Home
News

ఐఫోన్ 7 పై యాపిల్‌కు లాభమెంత..? వెలుగులోకి నివ్వెరపరిచే నిజాలు

By Sivanjaneyulu Bommu

ఐఫోన్ 6ఎస్ తయారీతో పోలిస్తే ఐఫోన్ 7 తయారీకి యాపిల్‌ కొంచం ఎక్కువ మొత్తంలో వెచ్చించాల్సి వచ్చినట్లు ప్రముఖ రిసెర్చ్ సంస్థ IHS Markit Ltd తెలిపింది.

ఐఫోన్ 7 పై యాపిల్‌కు లాభమెంత..? వెలుగులోకి నివ్వెరపరిచే నిజాలు

Read More : Moto E3 Powerతో తలపడుతున్న 10 పాపులర్ స్మార్ట్‌ఫోన్‌లు

పెద్ద బ్యాటరీతో పాటు ఎక్కువ మొత్తంలో స్టోరేజ్ కెపాసిటీని ఐఫోన్ 7లో నిక్షిప్తం చేయటం కారణంగా దాదుపుగా రూ.2500ను యాపిల్ అదనంగా ఖర్చుచేసినట్లు సదరు బిజినెస్ రిసెర్చ్ ప్రొవైడర్ అంచనా వేసింది.

5 డాలర్ల ప్రాథమిక తయారీ వ్యయంతో

5 డాలర్ల ప్రాథమిక తయారీ వ్యయంతో

5 డాలర్ల ప్రాథమిక తయారీ వ్యయంతో కలుపుకుని ఐఫోన్ 7 తయారీ ఖర్చు 224.80 డాలర్లుగా (మన కరెన్సీ ప్రకారం 15067) ఉందని ఐహెచ్‌ఎస్ మార్కెట్ అభిప్రాయపడింది.

ఇదే సమయంలో ఐఫోన్ 6ఎస్ తయారీ

ఇదే సమయంలో ఐఫోన్ 6ఎస్ తయారీ

ఇదే సమయంలో ఐఫోన్ 6ఎస్ తయారీకి యాపిల్ వెచ్చించిన ఖర్చు ఇంచుమించుగా 188 డాలర్లేనట (మన కరెన్సీ ప్రకారం 12600).

అంతర్జాతీయ మార్కెట్లో

అంతర్జాతీయ మార్కెట్లో

అంతర్జాతీయ మార్కెట్లో 32జీబి వర్షన్ ఐఫోన్ 7 ధర $649గా ఉంది. (మన కరెన్సీ ప్రకారం ఈ విలువ రూ.43498).

ఇండియన్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి

ఇండియన్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి

ఇండియన్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి ఐఫోన్ 7 ప్రారంభ వేరియంట్ ధర రూ.60,000గా ఉంది.

సామాన్య, మధ్యతరగతి ప్రజానీకానికి అందని ద్రాక్షలానే

సామాన్య, మధ్యతరగతి ప్రజానీకానికి అందని ద్రాక్షలానే

సామాన్య, మధ్యతరగతి ప్రజానీకానికి మాత్రం యాపిల్ ఐఫోన్ ఓ అందని ద్రాక్షలానే మిగిలింది. మార్కెట్లో రిలీజ్ అయ్యే కొత్త ఐఫోన్‌లను సొంతం చేసుకోవాలంటే దాదాపు రూ.50,000 నుంచి రూ.60,000 వరకు ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి.

ఐఫోన్ 6ఎస్ ప్లస్‌ తయారీ ఖర్చు

ఐఫోన్ 6ఎస్ ప్లస్‌ తయారీ ఖర్చు

IHS సంస్థ ఐఫోన్ 6ఎస్ ప్లస్‌ తయారీ అయ్యే ఖర్చు కేవలం 17,000నట. మార్కెట్లో ఈ ఫోన్ ఖరీదు మాత్రం 51,000 (విడుదల సమయంలో). అంటే 3 రెట్లు ఎక్కువన్నమాట.

ఐఫోన్ 6ఎస్ ప్లస్ (16జీబి వర్షన్

ఐఫోన్ 6ఎస్ ప్లస్ (16జీబి వర్షన్

ఐఫోన్ 6ఎస్ ప్లస్ (16జీబి వర్షన్) తయారీకి అవసరమయ్యే ముడి మెటీరియల్ ఖర్చు 15,800 మాత్రమేనట. తయారీ వ్యయంతో కలుపుకుంటే 17,000 అవుతుందట.

3డీ టచ్ ఫీచర్

3డీ టచ్ ఫీచర్

ఐఫోన్ 6ఎస్ ప్లస్ ఫోన్‌కు 3డీ టచ్ ఫీచర్ ప్రధాన కాంపోనెంట్‌గా నిలుస్తుంది. స్ర్కీన్‌లా ఉండే ఈ కాంపోనెంట్ ఖరీదు 3,580 మాత్రమేనట.

ఫోన్ ముందు, వెనుక భాగాల్లో

ఫోన్ ముందు, వెనుక భాగాల్లో

ఫోన్ ముందు, వెనుక భాగాల్లో కెమెరాలను ఏర్పాటు చేసేందుకు అయిన ఖర్చు 1,530 అట.

ఐఫోన్ యూనిట్‌ను అసెంబుల్ చేయాలంటే

ఐఫోన్ యూనిట్‌ను అసెంబుల్ చేయాలంటే

ఒక్క ఐఫోన్ యూనిట్‌ను పూర్తిగా అసెంబుల్ చేయాలంటే 24 గంటల సమయం పడుతుందట. ఫోన్ రిసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, షిప్పింగ్, లైసెన్సింగ్, మార్కెటింగ్ ఇంకా ఇతర తృతీయ ఖర్చులను కలుపుకున్నప్పటికి ఒక్కో ఐఫోన్ యూనిట్ పై యాపిల్‌కు భారీ స్థాయిలోనే లాభాలు ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple iPhone 7 more expensive to make than iPhone 6s: IHS. Read More in Telugu Gizbot...
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X