ఆపిల్ ఐఫోన్ 8 వచ్చేస్తోంది...ధర చూస్తే బేజారే!

By: Madhavi Lagishetty

ఐఫోన్ పదవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించనున్న...మెగా ఈవెంట్ పై ఆపిల్ స్పందించింది. మార్కెట్లో ఎన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్న...ఆపిల్ సైలెంట్ గా ఉంది. సెప్టెంబర్ 12న జరగబోతున్న ఈ మెగా ఈవెంట్ కు సంబంధించిన ఆహ్వానాలను మీడియాకు పంపుతోంది.

ఆపిల్ ఐఫోన్ 8 వచ్చేస్తోంది...ధర చూస్తే బేజారే!

అయితే ఐఫోన్ రిలీజ్ సెప్టెంబర్ 12కు అనుకున్నట్లుగా...హ్యాండ్ సెట్ అధికారిక రిలీజ్ కు మరికొంత సమయం పట్టనుంది. డిజైన్ ప్రక్రియ పూర్తైనప్పటికీ...కొన్ని నివేదికల ప్రకారం ప్రొడక్ట్ ప్రారంభం లేదా స్మార్ట్ ఫోన్ల్ కేవలం ప్రొడక్ట్ స్టేజ్ లోకి మాత్రమే ప్రవేశించింది.

కొరియన్ పార్ట్స్ సప్లయర్ ఆగస్టు చివరిలో ఆపిల్ ఐఫోన్ పార్ట్స్ కోసం షిప్ మెంట్స్ ను ప్రారంభించిందని పేర్కొంది. అది కొత్త ఫ్లాగ్ షిప్ అక్టోబర్ తర్వాత మాత్రమే బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆపిల్ యొక్క కొత్త ఐఫోన్ 8 ను కూడా లిమిటెడ్ స్టాక్ లోనే 2నుంచి 4 మిలియన్లకు వరకు తయారు చేస్తున్నారు.

లిల్లీ డ్రోన్ను రీలాంచ్ చేసిన మోటా గ్రూప్!

ఈ న్యూ ఐఫోన్ మూడు వేరియంట్లలో రిలీజ్ అవుతుందని రూమర్స్ వచ్చాయి. వాటిలో OLED మోడల్ కూడా ఉంది. అంతేకాదు OLED మోడల్ నవంబర్ వరకు ఆలస్యం కావచ్చని ఇండస్ట్రీ సోర్స్ అంచనా వేస్తున్నాయి. సెప్టెంబర్ లో OLED ఐఫోన్ను ప్రారంభించిప్పటికీ...చాలా తక్కువ స్టాక్ అందుబాటులో ఉంటుందని ఇన్వెస్టర్ తో మాట్లాడుతున్నప్పుడు ఒకరు చెప్పారు.

ప్రీవియస్ రిపోర్ట్స్ కూడా రెండు LCD మోడళ్లకు పార్ట్ సప్లై జూన్ నుంచి ప్రారంభించవచ్చని సూచించాయి. రెండు ఐఫోన్ మోడల్స్ రిలీజ్ తర్వాత వెంటనే మార్కెట్లోకి రానున్నాయి. ఐఫోన్ 8 మోడల్ లాంచ్ వాల్యూమ్ ఇప్పటికీ మిస్టరీగానే ఉంది కానీ ఐఫోన్ 7 లతో పోలిస్తే తక్కువగా ఉంటుంది.

పార్ట్స్ సప్లయర్ కోసం శాంసంగ్ డిస్ ప్లే, ఐఫోన్ 8కోసం అన్ని OLED ప్యానెల్లను సరఫరా చేస్తుది. అయితే LG 7s మరియు 7s ప్లస్ మోడళ్లకు LCD స్క్రీన్ల యొక్క LG డిస్ ప్లే ఒకటి.

English summary
Apple is all set to unveil its new flagship the iPhone 8 next week on September 12 and the company has already sent out media invites for the launch event.
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot