బ్రేకింగ్ న్యూస్.. నవంబర్ 2 నుంచి ఐఫోన్5 అమ్మకాలు!

టెక్ దిగ్గజం ఆపిల్ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన కొత్త జనరేషన్ స్మార్ట్‌ఫోన్ డివైజ్ ‘ఐఫోన్ 5’నవంబర్ 2(శుక్రవారం) నుంచి భారత రిటైల్ ఇంకా మోడ్రన్ మార్కెట్‌లలో అధికారికంగా లభ్యం కానుంది. ఈ వివరాలను ఆపిల్ ఐఫోన్ పంపిణీ భాగస్వామి అయిన ఐన్‌గ్రామ్ మైక్రో శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. అయితే, ధరకు సంబంధించి ఖచ్చితమైన సమాచారం వెల్లడికాలేదు. ధర రూ.45,000కు పై చిలుకుగా ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరో వైపు ఆపిల్ నేటి నుంచి తన అప్లికేషన్ స్టోర్‌లోని అప్లికేషన్‌ల ధరలను ఇండియన్ కరెన్సీ ప్రకారం ప్రచురించటం ప్రారంభించింది. ఐఫోన్5 విడుదల నేపధ్యంలో ఐఫోన్ 4ఎస్ (రూ.38,500), ఐఫోన్4 (రూ.26,500) ధరలను ఆపిల్ ఇండియా తగ్గించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఎయిర్‌టెల్, ఎయిర్‌సెల్, వొడాఫోన్ తదితర ప్రముఖ నెట్‌వర్క్ ఆపరేటర్లు ఐఫోన్5కు సరితూగే నానా సిమ్‌లను ఇప్పటికే సిద్ధంగా ఉంచారు.
ఆపిల్ ఐఫోన్ 5 ఫీచర్లు:
4 అంగుళాల స్ర్కీన్, సరికొత్త ఐవోఎస్6 ఆపరేటింగ్ సిస్టం, శక్తివంతమైన ఏ6 చిప్, 1జీబి ర్యామ్,8 మెగా పిక్సల్ రేర్ కెమెరా (1080 పిక్సల్ హైడెఫినిషన్ వీడియో స్టెబిలైజేషన్), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ వీజీఏ కెమెరా, 4జీ ఎల్‌టీఈ వైర్‌లెస్ నెట్‍వర్క్, నెట్‌వర్క్ సపోర్ట్ (జీఎస్ఎమ్ 850 / 900 / 1800 / 1900), (సీడీఎమ్ఏ 800 / 1900- Verizon), (3జీ నెట్‌వర్క్ – హెచ్‌ఎస్‌డిపిఏ 850 / 900 / 1900 / 2100), బ్యాటరీ బ్యాకప్ (8 గంటలు 3జీ టాక్‌టైమ్, 10 గంటలు వై-ఫై బ్రౌజింగ్ ఇంకా వీడియో వీక్షణ సమయం, 40 గంటల పాటు మ్యూజిక్ వినొచ్చు, 225 గంటల స్టాండ్‌బై సదుపాయం).
ఇతర ఫీచర్లు:
నానో సిమ్‌కార్డ్ సపోర్ట్,
యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్,
సిరీ లాంగ్వేజ్ కమాండ్స్,
ఐక్లౌడ్ క్లౌడ్ సర్వీస్,
ట్విట్టర్ ఇంకా ఫేస్‌బుక్ అనుసంధానం,
టీవీ అవుట్,
ఐమ్యాప్స్,
ఐబుక్స్ పీడీఎఫ్ రీడర్,
ఆడియో ప్లేయర్, వీడియో ప్లేయర్,
ఇమేజ్ ఎడిటర్,
వాయిస్ మెమో.
స్మార్ట్‌ఫోన్స్ ఇంకా ఫీచర్ మొబైల్స్ కొనుగోలు విషయంలో ఉత్తమ ధర ఇంకా ఉత్తమ డీల్స్ కోసం goprobo.comలో చూడగలరు. లింక్ అడ్రస్:


Click it and Unblock the Notifications








