ఇండియాలో ఎయిర్‌సెల్‌ ద్వారా ఐఫోన్‌4 విక్రయాలు రేపటి నుండి ప్రారంభం

Posted By: Staff

ఇండియాలో ఎయిర్‌సెల్‌ ద్వారా ఐఫోన్‌4 విక్రయాలు రేపటి నుండి ప్రారంభం

న్యూఢిల్లీ: భారత్‌లో యాపిల్‌ ఐఫోన్‌4 విక్రయాలను ఈ నెల 27 నుంచి ప్రారంభించనున్నట్లు ఎయిర్‌సెల్‌ బుధవారమిక్కడ ఒక ప్రకటనలో పేర్కొంది. 'దేశవ్యాప్తంగా 13 సర్కిళ్లలో 3జీ సేవలను ప్రారంభించిన నేపథ్యంలో ఐఫోన్‌4 విడుదల మా వినియోగదార్లకు అసలైన 3జీ అనుభవాన్ని కలిగిస్తుంద'ని ఎయిర్‌సెల్‌డైరెక్టర్‌ సందీప్‌ దాస్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 16 జీబీ మోడల్‌ రూ.34,500; 32 జీబీ మోడల్‌ రూ.40,900 ధరల వద్ద లభిస్తాయని ఎయిర్‌సెల్‌ తెలిపింది. అయితే 24 నెలల్లోగా నెలవారీ క్రెడిట్స్‌ జమ ద్వారా వినియోగదార్లు ఐఫోన్‌కు పెట్టిన 100 శాతం ధరను తిరిగిపొందినట్లవుతుందని కంపెనీ పేర్కొంది. భారతీ ఎయిర్‌టెల్‌ కూడా త్వరలోనే ఈ ఫోన్‌ విక్రయాలను చేపట్టనున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నప్పటికీ కంపెనీ ప్రతినిధులు ఈ విషయంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot