Apple యూజ‌ర్లు ఇప్పుడు iOS 16 ప‌బ్లిక్ బీటా వెర్షన్ ట్రై చేయొచ్చు!

|

యూఎస్‌కు చెందిన ప్ర‌ముఖ మొబైల్స్ త‌యారీ సంస్థ Apple త‌మ యూజ‌ర్ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. iOS 16 ప‌బ్లిక్ బీటా వెర్షన్ ను అందుబాటులోకి తెచ్చింది. యూజ‌ర్లు ఇప్పుడు ఆ iOS 16 బీటా వ‌ర్శ‌న్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చ‌ని తెలిపింది. ఇప్ప‌టికే కంపెనీ గ‌త‌నెల‌లో నిర్వ‌హించిన Worldwide Developer Conference (WWDC) లో iOS 16 ను ఆవిష్క‌రించిన విష‌యం తెలిసిందే. అయితే తాజాగా అందుకు సంబంధించి ప‌బ్లిక్ బీటా వెర్షన్ ను కంపెనీ అందుబాటులోకి తేవ‌డం విశేషం.

Apple iOS 16 beta

iOS 16 ప‌బ్లిక్ బీటా వెర్షన్ ను ఇన్‌స్టాల్ చేయ‌డం ఎలా:
iOS 16 బీటా వెర్షన్ ను డౌన్‌లోడ్ చేసుకోవ‌డానికి యూజ‌ర్లు ముందుగా Apple బీటా ప్రోగ్రామ్ సైట్‌లోకి వెళ్లి వారి iPhone లేదా iPad డివైజ్‌ను అందులో రిజిస్ట‌ర్ చేయాలి. ఆ త‌ర్వాత ఈ కింది స్టెప్స్‌ను ఫాలో అవ్వాల్సి ఉంటుంది.

* ముందుగా యాపిల్ బీటా సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామ్ సైట్ ఓపెన్ చేయాలి. ఆ త‌ర్వాత సైన్ అప్ చేయాలి.
* సైన్ అప్ చేసిన త‌ర్వాత మీ Apple ఐడీ తో లాగిన్ చేయాలి. అనంత‌రం యాపిల్ కంపెనీ యూజ‌ర్ ధ్రువీక‌ర‌ణ కోసం టూ స్టెప్ వెరిఫికేష‌న్ చేస్తుంది.
* ఆ త‌ర్వాత ట‌ర్మ్స్ అండ్ కండిష‌న్స్ యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది.
* ఇప్పుడు బ్యాక‌ప్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
* బ్యాక‌ప్ క్రియేష‌న్ పూర్తి అయిన త‌ర్వాత beta.apple.com/profile సైట్‌ను ఓపెన్ చేసి కాన్ఫిగ‌రేష‌న్ ప్రొఫైల్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* మీ డివైజ్‌ రిజిస్ట‌ర్ ప్ర‌క్రియ పూర్తి అయిన‌ త‌ర్వాత.. మీరు మీ డివైజ్‌లో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌ను కొనుగొన‌వ‌చ్చు. మీరు అన్ని డేటా ఫైల్స్‌ను బ్యాక‌ప్ చేసుకున్నామ‌ని నిర్దార‌ణ చేసుకున్న త‌ర్వాత బీటా ఇన్‌స్టాలేష‌న్ కోసం ఈ కింది ప‌ద్ద‌తి పాటించాలి.

* సెటింగ్స్‌లోకి వెళ్లి జ‌న‌ర‌ల్ ఆప్ష‌న్ ఎంచుకోవాలి. జ‌న‌ర‌ల్ సెక్ష‌న్‌లోకి వెళ్లిన త‌ర్వాత సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ సెక్ష‌న్‌ను ఎంచుకోవాలి. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ సెక్ష‌న్‌లో కొత్త అప్‌డేట్స్ రెడీ ఉంటాయి. ఆ త‌ర్వాత కొత్త సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అనంత‌రం ఇక‌ మీ డివైజ్ iOS 16 బీటా వ‌ర్శ‌న్ లోకి అప్‌డేట్ అవుతుంది.

కాగా, ఈ వ‌ర్శ‌న్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ముందు మొత్తం డేటాను బ్యాకప్ చేసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి అని కంపెనీ చెప్పింది.

Apple iOS 16 beta

iOS 16 లో ప్ర‌త్యేక‌తలు ఏంటి:
రాబోయే త‌రం ఐఫోన్ల‌లో iOS 16 మెరుగైన ఫీచ‌ర్ల‌ను అందిస్తుంది. కస్టమైజ్ లాక్ స్క్రీన్ ఫీచ‌ర్ ద్వారా Apple వినియోగదారులకు వారి లాక్ స్క్రీన్‌లపై మరింత నియంత్రణను ఇవ్వ‌నుంది. ఈ ఫీచ‌ర్ ద్వారా యూజ‌ర్లు వాల్‌పేపర్, ఫాంట్‌లు, థీమ్‌లను మరింత సులువుగా మార్చుకోవ‌చ్చు. అంతేకాకుండా లాక్ స్క్రీన్‌లోనే విడ్జెట్స్ కూడా పెట్టుకోవ‌చ్చు. దాంతో పాటుగా ఐమెసేజెస్ ఉప‌యోగించే iOS 16 యూజ‌ర్లు నిర్దిష్ట స‌మ‌యంలో ఒక‌సారి సెండ్ చేసిన మెసేజెస్‌ను అన్‌సెండ్ లేదా ఎడిట్ చేసే సౌక‌ర్యం వ‌స్తుంది. కాగా, iOS 16 అధికారిక వ‌ర్శ‌న్‌ సెప్టెంబ‌ర్ నెల‌లో విడుద‌ల కానుంది. 2016 త‌ర్వాత వ‌చ్చిన డివైజ్‌ల‌లో ఈ iOS 16 వ‌ర్శ‌న్ అందుబాటులోకి వ‌స్తుంది. మ‌రోవైపు యాపిల్ కంపెనీ నుంచి త్వ‌ర‌లో విడుద‌ల కానున్న iPhone 14 కూడా iOS 16 వ‌ర్శ‌న్‌తో రానున్న‌ట్లు సమాచారం.

iPhone14 మ్యాక్స్ లీక్ స్పెసిఫికేషన్‌ల వివరాలు
iPhone14 మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ కి సంబందించిన స్పెసిఫికేషన్స్ వివరాలు లీక్ అయ్యాయి. టిప్‌స్టర్ లీక్ సమాచారం ప్రకారం ఆపిల్ సంస్థ నుంచి రాబోయే ఐఫోన్ 14 మ్యాక్స్ ఫోన్ యొక్క స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇది 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.68-అంగుళాల ఫ్లెక్సిబుల్ OLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 2,778×1,284 పరిమాణంలో 458 పిక్సెల్‌ల(PPI) సాంద్రతను కలిగి ఉంటుంది. ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుత జెనరేషన్ A15 బయోనిక్ SoCతో రన్ అవుతూ 6GB LPDDR4X RAMతో జతచేయబడి వస్తుంది. ప్రస్తుతం అదే చిప్ తో ఐఫోన్13 సిరీస్ ఫోన్లు మరియు కొత్త ఐఫోన్ SE (2022) కూడా శక్తిని పొందుతున్నాయి. గత లీక్‌ల ప్రకారం ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మరియు ఐఫోన్14 ప్రో మాక్స్ ఫోన్లు రెండు కూడా A16 బయోనిక్ SoCలతో శక్తిని పొందే అవకాశం ఉంది.

Best Mobiles in India

English summary
Apple iPhone Users Can Now Try Out iOS 16 With Public Beta

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X