హిట్ కొట్టాలన్న ధృడ సంకల్పంతో?

Posted By: Prashanth

హిట్ కొట్టాలన్న ధృడ సంకల్పంతో?

 

దిగ్గజ బ్రాండ్ ఆపిల్ నుంచి త్వరలో విడుదల కాబోతున్న ఐఫోన్5 మార్కెట్ అంచనాలను ఆమాంతం పెంచేసింది. ఈ ఫోన్ డిజైనింగ్ అదేవిధంగా ఆవిష్కరణకు సంబంధించి రకరకాల పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. ఈ హై ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను సెప్టంబర్‌లో ఆవిష్కరించే అవకాశముందని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అదేవిధంగా హ్యాండ్‌సెట్ డిస్‌ప్లే పరిమాణం 4 అంగుళాలు ఉండొచ్చని తెలుస్తోంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఈ పెద్ద స్ర్కీన్‌ల తయారీ ప్రక్రియ బాధ్యతలను జపాన్, కొరియా దేశాలకు చెందిన మూడు సంస్థలకు అప్పగించినట్లు తెలిసింది. స్ర్కీన్‌లను ఉత్పత్తి చేసే సంస్థల్లో జపాన్ డిస్‌ప్లే ఇంక్, షార్ప్ కార్పొరేషన్, కొరియా ఎల్‌జీ డిస్‌ప్లేలు ఉన్నాయి. వీటి ఉత్పత్తి జూన్ నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. సామ్‌సంగ్‌కు గట్టిపోటీనివ్వాలన్న ధృడ సంకల్పంతో ఐఫోన్ 5 ప్రాజెక్టును ఆపిల్ ప్రతిష్టాత్మంగా తీసుకుందని పలువురు విశ్లేషిస్తున్నారు. సామ్‌సంగ్ గెలాక్సీ సిరీస్ నుంచి ఇటీవల ఆవిష్కరించబడిన

‘గెలాక్సీ ఎస్ 3’ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ప్రభంజనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే.

శామ్‌సంగ్ అపూర్వ సృష్టి!!

దిగ్గజ బ్రాండ్ శామ్‌సంగ్ ఫ్లెక్సిబుల్ ఆమోల్డ్ డిస్‌ప్లేలను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ షో వేదికగా ప్రదర్శించబడిన వీటిని ఈ ఏడాది క్వార్టర్ -2 నుంచి ఉత్పత్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫ్లెక్సిబుల్ ఆమోల్డ్ డిస్‌ప్లేలుగా పిలవబడుతున్న వీటిని YOUM అనే బ్రాండ్ నేమ్‌తో శామ్‌సంగ్ ట్రేడ్‌మార్క్ చేసింది. ఇవే కాకుండా TAMOLED, PAMOLED, FAMOLED, WAMOLED అనే ట్రేడ్‌మార్క్ పేర్లను కంపెనీ ఫైల్ చేసింది. శామ్‌సంగ్ రూపొందిస్తున్న ఆమోల్డ్ డిస్‌ప్లే స్ర్కీన్‌లలో గ్లాస్ ఉండదు. దానికి బదులుగా టీఎఫ్టీ ఫిల్మ్, ఎన్‌క్యాప్ ఫిల్మ్, ఆర్గానిక్ లేయర్, పోలరైసర్ పదార్థాలను ఉపయోగిస్తారు. YOUM డిస్‌ప్లేలు పల్చటి, తేలికపాటి ఇంకా అన్బ్రేకబుల్ తత్వాన్ని కలిగి ఉంటాయి. రాబోతున్న శామ్‌సంగ్ గ్యాడ్జెట్‌లలో ఈ డిస్‌ప్లేలను మనం చూడొచ్చు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot