Home
News

ఐఫోన్ SE 3ని పాత ఐఫోన్ మోడల్ ధరకే రూ.16,000 తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్లో పొందవచ్చు!! కానీ...

ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ ఆపిల్ ఇటీవల విడుదల చేసిన సరికొత్త ఐఫోన్ SE 3 ని తగ్గింపు ధర వద్ద లభిస్తున్నది. డిస్కౌంట్ ధర విషయానికి వస్తే ఆపిల్ సంస్థ 2020లో ప్రారంభించబడిన ఐఫోన్ SE యొక్క ధర వద్దకే అందుబాటులోకి రావడం అనేది ఒక అద్భుతమైన ఆఫర్. ఐఫోన్ SE 3ని కంపెనీ మార్చిలో ఇండియాలో లాంచ్ చేసింది. ఐఫోన్ SE 3 ఫోన్ యొక్క ముఖ్యమైన స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది కంపెనీ యొక్క తాజా మరియు అత్యంత శక్తివంతమైన A15 బయోనిక్ చిప్‌సెట్‌తో పాటుగా దాని యొక్క మునుపటి వెర్షన్ ఐఫోన్ SE 2020 కంటే మెరుగైన పనితీరుతో పాటుగా మెరుగైన కెమెరా సెటప్ లను కలిగి ఉంది. iPhone SE ఇండియాలో రూ.43,900 ధర వద్ద ప్రారంభించబడింది. ఆపిల్ కొత్త ఫోన్ ఐఫోన్ SE 3ని డిస్కౌంట్ ధర వద్ద ఎలా పొందవచ్చో తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

ఐఫోన్ SE 3

ప్రముఖ ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం ఐఫోన్ SE 3 కొత్త ఫోన్ ని ఐఫోన్ SE 2020 ధరకే అందిస్తోంది. అయితే ఇందులో గమనించదగ్గ విషయం ఏమిటంటే ఐఫోన్ SE 3 యొక్క 64GB స్టోరేజ్‌ బేస్ మోడల్‌ను రూ.43,900 ధర ట్యాగ్‌తో ఇప్పుడు పొందవచ్చు. దీనిని మీరు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేసినప్పుడు మీరు ఈ డివైస్‌పై నేరుగా రూ.2,000 తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌ని ఉపయోగించి కొనుగోలు చేస్తే కనుక మీరు అదనంగా 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

ఐఫోన్ SE 3 ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు

ఐఫోన్ SE 3 ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లు

ఐఫోన్ SE 2020 ధర వద్దనే కొత్త ఐఫోన్ SE 3ని మీరు పొందడానికి ఫ్లిప్‌కార్ట్ యొక్క ఆఫర్‌లో మీ పాత ఐఫోన్‌లపై ఎక్సచేంజ్ ఆఫర్లను అందిస్తున్నది. ఐఫోన్ SE 3 కొనుగోలుపై ఎక్సచేంజ్ ఆఫర్లలో దాదాపుగా రూ.16,000 వరకు తగ్గింపు పొందవచ్చు. ఉదాహరణకు మీరు పాత 64GB స్టోరేజ్ మోడల్ ఐఫోన్ 11ని కలిగి ఉంటే కనుక మీరు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లో భాగంగా రూ.13,800 వరకు డిస్కౌంట్ ని పొందవచ్చు. అయితే ఆసక్తిగల కొనుగోలుదారులు కొనుగోలు చేయడానికి ముందు Flipkartలో ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ల యొక్క నిబంధనలు మరియు షరతులను ఒకటికి రెండు సార్లు పరిశీలించాలని కోరుకుంటున్నాము.

ఐఫోన్ SE 3 స్పెసిఫికేషన్స్

ఐఫోన్ SE 3 స్పెసిఫికేషన్స్

ఆపిల్ ఐఫోన్ SE 3 మోడల్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఆపిల్ యొక్క కొత్త అంతర్గత A15 బయోనిక్ SoC చేత నిర్మించబడి ఉంది. ఇందులో 6 కోర్ CPU రెండు హై-పెర్ఫార్మెన్స్ మరియు నాలుగు సమర్థవంతమైన కోర్లతో పాటు 16-కోర్ న్యూరల్ ఇంజిన్ ను కలిగి ఉన్నాయి. అలాగే ఇది 2.5 గంటల మెరుగైన బ్యాటరీ లైఫ్ ను కలిగి ఉంది. ఇది 256GB కంటే ఎక్కువ స్టోరేజ్‌తో లభ్యమవుతున్న మొట్టమొదటి నాన్-ప్రో ఐఫోన్‌ కావడం విశేషం. ఐఫోన్ SE 3 ఫోన్ 20 శాతం స్క్రీన్ స్పేస్, 120Hz రిఫ్రెష్ రేట్ తో 5.4-అంగుళాల మెరుగైన ప్రకాశాన్ని కలిగి ఉన్నాయి. పవర్-ఎఫెక్టివ్ సిస్టమ్ కోసం స్వైప్ స్పీడ్ వంటి యూజర్ ఇన్‌పుట్ ఆధారంగా వాటి రిఫ్రెష్ రేట్లను డైనమిక్‌గా సర్దుబాటు చేయవచ్చు. అలాగే ఇది పగటిపూట ప్రకాశం వరుసగా 800 నిట్స్ మరియు 1000 నిట్స్ కాగా, గరిష్టంగా హెచ్‌డిఆర్ ప్రకాశం 1200 నిట్స్ వరకు ఉంటుంది. ఇవి డాల్బీ విజన్ HDR10 మరియు HLG కి కూడా మద్దతు ఇస్తారు. వీటి ముందు భాగంలో సిరామిక్ షీల్డ్ మెటీరియల్ మరియు IP68 డస్ట్ మరియు వాటర్ రెసిస్టెన్స్ రేటింగ్‌లు ఉన్నాయి. అవి పింక్, బ్లూ, మిడ్నైట్, స్టార్‌లైట్, మరియు రెడ్ వంటి ఐదు కొత్త కలర్ లలో అందుబాటులో ఉన్నాయి.

Best Mobiles in India

English summary
Apple iPhone SE 3 New Phone Now Available at The Discount Price on Flipkart
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X