ఐఫోన్6 vs గెలాక్సీ ఎస్5 (అగ్ని పరీక్ష)

Written By:

స్మార్ట్‌ఫోన్ విభాగంలో ఆపిల్, సామ్‌సంగ్‌ల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. ఇటీవల ఐఫోన్6, గెలాక్సీ ఎస్5ల మధ్య నిర్వహించిన మరో ఫైర్ టెస్ట్ ఆసక్తికర ఫలితాలను వెలుగులోకి తీసుకువచ్చింది. ఈ డివైజ్‌లు మన్నిక అలాగే మనుగడకు సంబంధించి అనేక విశ్లేషణలు వ్యక్తమవుతున్నప్పటికి, ఈ వీడియో ద్వారా వెల్లడైన ఫలితం మిమ్మల్ని నిజంగా షాకింగ్‌కు గురి చేస్తుంది.

అగ్ని పరీక్ష

యాపిల్ ఐఫోన్, సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్‌ల మధ్య అగ్ని పరీక్ష. ఎవరు గెలిచారో మీరే చూడండి.#smartphones #apple #samsung

Posted by GizBot Telugu on Friday, March 4, 2016

Source- Gadget Hospital

స్మార్ట్‌ఫోన్ పటిష్టతను బట్టి రేటింగ్ ఇవ్వటం ఇటీవల కాలంలో షరా మామూలైంది. ఈ రేటింగ్ ప్రక్రియలో భాగంగా సంబంధిత స్మార్ట్‌ఫోన్‌ను వివిధ ప్రతికూల వాతవరణాల్లో పరీక్షించి తద్వారా దాని మనుగడను అంచనావేస్తున్నారు. ఈ క్రింది వీడియోలో మీరు చూడబోయే ఐఫోన్6 vs గెలాక్సీ ఎస్5 ఫైర్ టెస్ట్ మిమ్మల్ని ఉత్కంఠకులోను చేస్తుంది. ప్రత్యేకమైన పాలిమర్‌తో అభివృద్ధి చేయబడిన గెలాక్సీ ఎస్5 వేడిన సైతం తట్టుకుని ఈ పోటీలో విజేతగా నిలవటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఐఫోన్ ప్రియులకు మాత్రం ఈ వీడియో పెద్ద షాకింగ్.

Read More : ఐఫోన్ హెడ్‌ఫోన్స్.. ఇవి ఎంతో ప్రత్యేకం

English summary
Apple iPhone 6 vs Samsung Galaxy S5 On Fire. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot