళ్లు మాత్రమే ఈ ఫీచర్‌తో లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 15 ప్రో మాక్స్‌ స్మార్ట్‌ఫోన్‌ మోడల్‌కు మరింత ముఖ్యమైన కెమెరా మాడ్యూల్‌ కలిగి ఉండే అవకాశం ఉంది. ఇతర సెన్సార్లతో కలిపి 5-6x ఆప్టికల్‌ జూమ్‌తో వచ్చే పెరీస్కోప్‌ లెన్స్‌తో రానున్నట్లు తెలుస్తోంది.

ఈ ఏడాదిలో విడుదల అయ్యే ఫోన్లులో.. ముందుగానే ఉహించిన విధంగానే ముఖ్యమైన మార్పులు చోటుచేసుకొనే అవకాశం ఉంది. ఆపిల్‌ లైటినింగ్‌ పోర్టుగా బదులుగా USB టైప్‌-Cలతో లాంచ్‌ కానున్నట్లు సమాచారం. ఈ ఫీచర్లపై స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

గిజ్‌బాట్‌ తెలుగు వెబ్‌సైట్ గ్యాడ్జెట్లు సహా ఇతర టెక్‌ న్యూస్‌కు సంబంధించిన ఆసక్తికరమైన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా వార్తల కోసం సోషల్‌మీడియా ఖాతాలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు.

Best Mobiles in India

English summary
Apple iPhone 15 models could have new features like 48MP camera and dynamic island design
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X