Home
News

సగానికి పైగా తగ్గిన ఐఫోన్ బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ఖర్చు

By Bommu Sivanjaneyulu

iOS 11.2 అప్‌డేట్ అనంతరం ఐఫోన్ మోడల్స్ పనితీరు నెమ్మదిస్తోన్న నేపథ్యంలో యాపిల్ తన కస్టమర్‌లకు క్షమాపణలు చెప్పింది. ఈ సమస్య పై మరింతగా దృష్టిసారించిన యాపిల్ నష్టనివారణను తగ్గించుకునే క్రమంలో బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ఖర్చును సగానికిపైగా తగ్గించింది.

Apple iPhone battery replacement cost in India will be just Rs. 2,000

ఈ ప్రకటన వెలువడక ముందు యూఎస్ మార్కెట్లో ఐఫోన్ బ్యాటరీని రీప్లేస్ చేయాలంటే 79 డాలర్ల వరకు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. ప్రకటన అనంతరం కేవలం 29 డాలర్లకే బ్యాటరీ రీప్లేస్ మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతుంది.

ఇక భారత్ విషయానికి వచ్చేసరికి ఐఫోన్ బ్యాటరీని రీప్లేస్ చేయాలంటే దాదాపుగా రూ.6,500 వరకు గతంలో ఖర్చు అయ్యేది. తాజా ప్రకటన నేపథ్యంలో రూ.2000కే బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ప్రక్రియ పూర్తవుతుంది.

91మొబైల్స్ రిపోర్ట్ చేసిన కథనం ప్రకారం ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ ప్లస్, ఐఫోన్ 7, ఐఫోన్ 7 ప్లస్ మోడల్స్‌కు మాత్రమే ఈ బ్యాటరీ రీప్లేస్‌మెంట్ ప్రోగ్రామ్ వర్తిస్తుంది. ఈ మోడల్స్‌ను వినియోగించుకుంటోన్న యూజర్లు తమకు సమీపంలోని యాపిల్ సర్వీస్ పార్టనర్ వద్దకు వెళ్లటం ద్వారా తమ ఫోన్ బ్యాటరీలను రీప్లేస్ చేసుకునే వీలుంటుంది.

ఐఫోన్‌లలో తలెత్తుతోన్న బ్యాటరీ లోపాన్ని తొలత ఓ రెడ్డిట్ యూజర్ తన ఐఫోన్ 6ఎస్ ద్వారా గుర్తించారు. iOS 11.2 అప్‌డేట్ వేసిన తరువాత తన ఫోన్ నెమ్మదించటంతో ఆయనకు అనుమానం వచ్చి బ్యాటరీని రీప్లేస్ చేసిన చూసారు.

బ్యాటరీ మార్చిన తరువాత ఫోన్ పనితీరు సాధారణ కండీషన్‌కు రావటంతో గీక్‌బెంచ్ బెంచ్‌మార్కింగ్ యాప్ ద్వారా మరోసారి సమస్యను క్రాస్ చెక్ చేసుకుని వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసారు. దీని పై స్పందించిన యాపిల్, సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ల కారణంగా పాత ఐఫోన్ బ్యాటరీ పై ఒత్తిడి పడటం వాస్తవమేనని ఒప్పుకుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple announced that it will provide battery replacements for the older iPhones at a lesser cost in the US. Following this move, the company has now slashed the battery replacement cost of the older iPhones models in India. The users of older iPhones can replace the battery of the device by paying Rs. 2,000 in India.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X