2,000 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డ ఐఫోన్ 6s!! తరువాత??

|

ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను కొన్న ప్రతి ఒక్కరు దానిని అపురూపంగా చూసుకుంటూ ఉంటారు. ఎంతలా అంటే దానిని నేలమీద పడేసిన ప్రతిసారీ చిన్నపాటి గుండెపోటు వచ్చే అంతలా. అయితే అటువంటి ఫోన్‌ ఎతైన ప్రదేశం నుండి కిందకు పడితే ఉహించుకోండి! ఎర్నెస్టో గెలియోట్టో అనే బ్రెజిలియన్ డాక్యుమెంటరీ సినిమా నిర్మాత విషయంలో ఈ సంఘటన జరిగింది.

ఐఫోన్ 6s

అతను విమానంలో 2000 అడుగుల ఎత్తున ప్రయాణం చేసేటప్పుడు తన ఐఫోన్ 6s ద్వారా చిత్రీకరిస్తున్నప్పుడు అకస్మాత్తుగా బలమైన గాలుల కారణంగా తన ఐఫోన్‌ కింద పడిపోయింది. అయితే అతని అదృష్టమో లేక కొత్త ఐఫోన్ కావడం చేతనో తెలీదు కానీ ఈ ఐఫోన్ సురక్షితంగా ఉంది. కిందకు పడిపోయే ముందు కెమెరా ఆన్‌లో ఉన్నందున ఈ మొత్తం సంఘటన వీడియోలో బంధించబడింది. అయితే ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలలో హల్ చల్ చేస్తోంది.

బ్రెజిల్ కు చెందిన మీడియా సంస్థ G1

ఈ సంఘటన బ్రెజిల్‌లోని రియో డి జనీరోకు తూర్పువైపున 100 మైళ్ల దూరంలో ఉన్న పెరే బీచ్‌లో జరిగింది. ఈ సంఘటనను మొదట బ్రెజిల్ కు చెందిన మీడియా సంస్థ G1 ప్రసారం చేసింది. విమానం నుండి ఫోన్ పడిపోయిన తరువాత ఎర్నెస్టో అతను దానిని కోల్పోయాడు అనుకోని దాని మీద ఆశలు వదులుకున్నాడు. అయితే దాని మీద మక్కువతో దాని యొక్క స్థానాన్ని తనిఖీ చేయడానికి GPS ట్రాకింగ్‌ను ఉపయోగించాడు. తీరా జరిగింది చూసి ఆశ్చర్య పోయాడు. కారణం 2000 అడుగుల ఎత్తు నుంచి కింద పడ్డా కూడా ఐఫోన్ పనిచేస్తూ ఉండడం.

GPS ట్రాకింగ్‌

ఐఫోన్ 6s స్మార్ట్‌ఫోన్‌ విమానం నుండి కింద పడిపోవడంతో ఆపిల్ పరికరాలలో అంతర్నిర్మిత జిపిఎస్ ట్రాకింగ్‌ ఫీచర్ ను దృష్టిలో ఉంచుకొని GPS ట్రాకింగ్‌ను ఉపయోగించి ఒక బీచ్ దగ్గర ఉన్నట్లు గుర్తించి అక్కడికి దానిని వెతుకుంటూ వెళ్ళాడు. అయితే అప్పటికి ఆ ఫోన్ పనిచేస్తూ ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. అయితే ఫోన్ యొక్క స్క్రీన్ యొక్క ప్రొటెక్షన్ గొరిల్లా గ్లాసుకు మాత్రమే కొద్ది మొత్తంలో నష్టం జరిగింది. ఫోన్ అద్భుతంగా పనిచేయడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తున్నది.

Best Mobiles in India

English summary
Apple iPhone 6s Survives 2000 Feet Drop From Airplane While Shooting Incident Recorded on Video

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X