ఇవాళ్టి నుంచే ఆపిల్ ఐఫోన్ 17e, బడ్జెట్ మ్యాక్‌బుక్ సహా కొత్త ల్యాప్‌టాప్‌ల సేల్..!
ఆపిల్ నుంచి ఇటీవల అనేక ఉత్పత్తులు లాంచ్ అయ్యాయి. ఇందులో ఐఫోన్ 17e, బడ్జెట్ ల్యాప్‌టాప్ మ్యాక్‌బుక్ నియో, మ్యాక్‌బుక్ ఎయిర్ M5, మ్యాక్‌బుక్ ప్రో M5 ప్రో, మ్యాక్‌బుక్ ప్రో M5 మ్యాక్స్, ఐప్యా్డ్ ఎయిర్ M5 ఉన్నాయి. ఇవాళ్టి నుంచే ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. భారత్‌లోని ఆపిల్ స్టోర్‌లతోపాటు ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లతో కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 17e మోడల్ (Apple iPhone 17e Sale) 256GB స్టోరేజీ ధర రూ.64,900, 512GB స్టోరేజీ ధర రూ.84900 గా ఉంది. 60Hz రీఫ్రెష్ రేట్‌తో 6.1 అంగుళాల సూపర్ రెటీనా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. 800 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉంది. సిరామిక్ షీల్డ్ 2 ప్రొటెక్షన్‌ను పొందుతోంది.

కొత్త ఐఫోన్ A19 చిప్, iOS 26 పైన పనిచేస్తుంది. C1x సెల్యూలర్ మోడెమ్ కూడా ఉంది. ఈ ఐఫోన్ యాక్షన్ బటన్‌ను కలిగి ఉంది. అనేక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లను సపోర్టు చేస్తుంది. శాటిలైట్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. ఫలితంగా అత్యవసర సమయాల్లో మెసేజింగ్ కోసం ఉపయోగపడుతుంది.
కెమెరా విభాగం పరంగా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), ఆప్టికల్ క్వాలిటీ 2x జూమ్‌తో 48MP కెమెరా ఉంది. 4k వీడియో రికార్డింగ్‌ను సపోర్టు చేస్తుంది. సెల్ఫీ, వీడియో కాల్స్ కోసం 12MP కెమెరాతో అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ బ్యాటరీ వివరాలను ఆపిల్ అధికారికంగా విడుదల చేయలేదు.
అయితే ఐఫోన్ 17e మోడల్ MagSafe ఛార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. 20W వైర్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌ను సపోర్టు చేస్తుంది. సింగిల్ ఛార్జింగ్‌తో 26 గంటల ప్లేబ్యాక్ టైమ్‌ను అందిస్తుందని ఆపిల్ చెబుతోంది. ఈ ఐఫోన్ వైట్, సాఫ్ట్ పింక్, బ్లాక్ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.
ఐప్యాడ్ ఎయిర్ M4 :
ఐప్యాడ్ ఎయిర్ 2026 మోడల్ (iPad Air M4) 11 అంగుళాలు, 13 అంగుళాల వేరియంట్స్‌లో లిక్విడ్ రెటీనా IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. M4 చిప్, iPadOS 26 పైన పనిచేస్తుంది. ఆపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు ఉన్నాయి. ఇమేజ్ స్టెబిలైజేషన్, 5x డిజిటల్ జూమ్, ఆటోఫోకస్‌తో 12MP కెమెరా, 12MP సెల్ఫీ కెమెరా ఉంది.
ఈ ఐప్యాడ్ 36.59Wh బ్యాటరీని కలిగి ఉంది. వైఫై, సెల్యూలర్ మోడల్స్‌లో అందుబాటులో ఉంది. ఐప్యా్డ్ ఎయిర్ M4 (Wi-Fi) ప్రారంభ ధర రూ.64900 గా ఉంది. అదే Wi-Fi + సెల్యూలర్ ప్రారంభ ధర రూ.79900 గా ఉంది.
మ్యాక్‌బుక్ ఎయిర్ M5 :
మ్యాక్‌బుక్ ఎయిర్ 2026 మోడల్ (Macbook Air M5) 13.6 అంగుళాలు, 15.3 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. M5 చిప్, macOS Tahoe తో పనిచేస్తుంది. సింగిల్ ఛార్జింగ్‌తో 18 గంటల వరకు బ్యాటరీ లైఫ్‌ను ఇస్తుందని ఆపిల్ చెబుతోంది. MagSafe సపోర్టు ఉంది. 12MP కెమెరా ఉంది.
మ్యాక్‌బుక్ ఎయిర్ M5 మోడల్ 13 అంగుళాల వేరియంట్ ప్రారంభ ధర రూ.119900 గా ఉంది. అదే 15 అంగుళాల వేరియంట్ ప్రారంభ ధర రూ.1,44,900 గా ఉంది.
మ్యాక్‌బుక్ ప్రో 2026 :
ఈ మ్యాక్‌బుక్ ప్రో మోడల్స్ (Macbook Pro 2026) 14 అంగుళాలు, 16 అంగుళాల లిక్విడ్ రెటీనా XDR డిస్‌ప్లే వేరియంట్స్‌లో లాంచ్ అయ్యాయి. ఈ మోడల్స్ M5 ప్రో, M5 మ్యాక్స్ చిప్‌లను కలిగి ఉన్నాయి. పనిచేస్తాయి. MacOS Tahoe పైన పనిచేస్తాయి. 12MP కెమెరా, సింగిల్ ఛార్జింగ్‌తో 24 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుందని ఆపిల్ చెబుతోంది.
మ్యాక్‌బుక్ ప్రో M5 ప్రో ప్రారంభ ధర రూ.2,49,900 గా ఉంది. అదే మ్యాక్‌బుక్ ప్రో M5 మ్యాక్స్ మోడల్ ప్రారంభ ధర రూ.3,99,900 గా ఉంది. దీంతోపాటు బడ్జెట్ ఆపిల్ ల్యాప్‌టాప్ సేల్ కూడా ప్రారంభం అయింది.
బడ్జెట్ మ్యాక్‌బుక్ :
ఆపిల్ బడ్జెట్ ల్యాప్‌టాప్ మ్యాక్‌బుక్ నియో (Macbook Neo) 13 అంగుళాల లిక్విడ్ రెటీనా IPS డిస్‌ప్లేను కలిగి ఉంది. వీడియో కాల్స్ కోసం 1080p పేస్‌టైమ్ HD వెబ్‌క్యామ్ ఉంది. A18 ప్రో చిప్, macOS Tahoe పైన పనిచేస్తుంది. 20W ఛార్జింగ్ సపోర్టుతో 36.5Wh బ్యాటరీని కలిగి ఉంది.
బడ్జెట్ ల్యాప్‌టాప్ 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.69,900, 8GB ర్యామ్ + 512GB స్టోరేజీ ధర రూ.79,900 గా ఉంది. విద్యార్థులకు రూ.10000 డిస్కౌంట్‌ను అందిస్తామని ఆపిల్ తెలిపింది.


Click it and Unblock the Notifications








