రూ. 12వేలకు ఐఫోన్ 5ఎస్: ఐఫోన్ కోసం పసికందును..

Written By:

ఆపిల్ అంటే ఎంత క్రేజో చాలామందికి అందరికీ తెలిసిందే. ఆపిల్ నుంచే వచ్చే ప్రతిఫోన్ కూడా మార్కెట్లో సంచలనాలు సృష్టిస్తూ అమ్మకాల్లో దూసుకుపోతూ ఉంటుంది. ఆపిల్ నుంచి ఇప్పటివరకు వచ్చిన ఐ ఫోన్ సీరిస్‌లన్నీ అమ్మకాల్లో పెద్ద తుఫాన్నే రేపాయి. అయితే ఇప్పుడు అదే వరుసలో ఐఫోన్ 5ఎస్ రూ. 30 వేల నుంచి రూ. 12 వేలకు దిగిరానుంది. ఇంకా షాకింగ్ ఏంటంటే ఐ ఫోన్ కోసం కన్న కూతుర్నే అమ్మేసాడు ఓ ప్రబుధ్దుడు. సంచలనం రేపుతున్న కథనం చూడండి.

Read more: ఇండియాలో అతిపెద్ద మొబైల్ నెట్‌వర్క్‌లు ఇవే !

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఐ ఫోన్ ధర ఎక్కువ ఉందని కొనలేని వారికి

ఐ ఫోన్ ధర ఎక్కువ ఉందని కొనలేని వారికి శుభవార్త. యాపిల్ కొత్తగా విడుదల చేయనున్న ఐఫోన్ ఎస్ఈ మార్కెట్‌లోకి రాగానే ఐఫోన్ 5ఎస్ రేట్లు సగానికి తగ్గనున్నాయట.

అమెరికాలో 450 డాలర్లుగా ఉన్న ఐఫోన్ 5ఎస్ ధర 225 డాలర్లకు

ఐఫోన్ ఎస్ఈ మార్కెట్‌లోకి వచ్చిన అనంతరం ఇప్పుడు అమెరికాలో 450 డాలర్లుగా ఉన్న ఐఫోన్ 5ఎస్ ధర 225 డాలర్లకు తగ్గనుందని కేజీఐ సెక్యురిటీస్‌కు చెందిన ప్రముఖ మార్కెట్ ఎనలిస్ట్ మింగ్ చీ క్యో తెలిపారు.

భారత్‌లో అమ్మకాల వృద్ధికోసం యాపిల్ సంస్థ

భారత్‌లో అమ్మకాల వృద్ధికోసం యాపిల్ సంస్థ ఇప్పటికే ఐఫోన్ 5ఎస్ ధరను తగ్గిస్తూ వచ్చింది. ఈ క్రమంలో ఐఫోన్ ఎస్ఈ మోడల్ రాకతో ఇండియాలో ఐఫోన్ 5ఎస్ ధర మరింత తగ్గనుంది.

ఇండియాలో రూ. 12 వేల నుండి 13000 వేలకు

అంతా అనుకున్నట్లుగా జరిగితే రానున్న కొద్ది మాసాల్లో ఐఫోన్ 5ఎస్ ఇండియాలో రూ. 12 వేల నుండి 13000 వేలకు లబిస్తుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు

ఇతర ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లను

ఈ ధరకు అందించడం ద్వారా ఇతర ఆండ్రాయిడ్ మొబైల్ యూజర్లను యాపిల్ తనవైపు తిప్పుకుంటుందని వారు అంచనా వేస్తున్నారు. సో. ఇక అంతా యాపిల్ ఫోన్లు చేతబట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నమాట

మొబైల్ మార్కెట్ కు భారత్ అతి పెద్ద మార్కెట్ గా

అదీగాక మొబైల్ మార్కెట్ కు భారత్ అతి పెద్ద మార్కెట్ గా అవతరిస్తుండటంతో ఆపిల్ ఇక్కడ అమ్మకాలు పెంచుకునేందుకు కొత్త వ్యూహాలు రచిస్తోంది. భారత్‌లో అమ్మకాల వృద్ధికోసం యాపిల్ సంస్థ ఇప్పటికే ఐఫోన్ 5ఎస్ ధరను తగ్గిస్తూ వచ్చింది.

ఖరీదైన సెల్‌ఫోన్, బైక్ కోసం రోజుల పసికందును

ఇదిలా ఉంటే ఖరీదైన సెల్‌ఫోన్, బైక్ కోసం రోజుల పసికందును అమ్ముకున్నాడో ప్రబుద్ధుడు. ఆగ్నేయ చైనాలోని ఫుజియాన్ రాష్ట్రానికి చెందిన డ్యూన్ (19) తన 18 రోజులు ఆడబిడ్డను సోషల్ మీడియాలో అమ్మకానికి

సుమారు రూ. 2.34 లక్షలకు

సుమారు రూ. 2.34 లక్షలకు అమ్మేశాడు. ఈ విషయం అధికారుల చెవిన పడటంతో దంపతులిద్దరూ కటకటాలపాలయ్యారు.

పాపను అమ్మి ఐ ఫోన్, బైక్ కొనుక్కోవాలని

డ్యూన్ స్థానిక ఇంటర్‌నెట్ సెంటర్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడి భార్య అనుకోకుండా గర్భం దాల్చి, పాపకు జన్మనిచ్చింది. పాపను అమ్మి ఐ ఫోన్, బైక్ కొనుక్కోవాలని ప్లాన్ వేశాడు.

కానీ వ్యవహారం ఎలాగో పోలీసులకు

అతడి బేరంతో.. పాపను కొనుక్కొన్న వ్యక్తి డబ్బులు చెల్లించాక ఇద్దరూ అక్కడి నుంచి పారిపోయారు. కానీ వ్యవహారం ఎలాగో పోలీసులకు చేరింది. విచారణ జరిపిన పోలీసులు యువ దంపతులిద్దర్నీ జైలుకు పంపించారు. కోర్టులో ప్రవేశపెట్టగా తల్లికి రెండున్నర సంవత్సరాలు, తండ్రి డ్యూన్‌కి మూడేళ్ల జైలు శిక్ష విధించింది.

విషయం తెలుసుకున్న తర్వాత పాపను కొనుక్కున్న వ్యక్తి

కాగా విషయం తెలుసుకున్న తర్వాత పాపను కొనుక్కున్న వ్యక్తి పోలీసులు ముందు హాజరయ్యి, బిడ్డను వారికి స్వాధీనం చేశాడు. అయితే బిడ్డను అమ్మడం నేరమని తనకు తెలియదని తల్లి జియావో మెయి (18) పోలీసులకు చెప్పింది.

ఆర్థికపరిస్థితి బాగోలేని కారణంగా ఇలా చేసినట్టు

ఆర్థికపరిస్థితి బాగోలేని కారణంగా ఇలా చేసినట్టు తెలిపింది. తాను కూడా పెంపకానికి వెళ్లానని, తన చుట్టుపక్కల బిడ్డలను వేరేచోటికి పంపిన వాళ్లను చాలా మందిని చూశానని చెప్పింది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి.

టెక్నాలజీ గురించి మరింత సమాచారం కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Apple iPhone 5S to get 50% cheaper after iPhone SE launch: Report
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot