ఐఫోన్ 8లో అదిరిపోయే ఫీచర్!

By: Madhavi Lagishetty

ఆపిల్...ఈ ఫోన్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఐఫోన్ రిలీజ్ అవుతుందంటే చాలు ప్రపంచమంతా ఆసక్తిగా చూస్తుంది. ఆపిల్ నుంచి ఫోన్ రిలీజ్ అయ్యిందంటే...హాట్ కేకుల్లా అమ్ముడుపోతాయి. త్వరలో లాంచ్ కానున్న ఐఫోన్ 8పై ఆపిల్ భారీ అంచనాలను పెట్టుకుంది. మరీ ఆపిల్ ఐఫోన్ 8 ఫీచర్స్ ఎలా ఉండబోతున్నాయి?

ఐఫోన్ 8లో అదిరిపోయే ఫీచర్!

ఆపిల్ నుంచి వస్తున్న స్పెషల్ ఎడిషన్ ఐఫోన్ 8..బెజెల్స్ మీద ద్రుష్టి పెట్టకుండా...డిస్ ప్లే మీదనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఫోన్ ఫ్రంట్ సైడ్ లో ఫిజికల్ హోం బటన్ను ఉంటుంది. ఫిజికల్ వర్చువల్ బటన్ ఉన్న తొలిఫోన్ ..ఐఫోన్ 8 మాత్రమే అని చెప్పొచ్చు. ఐఫోన్ 8లో స్లిప్/వేక్ బటన్ను సిరి, డిజిటల్ అసిస్టెంట్ యాక్టివ్ చేస్తుంది.

సిరిని యాక్టివ్ చేయడానికి ఇప్పుడున్న ఐఫోన్ మోడళ్లలో , వినియోగదారులు లాంగ్ ప్రొసెస్ హోం బటన్ను ప్రెస్ చేయాలి. అయితే ఇప్పటి వరకు ఉన్న హోం బటన్ ఆపిల్ పదవ వార్షికోత్సవంతో ఎడిషన్ తో తొలగించనున్నారు. హోం బటన్ కు సంబంధించిన ఫంక్షనాల్టిస్ అన్ని కూడా లాక్ బటన్ కు మార్చబడుతాయి. ఇది ఒక ఐఓఎస్ డెవలపర్ గా ఉన్న గ్విల్హెర్మ్ రాంబోని పేర్కొంది.

మాక్రోమోర్స్ రిపోర్ట్ ప్రకారం...లాక్ బటన్ను ప్రెస్ చేసినప్పుడు సిరిని యాక్టివేట్ చేస్తుందని తెలిపారు. డిజిటల్ అసిస్టెంట్ యాక్టివ్ చేయడానికి ...ట్రేడిషన్ హెవీ సిరి వాయిస్ అనేది కమాండ్ యొక్క మరో మార్గం అని చెప్పొచ్చు. డెవలపర్ చేసిన కామెంట్స్ సోర్స్ కోడ్ బేస్ చేసుకుని కనుగొన్నారు. బ్రెజిలియన్ డెవలపర్ సంస్థ యొక్క బీటా సాఫ్ట్ వేర్లో..అప్ కమ్మింగ్ ఆపిల్ డివైస్ల గురించి అనేక వివరాలను వెల్లడించింది. TVOS 11, HomePod ఫర్మ్వేర్ తోపాటు 4కే ఆపిల్ టీవీ యొక్క సూచనలు కూడా ఉన్నాయి.

కళ్లు చెదిరే ఆఫర్లతో దేశీయ దిగ్గజం సవాల్ !

ఆగస్టులో iHelp BR, బ్రెజిల్ బ్లాగ్ హోంపాడ్ ఫర్మ్వేర్లో కోడ్ లైన్ను కనుగొన్నది. స్లీప్/వేక్ బటన్ ఉపయోగంలో ఉన్న యాప్ ఆధారంగా OLED iPhone లో ఫంక్షన్స్ మారుతాయని సూచించింది. “ lockButtonAooropriateForShutter” లైన్ కోడ్ పాయింటింగ్ తో నేటివ్ కెమెరా యాప్ డ్యుయల్ స్విచ్ లను సూచించనుంది.

సెప్టెంబర్ 12న ఆపిల్ ఐఫోన్ 8 , ఐఫోన్ 7S మరియు ఐఫోన్ 7 ప్లస్ లను లాంచ్ చేయడానికి ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేశారు. మూడు కొత్త ఐఫోన్లను ఐఫోన్8, ఐఫోన్8 ప్లస్, ఐఫోన్ X రిలీజ్ చేయనున్నట్లు కొన్ని నివేదికలు వెల్లడించాయి. అంతేకాదు ఆపిల్ టీవీని HDR మరియు 4కె సపోర్ట్ తో వాచ్ LTE సామర్థ్యం ఉన్న ఆపిల్ వాచ్ కూడా రిలీజ్ చేయునున్నట్లు రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఇవి ఎంతవరకు వాస్తవం అనేది రానున్న కొన్ని రోజుల్లోనే చూడబోతున్నాం.

English summary
Apple iPhone is believed to let users activate Siri via the Sleep/Wake button instead of the home button.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot