iPhone 15 సీరిస్ స్మార్ట్‌ఫోన్లలో భారీ మార్పులు.. మరింత మందిని ఆకట్టుకొనేలా.!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఆపిల్ ఐఫోన్లు ఇక నుంచి భారీ బ్యాటరీ సామర్థ్యంతో రానున్నట్లు తెలుస్తోంది. ఐఫోన్ 15 సీరిస్ ఫోన్లు ముందు తరం ఫోన్ల కంటే సుమారు 18 శాతం బ్యాటరీ సామర్థ్యంతో రానున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన మోడల్ సంఖ్య కూడా నమోదు అయిందని తెలుస్తోంది.
బ్యాటరీ వివరాలు సహా ఐఫోన్ 15 సీరిస్ స్మార్ట్‌ఫోన్ల స్సెసిఫికేషన్లు, ఫీచర్లు కొన్ని లీక్ అయ్యాయి. ఐఫోన్ 14 ఫోన్ 3,279mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండగా... ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్ 3,877mAh బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఐఫోన్ 15 ప్లస్ ఫోన్ 4,912mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. ఐఫోన్ 14 ప్లస్‌తో బ్యాటరీతో (4,325mAH) పోలిస్తే గణనీయమైన పెరుగుదల కనిపించింది.

ఐఫోన్ 14 ప్రో ఫోన్ 3,200mAh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండగా.. ఐఫోన్ 15 ప్రో మాత్రం 3,650mAh బ్యాటరీని కలిగి ఉంటుందని సమాచారం. అలాగే ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ 4,323mAh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. అదే ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మాత్రం 4,852mAh బ్యాటరీతో రానుందని తెలుస్తోంది.
గత తరం ఫోన్లతో పోలిస్తే ఐఫోన్ 15 ప్లస్ మరియు ఐఫోన్ 15 ప్రో స్మార్ట్‌ఫోన్ల బ్యాటరీ సామర్థ్యం 14 శాతం పెరిగింది. అదే ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మాత్రం 12 శాతం బ్యాటరీ యూనిట్ పెరుగుదల కనిపించింది. స్టాండర్డ్ మోడల్ ఫోన్లలో 18శాతం పెరుగుదల కనిపించింది. ఇప్పటి వరకు ఉన్న ఆపిల్ ఫోన్లలో ఇది అతిపెద్ద పెరుగుదలగా కనిపిస్తోంది.
ఆపిల్ ఫోన్లలో రానున్న ఈ మార్పులు మరింత మంది ఐఫోన్‌ల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. ఐఫోన్ 15 స్మార్ట్‌ఫోన్లు ఆపిల్ బయోనిక్ A16 చిప్‌సెట్‌తో రానున్నట్లు తెలుస్తోంది. స్టాండర్డ్ ఐఫోన్ 15 మరియు ఐఫోన్ 15 ప్లస్ స్మార్ట్‌ఫోన్ల డిజైన్లో మార్పులు వచ్చే అవకాశం లేదు. అయితే ప్రో వేరియంట్లలో మాత్రం కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది.
కెమెరా సహా కొన్ని విభాగాల్లో కొన్ని మార్పులు ఉహించవచ్చు. అయితే స్టాండర్డ్ మోడల్ ఐఫోన్లలో టెలీఫోటో లెన్స్ లేదా LiDAR లను ఆశించలేము. ఈ లెన్స్ కేవలం హై ఎండ్ వేరియంట్లలోనే అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.ఐఫోన్ 14 వేరియంట్లలో ఉన్నట్లుగానే ఐఫోన్ 15 ఫోన్లు కూడా 48MP కెమెరాను కలిగి ఉంటుందని తెలుస్తోంది.
మరియు ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ మోడల్ మాత్రం అత్యుత్తమ కెమెరా మాడ్యుల్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది. మిగిలిన సెన్సార్లతో కలిపి 5-6x ఆప్టికల్ జూమ్‌తో వచ్చే పెరిస్కోప్ లెన్స్‌ను కలిగి ఉంటుందని తెలుస్తోంది. మరియు ఆపిల్ లైటినింగ్ పోర్ట్‌కు బదులుగా USB టైప్- C పోర్టులో విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
ఐఫోన్ 15 సీరిస్ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లపై ఆపిల్ సంస్థ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ఫోన్ల విడుదల సమయంలో మాత్రమే కచ్చితమైన సమాచారం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ ఫోన్లు ఈ సంవత్సరంలోనే విడుదల అయ్యే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








