ఐఫోన్8 రిలీజ్ డేట్ వచ్చేసింది!

By: Madhavi Lagishetty

ఐఫోన్ కు ఉన్న క్రేజే వేరు. ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ కు ఎంత డిమాండ్ ఉందో అందరికీ తెలుసు. ఐఫోన్ మార్కెట్లోకి రిలీజ్ అవుతుందంటే...అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తారు. అయితే ఐఫోన్ 8 విడుదలపై గత కొన్ని రోజుల రూమర్లు వస్తున్నాయి. ఆపిల్ కంపెనీ ఐఫోన్ 10 ఏళ్ల వార్షికోత్సవంలో ఐఫోన్ 8 ఆలస్యంగా రిలీజ్ అవుతుందని తెలిపింది.

ఐఫోన్8 రిలీజ్ డేట్ వచ్చేసింది!

టచ్ ఐడి అనుసంధానంపై గందరగోళం నెలకొంది. OLED డిస్ ప్లే అమలు అసలు సమస్యకు కారణంగా సంస్థ తెలిపింది. ఏదిఏమైనా కొంతమంది ప్రఖ్యాత పరిశ్రమ విశ్లేషకులు ఈ వాదనలను కొట్టిపారేస్తున్నారు. ఐఫోన్ 8వచ్చే వారం రిలీజ్ చేస్తున్నారని...ఆపిల్ విడుదల చేసిన నాల్గవ త్రైమాసిక ఆదాయాల ఆధారంగా చెప్పారు.

ఐఫోన్ రిలీజ్ ఎందుకు ఆలస్యమవుతుందో RBC విశ్లేషకులు అమిత్ దర్యానాని చెప్పారు. ఆపిల్ ఐఫోన్ అమ్మకాలలో 12శాతం వరుస వ్రుద్ధిని అంచనా వేసింది. కానీ ఐదు సంవత్సరాల సగటు సీక్వెన్షియల్ వ్రుద్ధి ఐఫోన్ క 7శాతం ఉందని ..అది విలువైనది కాబట్టి ఆకస్మిక వ్రుద్ధి ఎంతో ఉందో ఖచ్చితంగా చెప్పలేమన్నారు.

మీ IP చిరునామాను కాపాడుకోండి ఇలా!

ఇక మరో విశ్లేషకులు రామ్ సిహ్రా ఐఫోన్ 8 రిలీజ్ డేట్ ఖచ్చితంగా తెలియకపోయినా...ఆఫిల్ ఐఫోన్ 7s,ఐఫోన్ 7 ప్లస్ వచ్చే నెలలో లాంచ్ అవుతాయని తెలిపారు.

జెపి మోర్గాన్ రాడ్ హాల్ కూడా వచ్చే నెలలో ఆపిల్ ఆర్థిక అంచనాలతో సెప్టెంబర్ లో ఐఫోన్ 7ఎస్ సీరిస్ ను రిలీజ్ చేయవచ్చని సూచిస్తున్నామన్నారు. ఐఓఎస్ 11 ల్యాప్ టాప్ లకు ప్రత్యామ్నాయంగా ఐప్యాడ్ ను మారుస్తుందని నమ్ముతున్నామన్నారు.

USB విశ్లేషకులు స్లీవెన్ మాలనోవిచ్ ఐఫోన్ 8ను అక్టోబర్ లాంచ్ చేస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. అయితే రోసేన్ బ్లాట్ విశ్లేషకులు జున్ జాంగ్ కూడా సెప్టెంబర్ లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

అయిలే ఐఫోన్ 8 విడుదలపై ఎవరి అంచనాలు నిజమవుతాయో వేచి చూడాలి.

English summary
iPhone 7s and iPhone 7s Plus will get unveiled in September.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot